Monday, February 29, 2016

బంగారానికి సింగారానికి




చిత్రం :  మండే గుండెలు (1979)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల, బాలు  



పల్లవి :



బంగారానికి సింగారానికి... కుదిరింది ఈనాడు బేరం
అసలిచ్చేది వడ్డీ కోసం...  పడుతోంది పడరాని గారాం...


బంగారానికి సింగారానికి...  కుదిరింది ఈనాడు బేరం
అసలిచ్చేది వడ్డీ కోసం... పడుతోంది పడరాని గారాం...


బంగారానికి సింగారానికి కుదిరింది ఈనాడు బేరం



చరణం 1 :


కాచే చెట్టుని కాచే వాడికే కాయలు దక్కాలి
కన్నెబిడ్డను గట్టుకు చేర్చిన కాళ్ళకి మొక్కాలి



చేసిన మేలుకు చెమ్మగిల్లిన కళ్ళను చూడాలి
చేసిన మేలుకు చెమ్మగిల్లిన కళ్ళను చూడాలి
అది చెప్పలేని పెదవులు పెట్టిన ముద్దులు పండాలి


బంగారానికి సింగారానికి కుదిరింది ఈనాడు బేరం



చరణం 2 :


చీరల రంగులు ఏనైనా దారంతోటే నేసేది
తీరని కోరిక ఏదైనా మారాం చేసే గెలిచేది


వయసే గారాం పొయ్యేది... మనసే మారాం చేసేది
గాజుల చేతుల తాళం తోనే కళ్యాణ మేళం మ్రోగేది


బంగారానికి సింగారానికి కుదిరింది ఈనాడు బేరం

చరణం 3 :


చిటపటలాడే చినుకులు కలిసే వరదై వచ్చేది
చిరుబురులాడే చిలిపితనాలే వలపుగ మారేది
చిటపటలాడే చినుకులు కలిసే వరదై వచ్చేది
చిరుబురులాడే చిలిపితనాలే వలపుగ మారేది


కొండకు పక్కన కోనుంటేనే నిండుగ ఉండేది
కొండకు పక్కన కోనుంటేనే నిండుగ ఉండేది
ఒకటికి పక్కన ఒకటుంటేనే రెండొకటయ్యేది


బంగారానికి సింగారానికి... కుదిరింది ఈనాడు బేరం
అసలిచ్చేది వడ్డీ కోసం...  పడుతోంది పడరాని గారాం...


బంగారానికి సింగారానికి...  కుదిరింది ఈనాడు బేరం

కుదిరింది ఈనాడు బేరం...




Sunday, February 28, 2016

చల్లా చల్లని చందమామా

చిత్రం :  మండే గుండెలు (1979)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : సుశీల, బాలు  


పల్లవి :


చల్లా చల్లని చందమామా... ఇలా వేడెక్కిపోతే ఏలాగమ్మా
చల్లా చల్లని చందమామా... ఇలా వేడెక్కిపోతే ఏలాగమ్మా


అత్తమీద కోపం దుత్తమీద చూపేది
అన్యాయం అన్యాయం చల్లారమ్మా
అత్తమీద కోపం దుత్తమీద చూపేది
అన్యాయం అన్యాయం చల్లారమ్మా

దపా దపా దపదపదప... దపా దపా దపదపదప


చల్లా చల్లని చందమామా... ఇలా వేడెక్కిపోతే ఏలాగమ్మా



చరణం 1 :


దిబ్బరొట్టె వున్నాది తినుకోనూ... చేప పులుసు వున్నాది నంజుకోనూ
దిబ్బరొట్టె వున్నాది తినుకోనూ... చేప పులుసు వున్నాది నంజుకోనూ


తిని చూడు ఒకసారి రవ్వంతా... దెబ్బకు దిగుతుంది వేడంతా
తినిచూడు ఒకసారి రవ్వంతా... దెబ్బకు దిగుతుంది వేడంతా


దిగకుంటె నీమీద ఒట్టేనూ... తినకుంటే నేనీడే ఛస్తానూ
దిగకుంటె నీమీద ఒట్టేనూ... తినకుంటే నేనీడే ఛస్తానూ

దపా దపా దపదపదప... దపా దపా దపదపదప


అల్లరల్లరి సత్యభామా... అసలే వేడెక్కి వున్నాను ఊర్కోవమ్మా
అల్లరల్లరి సత్యభామా... అసలే వేడెక్కి వున్నాను ఊర్కోవమ్మా


అత్త మీద కోపం చూపెందుకు నాకు దుత్తల్లే నువ్వే దొరికావమ్మా
అత్తమీద కోపం చూపెందుకు నాకు దుత్తల్లే నువ్వే దొరికావమ్మా
భామా భామా భామా భామా భామా.... భామా భామా భామా భామా భామా


అల్లరల్లరి సత్యభామా... అసలే వేడెక్కి వున్నాను ఊర్కోవమ్మా



చరణం 2 :



దిబ్బరొట్టెకన్నా నీ బుగ్గలున్నవి... చేప పులుసు కన్నా నీ పెదవులున్నవి
దిబ్బరొట్టెకన్నా నీ బుగ్గలున్నవి... చేప పులుసు కన్నా నీ పెదవులున్నవి


రెండిట్లో చల్లార్చే గుణమున్నదీ... ఊర్కొంటే వుసిగొలిపే దుడుకున్నది
రెండిట్లో చల్లార్చే గుణమున్నదీ... ఊర్కొంటే వుసిగొలిపే దుడుకున్నది


చవి చూడమంటావ రవ్వంతా... నెమరేసుకొంటావు రాత్రంతా
చవి చూడమంటావ రవ్వంతా... నెమరేసుకొంటావు రాత్రంతా

దపా దపా దపదపదప...  పదా పదా పదపదపద


చల్లా చల్లని చందమామా... ఇలా వేడెక్కిపోతే ఏలాగమా
అల్లరల్లరి సత్యభామా... అసలే వేడెక్కి ఉన్నాను ఊర్కోవమ్మా


అత్త మీద కోపం దుత్తమీద చూపేది... అన్యాయం అన్యాయం చల్లారమ్మా
అత్త మీద కోపం చూపెందుకు నాకు దుత్తల్లే నువ్వే దొరికావమ్మా

దపా దపా దపదపదప... భామా భామా భామభామభామ

లా..లా లాలా లలలలా... లా లలలలాలలల్లలల్లా





Thursday, February 11, 2016

జోరుగా హుషారుగా షికారు పోదమా





చిత్రం :  భార్యాభర్తలు (1961)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపధ్య గానం :  ఘంటసాల



పల్లవి :



జోరుగా హుషారుగా...  షికారు పోదమా
హాయి హాయిగా...  తీయ తీయ్యగా
జోరుగా హుషారుగా...  షికారు పోదమా
హాయి హాయిగా...  తీయ తీయ్యగా
జోరుగా..... 


చరణం 1 :



ఓ బాల నీ వయ్యారమెంచి మరులుకొంటినే
చాల ప్రేమ పాఠములను చదువుకొంటినే
ఓ బాల నీ వయ్యారమెంచి మరులుకొంటినె
చాల ప్రేమ పాఠములను చదువుకొంటినే
మరువనంటినే మరువనంటినే


జోరుగా హుషారుగా...  షికారు పోదమా
జోరుగా..... 



చరణం 2 :


నీ వన్నె చిన్నెలన్ని చూసి వలచినాడనే
వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే
ఓ.... ఓఓ... ఓ...ఓ
వన్నె చిన్నెలన్ని చూసి వలచినాడనే
వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే
కలిసిరాగదే కలిసిరాగదే

ఓ... జోరుగా..... 

జోరుగా హుషారుగా...  షికారు పోదమా


చరణం 3 :


నా కలలలోన చెలియ నిన్నె పిలిచినాడనే
కనులు తెరిచి నిన్ను నేనె కాంచినాడనే

ఓ.... ఓఓ... ఓ...ఓ

నా కలలలోన చెలియ నిన్నె పిలిచినాడనే
కనులు తెరిచి నిన్ను నేనె కాంచినాడనే
వరించినాడనే వరించినాడనే 

ఓ.... ఓఓ... ఓ...ఓ


జోరుగా హుషారుగా షికారు పోదమా

హాయి హాయిగా తీయ తీయ్యగా

జోరుగా... జోరుగా... జోరుగా... జోరుగా





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1081

చినుకులలో... వణికి వణికి వణికి వణికి



చిత్రం  :  రహస్య గూఢాచారి (1981)
సంగీతం  :  సత్యం
గీతరచయిత  :
నేపధ్య గానం  :  బాలు, సుశీల




పల్లవి :


చినుకులలో... వణికి వణికి వణికి వణికి
వణుకులలో... వలచి వలచి వలచి వలచి
వలపులలో..కలిసి కలిసి మెలిసి పిలిచి
కురిసిందీ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ.. జడివానా
ఆ..హా..ఆ


చినుకులలో... వణికి వణికి వణికి వణికి
వణుకులలో... వలచి వలచి వలచి వలచి
వలపులలో... కురిసి కలిసి మెలిసి పిలిచి
కురిసిందీ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ... జడివానా
ఆ..హా..ఆ



చరణం 1 :



మబ్బులు ముసిరే మనసులలో... మెరుపై మెరిసే సొగసులలో
వలపే తెలిపే పిలుపులలో... ఉరుమై ఉరిమే వయసులలో


కాముడి గుప్పిటిలోనా... కౌగిలి దుప్పటిలోనా
ఈ ముడి ఎప్పటికైనా... తప్పదు ఎవ్వరికైనా


కాముడి గుప్పిటిలోనా..ఆ
కౌగిలి దుప్పటిలోనా..ఆ
ఈ ముడి ఎప్పటికైనా..ఆ
తప్పదు ఎవ్వరికైనా..ఆ
చినుకు వణుకు చిచ్చులు రేపే .. వెచ్చటి ముచ్చటలోనా..ఆ


చినుకులలో... వణికి వణికి వణికి వణికి
వణుకులలో... వలచి వలచి వలచి వలచి
వలపులలో... కురిసి కలిసి మెలిసి పిలిచి
కురిసిందీ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ... జడివానా
ఆ..హా..ఆ


చరణం 2 :



ఎదలో రగిలే ఎండలలో... మెదిలే వేసవి తపనలు
ఎదలే వెలిగే కన్నులలో... మెరిసే కాటుక కవితలలో


ఇద్దరి ముద్దులలోనా... తొలకరి వలపుల వానా
ఎందరు ఏమను కొన్నా..ఆ.. తప్పదులే..దేవుడికైనా


ఇద్దరి ముద్దులలోనా... తొలకరి వలపుల వానా
ఎందరు ఏమను కొన్నా..ఆ తప్పదులే..దేవుడికైనా
చిటుకు చిటుకు తాళాలేసే... చిత్తడి జల్లులలో


చినుకులలో... వణికి వణికి వణికి వణికి
వణుకులలో... వలచి వలచి వలచి వలచి
వలపులలో... కురిసి కలిసి మెలిసి పిలిచి
కురిసిందీ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ... జడివానా
ఆ..హా..ఆ

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3824

Sunday, February 7, 2016

ఆనాటి చెలిమి ఒక కల

చిత్రం  :  పెళ్ళిరోజు (1968)
సంగీతం  :  ఎం. ఎస్. శ్రీరామ్
గీతరచయిత  :  రాజశ్రీ
నేపధ్య గానం  :  పి.బి. శ్రీనివాస్






పల్లవి :



ఆనాటి చెలిమి ఒక కల... కల కాదు నిజము ఈ కథ
మనసులోని మమతలన్ని మరచిపోవుట ఎలా?
ఆనాటి చెలిమి ఒక కల.. 



చరణం 1 :


మనసనేదే లేని నాడు... మనిషికేదీ వెల
మనసనేదే లేని నాడు... మనిషికేదీ వెల
మమతనేదే లేని నాడు... మనసు కాదది శిల


ఆనాటి చెలిమి ఒక కల... కల కాదు నిజము ఈ కథ 


చరణం 2 :


చందమామే రాని నాడు... లేదులే వెన్నెల
చందమామే రాని నాడు... లేదులే వెన్నెల
ప్రేమనేదే లేని నాడు... బ్రతుకులే వెల వెల  


ఆనాటి చెలిమి ఒక కల... కల కాదు నిజము ఈ కథ 



చరణం 3 :


ఒక్కసారి వెనుక తిరిగి చూసుకో జీవితం
ఒక్కసారి వెనుక తిరిగి చూసుకో జీవితం
పరిచయాలు అనుభవాలు... గురుతు చేయును గతం


ఆనాటి చెలిమి ఒక కల... కల కాదు నిజము ఈ కథ
మనసులోని మమతలన్ని... మరచిపోవుట ఎలా?
మరచిపోవుట ఎలా?





జీవితాన మరువలేను

చిత్రం  :  పెళ్ళిరోజు (1968)
సంగీతం  :  ఎం. ఎస్. శ్రీరామ్
గీతరచయిత  :  రాజశ్రీ
నేపధ్య గానం  : సుశీల, పి.బి. శ్రీనివాస్






పల్లవి :



జీవితాన మరువలేను..ఒకే రోజు
ఇరుజీవితాలు ఒకటిగ..ముడివేసే రోజు
అదే పెళ్ళిరోజు..పెళ్ళిరోజూ



జీవితాన మరువలేము..ఒకే రోజు
ఇరుజీవితాలు ఒకటిగ..ముడివేసే రోజు
అదే పెళ్ళిరోజు..పెళ్ళిరోజూ 



చరణం 1 :


నిన్న చూడ నీవు నేను.. ఎవరికెవరమో
నేడు చూడ నీవు నేను.. ఒకరికొకరిమే
నిన్న చూడ నీవు నేను.. ఎవరికెవరమో
నేడు చూడ నీవు నేను.. ఒకరికొకరిమే 


రేపు చూడు పెళ్ళినాడు.. మనము ఏకమై
ఓ.. ఓ.. ఓ.. కలసిపోదమే...


జీవితాన మరువలేము... ఒకే రోజు
ఇరుజీవితాలు ఒకటిగ... ముడివేసే రోజు
అదే పెళ్ళిరోజు... పెళ్ళిరోజూ  


చరణం 2 :


నింగి నుండి చందమామ... తోంగి చూచేనే
మధురమైన కలతలేవో... మనసు తెలిపెనే
ఊహలన్నీ ఉరకలేసి... చిందులాడెనే
ఓ..హో.. మనసుపోంగెనే.. 




చరణం 3 :


తలపులందు తెలియరాని...  వేడి వున్నదీ
వేడి చూచి కన్నె మనసు... కరుగుతున్నదీ
తలపులందు తెలియరాని... వేడి వున్నదీ
వేడి చూచి కన్నె మనసు... కరుగుతున్నదీ 


కన్నె మనసు కరుగు వేళ... బిడియమెందుకూ
హో..ఓ..రాకు ముందుకూ..


జీవితాన మరువలేము... ఒకే రోజు
ఇరుజీవితాలు ఒకటిగ... ముడివేసే రోజు
అదే పెళ్ళిరోజు... పెళ్ళిరోజూ




అడుగుదామని ఉంది నిన్నొక మాట

చిత్రం  :  పెళ్ళిరోజు (1968)
సంగీతం  :  ఎం. ఎస్. శ్రీరామ్
గీతరచయిత  :  రాజశ్రీ
నేపధ్య గానం  : సుశీల,  పి.బి. శ్రీనివాస్






పల్లవి :



అడుగుదామని ఉంది నిన్నొక మాట
పెదవి దాటి రాకున్నది నా నోట
తీయరాదా సిగ్గు పరదా.. ఎవరు లేరు కదా..ఆ..


అడుగుదామని ఉంది నిన్నొక మాట
పెదవి దాటి రాకున్నది నా నోట
ఇంతలోనే అంత ప్రేమ.. కలిగెనెందుకనీ..ఈ..


అడుగుదామని ఉంది నిన్నొక మాట



చరణం 1 :


పసిదానిగ నటీయించి.. మది దోచావెందులకు?


నేనెవరో తెలియకనే.. నను పిలిచావెందులకు?


ఇది ఏమి గడుసుతనం?...  ఇది ఏమి చిలిపితనం?
కాదు పడుచుతనం.. ఊ.. ఊ..


అడుగుదామని ఉంది నిన్నొక మాట



చరణం 2 :


మన పరిచయమొక కథగా...  జరిగింది మొదటిరోజు


ఆ పరిచయ ఫలితముగా...  పెరిగింది ప్రేమ మోజు


ఏనాటి అనుబంధమో... గతజన్మలో బంధమో


ఎందుకీ స్నేహమో..


అడుగుదామని ఉంది నిన్నొక మాట
పెదవి దాటి రాకున్నది నా నోట
ఇంతలోనే అంతప్రేమ... కలిగె నెందుకనీ..ఈ..
అడుగుదామని ఉంది నిన్నొక మాట





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7031

పువ్వులా నవ్వితే మువ్వలా మోగితే





చిత్రం  :  ప్రేమ బంధం (1976)
సంగీతం  :  కె.వి. మహదేవన్
గీతరచయిత  :  సినారె
నేపధ్య గానం  : సుశీల, బాలు 





పల్లవి :


పువ్వులా నవ్వితే...  మువ్వలా మోగితే
గువ్వలా ఒదిగితే... రవ్వలా పొదిగితే
నిన్ను నేను నవ్విస్తే ... అ... అ
నన్ను నువ్వు కవ్విస్తే ... అ.. అ
అదే ప్రేమంటే.. అదే..అదే..అదే..అదే        



చరణం 1 :



అంతలోనే మాట ఆగిపోతుంటే
తనకు తానే పైట జారిపోతుంటే
అంతలోనే మాట ఆగిపోతుంటే
తనకు తానే పైట జారిపోతుంటే 


గుండెలో చల్లని ఆవిరి గుసగుస పెడుతుంటే
గుండెలో చల్లని ఆవిరి గుసగుస పెడుతుంటే
తడవ తడవకూ పెదవుల తడియారి పోతుంటే
ఎండలో చలి వేస్తే....  వెన్నెల్లో చెమరిస్తే 



అదే... అదే..
అదే.. ప్రేమంటే..అదే అదే... అదే.. అదే  




చరణం 2 :




కందిన చెక్కిలి కథలేవో చెబుతుంటే
అందని కౌగిలి ఆరాటపెడుతుంటే
కందిన చెక్కిలి కథలేవో చెబుతుంటే
అందని కౌగిలి ఆరాటపెడుతుంటే


కాటేసిన వయసేమో కంటి కునుకునే కాజేస్తుంటే
కాటేసిన వయసేమో కంటి కునుకునే కాజేస్తుంటే
మాటేసిన కోరికలే వేటాడుతూ వుంటే
ఇద్దరూ ఒకరైతే...  ఆ ఒక్కరూ మనమైతే 



అదే...  ప్రేమంటే.. అదే... అదే..  అదే అదే
అదే అదే.... లల.. లల... లల 






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2434

ఏ జన్మకైనా ఇలాగే ఉందామా





చిత్రం  :  ప్రేమ బంధం (1976)
సంగీతం  :  కె.వి. మహదేవన్
గీతరచయిత  :  సినారె
నేపధ్య గానం  : సుశీల, బాలు 





పల్లవి :


ఏ జన్మకైనా ఇలాగే ఉందామా
నేను నీ దాననై...  నీవు నా ధ్యానమై
ఇలా ఇలా ఇలా...  ఇలా ఇలా ఇలా 



చరణం 1 :


నీరెండకే నీ మోము కందిపొవునో
నా జిలుగు పైటనే గొడుగుగా మలచుకోనా
నీరెండకే నీ మోము కందిపొవునో
నా జిలుగు పైటనే గొడుగుగా మలచుకోనా


నిన్ను చూసి ఏ వేళ ఏ కన్ను చెదరునో
నిన్ను చూసి ఏ వేళ ఏ కన్ను చెదరునో
నా నీలి కురులే తెరలుగా నిను దాచుకోనా 




ఏ జన్మకైనా ఇలాగే ఉందామా
నేను నీ దాననై...  నీవు నా ధ్యానమై
ఇలా ఇలా ఇలా...  ఇలా ఇలా ఇలా 



చరణం 2 :



వేయిరాత్రులు కలుసుకున్నా... విరిశయ్యకు విరహమెందుకో
కోటి జన్మలు కలిసి వున్నా... తనివి తీరని తపన ఎందుకో
విరిశయ్యకు విరహమెందుకో...  తనివి తీరని తపన ఎందుకో

హృదయాల కలయికలో ఉదయించే తీపి అది
హృదయాల కలయికలో ఉదయించే తీపి అది
జీవితాల అల్లికలో చిగురించే రూపమది 


ఏ జన్మకైనా ఇలాగే ఉందామా
నేను నీ దాననై...  నీవు నా ధ్యానమై
ఇలా ఇలా ఇలా...  ఇలా ఇలా ఇలా 




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2073

Thursday, February 4, 2016

ఎలగో.. ఎలాగో.. ఎలాగో.. ఉన్నది



చిత్రం :  లక్షాధికారి (1963)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  సుశీల 



పల్లవి :


ఆ.. ఆ.. ఆ..
ఓ...ఓ.. ఓ..
ఎలగో.. ఎలాగో.. ఎలాగో.. ఉన్నది
ఇలాగే ఉంటుందా తోలి ప్రేమ అన్నది
అలా అలా అలా మనసు తేలిపోవుచున్నది
ఎలగో.. ఎలాగో.. ఎలాగో.. ఉన్నది



చరణం 1 : 


చిన్నవాడు ఓర చూపు చూసి నవ్వెను
వెన్నెలాగ లేత మనసు కరిగిపోయెను
చిన్నవాడు ఓర చూపు చూసి నవ్వెను
వెన్నెలాగ లేత మనసు కరిగిపోయెను


చేయి చేయి కలపగానే మెరుపు మెరిసెను
ఆ మెరుపులోన నా మేను జలదరించెను




ఇలాగే ఉంటుందా తోలి ప్రేమ అన్నది
అలా అలా అలా మనసు తేలిపోవుచున్నది
ఎలగో.. ఎలాగో.. ఎలాగో.. ఉన్నది



చరణం 2 :


కనులలోన గులాబీలు పూయుచున్నవి..
మునుపులేని అనుభవాలు ముసురుకున్నవి
కనులలోన గులాబీలు పూయుచున్నవి..
మునుపులేని అనుభవాలు ముసురుకున్నవి


మధురమైన మైకమేదో కలుగుచున్నది
ఆ మైక మందు నేనేదో మారిపోతిని




ఇలాగే ఉంటుందా తోలి ప్రేమ అన్నది
అలా అలా అలా మనసు తేలిపోవుచున్నది
ఎలగో.. ఎలాగో.. ఎలాగో.. ఉన్నది



చరణం 3 :



చల్ల గాలి అతను ఊసు తెలుపుతున్నది
మల్లెతీగలాగ ఆశ అల్లుకున్నది
చల్ల గాలి అతను ఊసు తెలుపుతున్నది
మల్లెతీగలాగ ఆశ అల్లుకున్నది 


కన్నెవలపు అతని చుట్టు తిరుగుతున్నది
ఆ వన్నెకాణ్ణి విడిచి తాను రానన్నది  



ఇలాగే ఉంటుందా తోలి ప్రేమ అన్నది
అలా అలా అలా మనసు తేలిపోవుచున్నది
ఎలగో.. ఎలాగో.. ఎలాగో.. ఉన్నది




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=145


నా చెంప తాకగానే




చిత్రం :  లక్షాధికారి (1963)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం : ఘంటసాల,   సుశీల 



సాకీ :



హాయ్.. హాయ్.. హాయ్
నా చెంప తాకగానే... చెలీ.. నీ చేయి కందెనేమో
నా చూపు సోకగానే... అరెరె.. నాజూకు తగ్గెనేమో
నా చెంప తాకగానే... చెలీ.. నీ చేయి కందెనేమో
నా చూపు సోకగానే... అరెరె.. నాజూకు తగ్గెనేమో


నాపైన నీకు కోపమా.. కాదేమి విరహతాపమా
నాపైన నీకు కోపమా విరహతాపమా
పలుకగా రాదా... అలుక మరియాదా
నీ పదునౌ చూపుల అదిరింపులకే బెదరను బెదరను బెదరనులే  



పల్లవి :

దాచాలంటే దాగదులే.. దాగుడుమూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసేదాకా.. వదలను వదలను వదలనులే


చరణం 1 : 



నీ కులుకు నడక చూచి.. రాజహంసలకు సిగ్గు కలిగె
నీ తళుకు మోము చూచి.. నింగి జాబిలికి నిగ్గు తరిగె
నీ కులుకు నడక చూచి.. రాజహంసలకు సిగ్గు కలిగె
నీ తళుకు మోము చూచి.. నింగి జాబిలికి నిగ్గు తరిగె 



అయ్యారే మేని అందము.. బంగారు తీగ చందము
అయ్యారే మేని అందము.. తీగ చందము
మరులుగొలిపేనూ.. మనసు దోచేనూ
ఈ కమ్మని రాతిరి కరిగేదాకా.. కదలను కదలను కదలనులే


దాచాలంటే దాగదులే.. దాగుడుమూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసేదాకా.. వదలను వదలను వదలనులే 


చరణం 2 :


నీ నల్లని వాల్జడలో.. విరిసిన మల్లెలు రమ్మనెను
నీ ఎర్రని బుగ్గలపై సిగ్గులు.. ఎదురై పొమ్మనెను
నీ నల్లని వాల్జడలో.. విరిసిన మల్లెలు రమ్మనెను
నీ ఎర్రని బుగ్గలపై సిగ్గులు.. ఎదురై పొమ్మనెను 


నువు లేకపోతే ఓ చెలీ.. ఈ లోకమంతా చలి చలి
నువు లేకపోతే ఓ చెలీ.. లోకమే చలి
ఏమి చేసేనే..  ఎటుల సైచేనే
నీ వెచ్చని కౌగిట ఒదిగేదాకా.. విడువను విడువను విడువనులే 


దాచాలంటే దాగదులే.. దాగుడుమూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసేదాకా.. వదలను వదలను వదలనులే





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=65

దాచాలంటే దాగదులే




చిత్రం :  లక్షాధికారి (1963)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :   సుశీల 



పల్లవి :


దాచాలంటే దాగదులే..దాగుడు మూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసే దాక వదలను.. వదలను.. వదలనులే


దాచాలంటే దాగదులే..దాగుడు మూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసే దాక వదలను.. వదలను.. వదలనులే



చరణం 1 :


నీ సన్నని మీసంలో విలాసం వన్నెలు చిలికింది
నీ నున్నని బుగ్గలపై పున్నమి వెన్నెల మెరిసింది
నీ ఓర చూపులను గని.. బంగారు తూపులనుకొని
నీ ఓర చూపులను గని..  తూపులనుకొని మురిసిపోతానూ.. పరవసించేనూ
 నీ కన్నులు రమ్మని పిలిచేదాక కదలను..కదలను..కదలనులే


దాచాలంటే దాగదులే..దాగుడు మూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసే దాక వదలను..వదలను..వదలనులే 


చరణం 2 :


పొదలలోన వున్నా పూల గంధాలు దాగలేవు
మట్టిలోన వున్నా.. మణుల అందాలు మాసిపోవు
నీలోని రూపమును గని.. రతనాల దీపమనుకొని
నీలోని రూపమును గని.. దీపమనుకొని
మదిని నిలిపేను.. జగము మరచేనూ
నీ పెదవుల నవ్వులు విరిసే దాక విడువను..విడువను..విడువనులే


దాచాలంటే దాగదులే..దాగుడు మూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసే దాక..వదలను..వదలను..వదలనులే




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=66

నవ్వే ఓ చిలకమ్మా

చిత్రం : అన్నాదమ్ములు (1969)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :  


నవ్వే ఓ చిలకమ్మా.. నీ నవ్వులు ఏలమ్మా
ఆ నటనలు చూడమ్మా.. ఏ జవరాలినుడికించకమ్మా   


ఎగిరే ఓ గోరింకా.. ఇటు చూడకు మావంకా
నీ ఎత్తులు చాలింకా.. మీ మగవారి మాటలే చౌకా
ఎగిరే ఓ గోరింకా.. 


చరణం 1 :


పెళ్ళంటే పిల్లకు ఉబలాటము
అపుడు మొగమాటము.. ఇపుడు ఆరాటమూ
పెళ్ళంటే పిల్లకు ఉబలాటము
అపుడు మొగమాటము.. ఇపుడు ఆరాటమూ


ప్రేమను కోరే ఈ మగవారు
ప్రేమను కోరే ఈ మగవారు.. పెళ్ళనగానే కంగారూ
మూడుముళ్ళు వేయాలంటే.. మూతి ముడుచుకొంటారూ
మూడుముళ్ళు వేయాలంటే.. మూతి ముడుచుకొంటారూ


హోయ్...నవ్వే ఓ చిలకమ్మా
ఆ....
నీ నవ్వులు ఏలమ్మా
అహా....నీ నటనలు చూడమ్మా
ఆ.. ఏ జవరాలినుడికించకమ్మా...
నవ్వే ఓ చికమ్మా...


చరణం 2 :



అబ్బాయిగారి బండారము..
ముందు వెటకారము..  పిదప మమకారమూ



కోపము లేని ఈ ఆడవారు
కోపము లేని ఈ ఆడవారు.. కోర చూపులే చూస్తారూ
కొమ్ములెన్నో తిరిగిన వాణ్ణి.. కొంగు చివర కడతారు
కొమ్ములెన్నో తిరిగిన వాణ్ణి.. కొంగు చివర కడతారు 



ఎగిరే ఓ..గోరింకా...
ఆ...
ఇటు చూడకు మావంకా
ఆ..ఆ...
నీ ఎత్తులు చాలింకా
ఆ....
మీ మగవారి మాటలే చౌకా...
నవ్వే ఓ..చిలకమ్మా.... 



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3009