Thursday, March 3, 2016

అల్లరి చేసే ఊహల్లో


చిత్రం : మహాలక్ష్మి (1980)
సంగీతం :  సత్యం
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, సుశీల



పల్లవి :


అల్లరి చేసే ఊహల్లో...  ఆశలు మెరిసే కన్నుల్లో నీవే
తియతీయగ పొంగెను తీరని కోరిక నేడే
తియతీయగ పొంగెను తీరని కోరిక నేడే


ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..


అల్లరి చేసే ఊహల్లో ఆశలు మెరిసే కన్నుల్లో నీవే
చలచల్లగ నాలో అల్లిన తీగవు నీవే
చలచల్లగ నాలో అల్లిన తీగవు నీవే


చరణం 1 :


వెలిగిన దీపాలన్నీ... నీవే
పలికిన గీతాలన్నీ... నీవే
వెలిగిన దీపాలన్నీ... నీవే
పలికిన గీతాలన్నీ... నీవే


ఆ రవ్వల వెలుగుల దివ్వెల్లో
నవ్వులు దాచిన మువ్వల్లో
చిలికిన కళలన్నీ నావే



అల్లరి చేసే ఊహల్లో...  ఆశలు మెరిసే కన్నుల్లో నీవే
కలకాలం నీలో కదిలే నీడను.. నేనే
కలకాలం నీలో కదిలే నీడను.. నేనే



చరణం 2 :


నీ ఎదలో ఉన్న చలువ... వేయి వసంతాల విలువ
నీ ఎదలో ఉన్న చలువ... వేయి వసంతాల విలువ


ఆ విలువలు విరిసిన వేళల్లో...
వలపులు చేసిన పూజల్లో...
నిలిచిన దైవం... నీవే


అల్లరి చేసే ఊహల్లో...  ఆశలు మెరిసే కన్నుల్లో నీవే
చలచల్లగ నాలో అల్లిన తీగవు నీవే
కలకాలం నీలో కదిలే నీడను.. నేనే





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2652

No comments:

Post a Comment