Friday, May 13, 2016

పెదవుల మోహన మురళి

చిత్రం : జగనాథ రథచక్రాలు (1982)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :  


లలలల.. లలలలల...
స..గరినిససస...
రి.. మగసనిరి.. ససదనిస


గరినిస ససస.. ససస...
గరినిస ససస.. ససస...
సమమమమమ... సపపపపప
సదనిప గమపద నిరిగమగరిస


పెదవుల మోహన మురళి... పదముల మువ్వల రవళి
తరంగశ్రుతిలో... మృదంగజతిలో
పలికెను కులికెను యమునాతటిలో


చరణం 1 :


గగగగస సగమగమగగ
పూవై పూచెను రాధా హృదయం
పపపప మపమదమరిస
తావై వీచెను మాధవ ప్రణయం


పులకరించెను యవ్వన నందనము
చిలకరించెను ప్రణయసుధారసము
నేను రాధైపోతే ఒక క్షణము
నీవు మాధవుడైతే ఆ క్షణము


వెన్నముద్దలు... కన్నెముద్దులు
ఏవి ఎన్నో ఎన్నిక చేస్తూ ఉందాము



గరినిస ససస.. ససస...
గరినిస ససస.. ససస...
సమమమమమ... సపపపపప
సదనిప గమపద నిరిగమగరిస


పెదవుల మోహన మురళి... పదముల మువ్వల రవళి
తరంగశ్రుతిలో... మృదంగజతిలో
పలికెను కులికెను యమునాతటిలో



చరణం 2 :


నినిసరిగమపదని...రిరిగమపపదనిసరి


గగగగస సగమగ మగగ
నీవూ నేనొక పూవులవేళా...
పపపపప మపమగపనిస 
నీలాకాశం నవ్వేవేళా

వెన్నెలల్లిన పొన్నల నీడలలో...
సన్నజాజులు జల్లిన బాటలలో..
మిన్నూ మన్నూ కలిసిన తీరంలో...
నిన్నూ నన్నూ తెలియని లోకంలో...
కొండకోనల గోకులానా.. కోటికోర్కెల గోవులు కాస్తూ ఉందాము


గరినిస ససస.. ససస...
గరినిస ససస.. ససస...
సమమమమమ... సపపపపప
సదనిప గమపద నిరిగమగరిస


పెదవుల మోహన మురళి... పదముల మువ్వల రవళి
తరంగశ్రుతిలో... మృదంగజతిలో
పలికెను కులికెను యమునాతటిలో


No comments:

Post a Comment