Sunday, April 3, 2016

పక్కింటి అమ్మాయి



చిత్రం : పక్కింటి అమ్మాయి (1980)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు 


పల్లవి : 


పక్కింటి అమ్మాయి...  పరువాల పాపాయీ
పక్కింటి అమ్మాయి...  పరువాల పాపాయి
పూసింది ఈనాడే...  పున్నాగ సన్నాయి ...
పక్కింటి అమ్మాయి...  పరువాల పాపాయీ ..





చరణం 1 :



ఆమే తెలుగు నవలా నాయికా
నాలో మధువులొలికే ప్రణయ కవితా గీతికా
ఆమే తెలుగు నవలా నాయికా
నాలో మధువులొలికే ప్రణయ కవితా గీతికా


కన్నెపిల్ల సయ్యాటలు .. సన్నజాజి పూదోటలు
కన్నెపిల్ల సయ్యాటలు .. సన్నజాజి పూదోటలు


జారేపైట పాడే జాణ తెలుగు పాటలు
నీలీ కనుల తేలే తేనె కళల తేటలు


పక్కింటి అమ్మాయి...  పరువాల పాపాయీ 






చరణం 2 :



అడుగే హంసలడిగే నాట్యము
కలికి చిలుక పలుకే చిలకలలిగే గీతము
అడుగే హంసలడిగే నాట్యము
కలికి చిలుక పలుకే చిలకలలిగే గీతము


ముద్దుగుమ్మ మోమాటము.. ముద్దుకేమో ఆరాటము
ముద్దుగుమ్మ మోమాటము.. ముద్దుకేమో ఆరాటము


పువ్వు పుట్టగానే పరిమళించే బంధము
పువ్వై పులకరించే నవ్వు నాకే సొంతమూ


పక్కింటి అమ్మాయి...  పరువాల పాపాయీ
పూసింది ఈనాడే...  పున్నాగ సన్నాయీ..
పక్కింటి అమ్మాయి...  పరువాల పాపాయీ .. 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5060

No comments:

Post a Comment