Friday, April 15, 2016

నడుమా.. కన్నెలేడి నడుమా

చిత్రం : పులిబిడ్డ (1981)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి :

నడుమా... హ.. హ.. హ
కన్నెలేడి నడుమా... సన్నజాజి తొడిమా
కన్నెలేడి నడుమా... సన్నజాజి తొడిమా
ఉందో లేదో ఉయ్యాలరో... ఊగుతుంటే జాజిపూల జంపాలరో
ఉందో లేదో ఉయ్యాలరో... ఊగుతుంటే జాజిపూల జంపాలరో

నడుమే... హ.. హ.. హ
కన్నెలేడి నడుమే... సన్నజాజి తొడిమే
కన్నెలేడి నడుమే... సన్నజాజి తొడిమే
ఉండీ లేనీ ఉయ్యాలరో... ఊగుతుంటే జాజిపూల జంపాలరో
ఉండీ లేనీ ఉయ్యాలరో... ఊగుతుంటే జాజిపూల జంపాలరో

చరణం 1 :

మోములోనా సందమామ గోముగున్నాదీ
మోజు తీరా పున్నమల్లే నవ్వుతున్నాదీ
మోములోనా సందమామ గోముగున్నాదీ
మోజు తీరా పున్నమల్లే నవ్వుతున్నాదీ

ఇంతకన్న ఏముంది ఎక్కడైనా..
ఏ చుక్కకైనా.. ఎంత చక్కనైనా
ఏ చుక్కకైనా.. ఎంత చక్కనైనా

కళ్ళే తారకలంటావు... కలలే కోరికలంటావు
కళ్ళే తారకలంటావు... కలలే కోరికలంటావు

అంటుమల్లె తీగ మల్లే అల్లుకుంటే...
ఒళ్లు ఝల్లుమంటే... వయసు వెళ్ళువైతే

కన్నెలేడి నడుమా... సన్నజాజి తొడిమా
కన్నెలేడి నడుమా... సన్నజాజి తొడిమా

ఉండీ లేనీ ఉయ్యాలరో... ఊగుతుంటే జాజిపూల జంపాలరో
ఉండీ లేనీ ఉయ్యాలరో... ఊగుతుంటే జాజిపూల జంపాలరో

చరణం 2 :

అద్దెరేయి నిద్దరేమో నిద్దరోయింది
పొద్దు కూడా ముద్దు లేక గడవనంటోంది
అద్దెరేయి నిద్దరేమో నిద్దరోయింది
పొద్దు కూడా ముద్దు లేక గడవనంటోంది

ఇంత కన్న చెప్పలేను సక్కనోడా..
చేతచిక్కినోడా.. తేనెచుక్కలోడా
చేతచిక్కినోడా.. తేనెచుక్కలోడా

కౌగిలి ఇల్లనుకుంటావు... కవితే కవ్వింతంటావు
కౌగిలి ఇల్లనుకుంటావు... కవితే కవ్వింతంటావు
కొండమల్లి పువ్వులాగ నవ్వుతుంటే... ఎండ ఎన్నెలైతే
ఏడి సల్లనైతే... 

నడుమే... హ.. హ.. హ
కన్నెలేడి నడుమే... సన్నజాజి తొడిమే
కన్నెలేడి నడుమే... సన్నజాజి తొడిమే

ఉందో లేదో ఉయ్యాలరో... ఊగుతుంటే జాజిపూల జంపాలరో
ఉందో లేదో ఉయ్యాలరో... ఊగుతుంటే జాజిపూల జంపాలరో

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4267

No comments:

Post a Comment