Thursday, March 10, 2016

ఆకాశంలో హాయిగా

చిత్రం : కళ్యాణి (1979)

సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : సుశీల , బాలు 




పల్లవి :


ఆకాశంలో హాయిగా రాగం తీసే కోయిల
జీవన రాగం విడిచావా.. కల్యాణి రాగమే మరిచావా


ఆకాశంలో హాయిగా రాగం తీసే కోయిల
జీవన రాగం తలచాను.. కల్యాణి కోసమే నిలిచాను


ఆకాశంలో హాయిగా రాగం తీసే కోయిల



చరణం 1 :


ఏ ఏ వాడలు తిరిగావు... ఏ వసంతాలు గడిపావు
ఈ ఉగాదిలో.. ఈ ఉషస్సులో.. ఏ రాగం వినిపిస్తావో
ఏ రసాలు కురిపిస్తావో... ఏ రసాలు కురిపిస్తావో


ఎడారి దారులు వెతికాను.. ఎండమావినై బ్రతికాను
బ్రతుకు దారిలో బాటసారినై.. విసిగి వేసారి వచ్చాను
విసిగి వేసారి వచ్చాను... 


ఆకాశంలో హాయిగా...  రాగం తీసే కోయిల
జీవన రాగం తలచాను.. కల్యాణి కోసమే నిలిచాను
ఆకాశంలో హాయిగా రాగం తీసే కోయిల



చరణం 2 :


కన్నుల పొంగెను కావేరి.. గొంతున పలికెను సావేరి
ఈ నిశీధిలో ఈ నిరాశలో.. రగిలే హృదయం నా రాగం
రాదా ఉదయం నాకోసం


మండే వేసవి ఎండలలోనే మల్లెలు విరిసేది
మండే వేసవి ఎండలలోనే మల్లెలు విరిసేది
గుండెలు పగిలే వేదనలోనే మనసులు కలిసేది
మమతలు తెలిసేది


మురళి నేనుగా.. రవళి నేనుగా
కడలి నేనుగా.. నదిని నేనుగా
సంగ్రమించనీ గానమై... సంగమించనీ ప్రాణమై
నీ ప్రాణంలో ప్రాణమై...


ఆకాశంలో హాయిగా రాగం తీసే కోయిల
జీవన రాగం తలచాను.. కల్యాణి కోసమే నిలిచాను
ఆకాశంలో హాయిగా.... రాగం తీసే కోయిల





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5354


No comments:

Post a Comment