Saturday, April 2, 2016

రింఝిం రింఝిం రింఝిం పలికెనులే

చిత్రం :  ప్రణయ గీతం (1981)
సంగీతం :  రాజన్-నాగేంద్ర
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  బాలు, సుశీల   

పల్లవి  :

రింఝిం రింఝిం రింఝిం పలికెనులే...  నా ప్రణయగీతం
నాలోని వాణి... నీలాలవేణి తానే నేనై పాడగా
నా వేణిలోన మాణిక్యవీణ... నేనే తానై మ్రోగగా
నేలా నింగీ ఆడగా...  పూలే తాళం వేయగా

చరణం 1 :

ఈ వదనమే కమలమై పూచెనా
భావనలే రేకులై నాకై వేచెనా

నీ హృదయమే భ్రమరమై దాగెనా
కోరికలే రెక్కలై నాపై మూగెనా

అహహా...  కాలమే లీలగా ఆడెనా
నీలో ఉన్న నాదాలన్ని నాలో పొంగెనా

రింఝిం రింఝిం రింఝిం పలికెనులే...  నా ప్రణయగీతం
నాలోని వాణి... నీలాలవేణి తానే నేనై పాడగా
నా వేణిలోన మాణిక్యవీణ... నేనే తానై మ్రోగగా
నేలా నింగీ ఆడగా...  పూలే తాళం వేయగా

రింఝిం రింఝిం రింఝిం పలికెనులే...  నా ప్రణయగీతం

చరణం 2 :

నీ పెదవినే మురళినై పిలిచెనా
రసధునులే రవుళులై నాలో నిలిచెనా

నీ పదములే హంసలై కదలెనా
లయజతులే హొయలులై నాలో ఒదిగెనా

నందనం చేతికే అందెనా
నాలో ఉన్న అందాలన్ని నీలో పండెనా 

రింఝిం రింఝిం రింఝిం పలికెనులే...  నా ప్రణయగీతం
నాలోని వాణి... నీలాలవేణి తానే నేనై పాడగా
నా వేణిలోన మాణిక్యవీణ... నేనే తానై మ్రోగగా
నేలా నింగీ ఆడగా...  పూలే తాళం వేయగా

రింఝిం రింఝిం రింఝిం పలికెనులే...  నా ప్రణయగీతం

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5103

No comments:

Post a Comment