Wednesday, April 20, 2016

అన్నుల మిన్నల అమ్మడి కన్నులు

చిత్రం : చంటి (1992)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు 

పల్లవి :అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే
తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే

సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే
శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే
అలివేణే ఈ రాణీ...

అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే
తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే
చరణం 1 :

ఆ దేవుడు ఆ దేవితో అలక బూనెనేమో
ఈ రూపుగ శ్రీదేవిని ఇలకు పంపెనేమో

మోహనాల సోయగాల మేనకో
మరి దేవలోక పారిజాత మాలికో

రేకులు విచ్చిన సిరిమల్లి అన్నల ముద్దుల చెల్లి
నేలకు వచ్చిన జాబిల్లి వన్నెల రంగులవల్లి
విరబూసే పూబోనీ...అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే
తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే

సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే
శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే
అలివేణే ఈ రాణీ...

అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే
తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే
చరణం 2 :ఆ కలువలు ఈ కనులకు మారు రూపులేమో
ఆ నగవలు వేకువలకు మేలుకొలుపులేమో

పాల కడలి మీద తేలు చంద్రికో..
గగనాల వేళ కాంతులీను తారకో

వెన్నల్లె వస్తాడు ఓనాడు రాజుంటి గొప్పింటి మొగుడు
ఊరంత సందెల్లు ఆనాడు వాడంతా వియ్యాలవారు
పిప్పి పీ..పీ..డుం..డుం..డుం.....అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే
తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే

సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే
శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే
అలివేణే ఈ రాణీ...

అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే
తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములేhttp://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11032

No comments:

Post a Comment