Tuesday, December 8, 2015

విరజాజి పువ్వుల్లారా

చిత్రం: కవిత  (1976)
సంగీతం:  రమేశ్ నాయుడు
గీతరచయిత:  ఆరుద్ర
నేపధ్య గానం: సుశీల

పల్లవి :

విరజాజి పువ్వుల్లారా.. వెల లేని రవ్వల్లారా
చిన్నారి పాపల్లారా..మా కంటి దివ్వెల్లారా
సుప్రభాతం.. మ్మ్ మ్మ్ మ్మ్.. సుప్రభాతం

విరజాజి పువ్వుల్లారా.. వెల లేని రవ్వల్లారా
చిన్నారి పాపల్లారా..మా కంటి దివ్వెల్లారా
సుప్రభాతం.. మ్మ్ మ్మ్ మ్మ్.. సుప్రభాతం

చరణం 1 :

లలలా..ఆ..లలలా..ఓ..హో..
లలలలలలలాలలా..ఓ..లలలా ఆ

కల్లాకపటం తెలియని మీలో చల్లగ దైవం వెలిసేను
దైవం మెలిగే తావుల్లోనే ధర్మం తప్పక నిలిచేను
దైవాన్నే నమ్మండి.. ధర్మంగా నడవండి..ఈ
తలితండ్రులు గర్వించేలా.. తలయెత్తుకు తిరగండి

విరజాజి పువ్వుల్లారా.. వెల లేని రవ్వల్లారా
చిన్నారి పాపల్లారా.. మా కంటి దివ్వెల్లారా
సుప్రభాతం..మ్మ్ మ్మ్ మ్మ్..సుప్రభాతం..మ్మ్

చరణం 2 :

లలలా..ఆ..లలలా..ఓ..హో..
లలలలలలలాలలా..ఓ..లలలా ఆ

ఆటా పాటల ఆడుతుపాడుతు మేటి చదువులే చదవాలి
చదివిన చదువులు పెంచును మీలో చక్కని మంచి మనసులు
మంచితనం పెంచండి..మనిషి లాగ బతకండి..

విరజాజి పువ్వుల్లారా.. వెల లేని రవ్వల్లారా
చిన్నారి పాపల్లారా..మా కంటి దివ్వెల్లారా
సుప్రభాతం.. మ్మ్ మ్మ్ మ్మ్..సుప్రభాతం
సుప్రభాతం.. మ్మ్ మ్మ్ మ్మ్..సుప్రభాతం

No comments:

Post a Comment