Wednesday, April 6, 2016

ఇది నా జీవితాలపనా

చిత్రం :  సువర్ణ సుందరి (1981)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :   బాలు, జానకి 




పల్లవి :

ఆ ఆ... ఆ ఆ... ఆ ఆ... ఆ ఆ...ఆ ఆ... ఆ ఆ... ఆ ఆ... ఆ ఆ...
ఆ ఆ... ఆ ఆ... ఆ ఆ... ఆ ఆ...ఆ ఆ... ఆ ఆ... ఆ ఆ... ఆ ఆ...



ఇది నా జీవితాలపనా...  ప్రియదేవతాన్వేషణా
ఏమైనదో... ఎట దాగున్నదో..
ఏమైనదో... ఎట దాగున్నదో..
ఎన్నాళ్ళు ఈ వేదనా?...  ఎన్నాళ్ళు ఈ వేదనా ఆ ఆ ??
ఇది నా  జీవితాలపనా...  ప్రియదేవతాన్వేషణా ..


చరణం 1 :



పొలిమేర దాటాను...  భావాలలో
పొలికేక నైనాను...  రాగాలలో.
శూన్యాక్షరాల  గవాక్షాలలో.... శూన్యాక్షరాల  గవాక్షాలలో..
నిలిచాను నిరుపేద గీతాలతో..
మదిగాయలుగా...  మధు గేయాలుగా 

మదిగాయలుగా...  మధు గేయాలుగా


ఎన్నాళ్ళు ఈ వేదనా?...  ఎన్నాళ్ళు ఈ వేదనా ఆ ???
ఇది నా జీవితాలపనా...  ప్రియదేవతాన్వేషణా ..



చరణం 2 :


మంజీరమైనాను నీ పాటలో...
మందారమైనాను నీ తోటలో..
మౌనస్వరాల  ఈ పంజరాన...  మౌనస్వరాల ఈ పంజరాన ..
కరిగాను కడలేని స్వప్నాలలో..
విధి నటనాలలో ఋతుపవనాలలో... 

విధి నటనాలలో ఋతుపవనాలలో




ఎన్నాళ్ళు ఈ వేదనా ?? ఎన్నాళ్ళు ఈ వేదనా ఆ ???
ఇది నా... జీవితాలపనా.. ప్రియదేవతాన్వేషణా .. 


చరణం 3 :


నీ అంతిమ శ్వాస... నీ కవితలో ప్రాస... 

అవుతుందనీ బాస చేసానులే..
కావాలనే బ్రతికి ఉన్నాను లే.... ఉంటానులే...


నీ సంగామావేశ విజృంభణాలోల...  

ఆకాశమే తుంచి... కైలాసమే వంచి...  

నిను చేరుకుంటాను....  నీనాదమై..






No comments:

Post a Comment