Saturday, March 19, 2016

గోదారి గట్టు కన్నా

చిత్రం : కాలయముడు  (1983)
సంగీతం :  జె.వి. రాఘవులు
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల 



పల్లవి : 

ఆ....... ఆ......  ఆ......  ఆ....
ఓ..... ఓ...... ఓ..... 



గోదారి గట్టు కన్నా... వయ్యారి చీర కట్టు
పదిలంగా ఉన్నదే అమ్మడు
వరదల్లే వాటేస్తా.. తరగల్లే దాటేస్తా
ఏం చేస్తావో చూస్తా.. అప్పుడు


చందమామా బొట్టు కన్నా... సన్నానీ మీసకట్టు
సరదాగా ఉందిరో పిల్లడు
సరసంగా దువ్వేస్తా.. సరసకొచ్చి కవ్విస్తా
ఏం చేస్తావో చూస్తా.. అప్పుడు




చరణం 1 :



ఏటి గాలి కొడుతుంటే... పైట ఎగిరి పడుతుంటే
కన్నెతనం కసికసిగా కాస్త బైటపడుతుంటే


నువ్వు దగ్గరవుతుంటే... ఈడు సిగ్గు పడుతుంటే
కంటి రెప్ప కసికసిగా జంట గంట కొడుతుంటే


మనసంతా కోసిస్తా...  మల్లెల్లో ముంచేస్తా
ఏమిస్తావో చూస్తా అప్పుడు... ఓ.. చేసేదేదో చేసేయ్ ఇప్పుడు


గోదారి గట్టు కన్నా... వయ్యారి చీర కట్టు
పదిలంగా ఉన్నదే అమ్మడు
సరసంగా దువ్వేస్తా.. సరసకొచ్చి కవ్విస్తా
ఏం చేస్తావో చూస్తా.. అప్పుడు



చరణం 2 :



పడుచు ఎండ పడుతుంటే... లేత చెమట పుడుతుంటే
తుడుచుకునే కడకొంగే...  ఒడిసి నువ్వు పడుతుంటే


నీరు ముందుకొస్తుంటే... నారు ముద్దు పెడుతుంటే
పైరంతా ఎదిగిఎదిగి పంట చేతికొస్తుంటే


మాటలన్నీ దాటేసి... చేతలేవో చేసేస్తే
అసలు రుచులు చూపిస్తా అప్పుడు
అప్పుడంటే ఎప్పుడు ఇంకెప్పుడు?



చందమామా బొట్టు కన్నా... సన్నానీ మీసకట్టు
సరదాగా ఉందిరో పిల్లడు
వరదల్లే వాటేస్తా.. తరగల్లే దాటేస్తా
ఏం చేస్తావో చూస్తా...  అప్పుడు... ఓ.. చేసేదేదో చేసేయ్ ఇప్పుడు





No comments:

Post a Comment