Thursday, March 17, 2016

రాయినైనా కాకపోతిని



చిత్రం :  గోరంత దీపం (1978)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  సుశీల



పల్లవి :


రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా
బోయనైన కాకపోతిని పుణ్య చరితము పాడగా
రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా
బోయనైన కాకపోతిని పుణ్య చరితము పాడగా 


పడవనైన కాకపోతిని స్వామి కార్యము తీర్చగా
పాదుకైన కాకపోతిని భక్తి రాజ్యమునేలగా  




చరణం 1 :


అడవి లోపలి పక్షినైతే అతివ సీతను కాచనా
అందువలన రామచంధ్రుని అమిత కరుణను నోచనా
అడవి లోపలి పక్షినైతే అతివ సీతను కాచనా
అందువలన రామచంధ్రుని అమిత కరుణను నోచనా


కడలి గట్టున వుడుతనైతే బుడత సాయం చేయనా
కాలమెల్ల రామభద్రుని వెలి గురుతులు మోయగా  


రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా...
బోయనైన కాకపోతిని పుణ్య చరితము పాడగా...




చరణం 2 :



కాకినైన కాకపోతిని ఘతుకంమును చేయుచు..
గడ్డిపోచను శరము చేసే ఘనత రాముడు చూపగా
కాకినైన కాకపోతిని ఘతుకంమును చేయుచు..
గడ్డిపోచను శరము చేసే ఘనత రాముడు చూపగా



మహిని అల్పజీవులే ఈ మహిమలన్నీ నోచగా..
మనిషిని జన్మించినాను మత్సరంబుల రేపగా...  మదమత్సరంబుల రేపగా...


పడవనైన కాకపోతిని స్వామి కార్యము తీర్చగా..
పాదుకైన కాకపోతిని భక్తి రాజ్యమునేలగా..
రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా..
బోయనైన కాకపోతిని పుణ్య చరితము పాడగా..





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4707

No comments:

Post a Comment