Tuesday, April 19, 2016

కింగులా కనిపిస్తున్నాడు

చిత్రం: క్షణ క్షణం  (1991)
సంగీతం: కీరవాణి
గీతరచయిత: సిరివెన్నెల
నేపథ్య గానం: బాలు, శ్రీదేవి



పల్లవి :



కింగులా కనిపిస్తున్నాడు మరి వంగి వంగి దణ్ణాలెందుకు పెడుతున్నాడు
ఏమా సరదా గమ్మత్తుగ లేదా ఏమా సరదా


రాజైనా రారాజైనా మనీ ఉన్న మనముందు సలాం కొట్టవలసిందే
ఈ టిప్పు దెబ్బ తగిలిందంటే బోర్లా పడవలసిందే


పైసా ఉంటే పరిగెత్తుకురాడా పరమాత్మైనా
కో అంటే....కోటి దొర్లుకుంటూ వస్తుంది కొండమీది కోతి


తందత్తరదా తందత్తరదాదా తందత్తరదా
తందత్తరదాదా తందత్తరదా



చరణం 1 :


ఓయబ్బో..మయసభలా యమాగ ఉంది ఏమి మాయలోకమిది
అచ్చతెలుగులో ఐదు తారల పూటకూళ్ళ ఇల్లు
మేకప్పేసి మరో భాషలో five star hotel అంటారు... ఛ


yes, do you have any reservation?...  అయ్యయ్యో లేదే
welcome sir... welcome lady
we are glad to have you here
to serve you is our pleasure


రెపరెపలాడే రంగు కాగితం ఏమిటది
దేవుళ్ళైనా దేవుల్లాడే అంత మహత్మ్యం ఏముంది


శ్రీ...లక్ష్మీదేవి స్వహస్తంతో సంతకం చేసిన పత్రం
ఎవరక్కడ... అంటే.. చిత్తం అంటుంది లోకం మొత్తం
చెక్కంటారు దీన్ని.... check it sir 


కో అంటే....కోటి దొర్లుకుంటూ వస్తుంది కొండమీది కోతి





చరణం 2 :



వావ్...అయ్యయ్యో హ హ హ I can't believe it
అయ్యబాబోయ్ గదా ఇది స్వర్గమేమో కదా ఇది హా


పైసాల్లో పవరిరిది పన్నీటి షవరిది
కాసు ముందు గాలైనా కండిషన్లో ఉంటుంది
పైకంతో ప్రపంచమంతా పడగ్గదికి వస్తుంది


మబ్బులతో పరుపును కుట్టి పాల నురుగు దుప్పటి చుట్టి
పరిచి ఉంచిన పానుపు చూస్తే మేలుకోవా కలలన్నీ



తందత్తరదా తందత్తరదాదా తందత్తరదా
తందత్తరదాదా తందత్తరదా
తందత్తరదాదా తందత్తరదా











http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11029

No comments:

Post a Comment