Monday, April 4, 2016

మనవే విననా




చిత్రం : గోపాలరావు గారి అమ్మాయి (1980)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : జి. ఆనంద్, సుశీల


పల్లవి :



మనవే వినవా మనసే కనవా..
మది లోపలి మాటను మన్నించవా
కలలే మరిచి...  కనులే తెరిచి
నిజమేదో స్వామీ గుర్తించవా
ఇక ఒంటిగ నన్నూ వదిలెయ్యవా..

మనవే విననా...  మనసే కననా
మది లోపలి మాటను మన్నించనా
గతమే మరచి...  కనులే తెరచి
నిజమైతే స్వామీ...  గుర్తించనా
ఇక ఒంటరితనమే వదిలించనా..


మనవే వినవా మనసే కనవా
మది లోపలి మాటను మన్నించవా



చరణం 1 :



నిను చూడగనే నే బెంగపడి
సంపెంగలలో అది దాచుకుని
చిరునవ్వులకే మది జివ్వుమని
కసి చూపులతో కబురంపుకొని

పరుగులు తీసే పరువంతో..
పైటలు జారే అందంతో
చక్కలిగిలిగా సరసాలాడే
చలి చలిగా సరిగమ పాడే
వలపులు పిలిచే ఈ వేళలో
వయసులు తెలిసే ఈ వేళలో

మనవే వినవా...  మనసే కనవా
మది లోపలి మాటను మన్నించవా




చరణం 2 :



తొలిచూపులనే మునిమాపులుగా
మరుమల్లెల జల్లులు జల్లుకుని
బిగి కౌగిలినే నా లోగిలిగా
అరముద్దుల ముగ్గులు పెట్టుకుని

 

కలలైపోయిన కన్నులతో
వలలైపోయిన చూపులతో
ప్రేమే ముదిరీ పెళ్ళైపోయీ
పెళ్ళే కుదిరీ ఇల్లైపోయే
మనసులు కలిసే ఈ వేళలో
మమతలు విరిసే ఈ వేళలో


మనవే వినవా...  మనసే కనవా
మది లోపలి మాటను మన్నించవా
కలలే మరిచి కనులే తెరిచి
నిజమేదో స్వామీ గుర్తించవా
ఇక ఒంటిగ నన్నూ వదిలెయ్యవా




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5152

No comments:

Post a Comment