Thursday, June 16, 2016

భామా ఈ తిప్పలు తప్పవు





చిత్రం: ఛాలెంజ్ (1984)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, జానకి




పల్లవి :


భామా...  ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా..
మావా...  నీ పప్పులు ఉడకవు ఆపర గోలా


వద్దంటే వయసొచ్చి...  వద్దన్నా మనసిచ్చి
నిద్దరకే సెలవిచ్చేయ్ ఈ వేళా..


భామా...  ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా..



చరణం 1 :



తప్పంటూ చేయక పోతే తగలాటము..
నిప్పంటి వయసులతోనా చెలగాటము
ఐతే మరి ఎందుకు చెప్పు మోమాటము
ఆడదాని మోమాటాలే ఆరాటము



వానాకాలం ముసిరేస్తుంటే
వాటేసుకునే హక్కే ఉంది
ఇదివానో గాలో పొంగో వరదో
రారా మలిపొద్దులు పుచ్చక సుద్దులతో ఈ వేళా



మావా...  నీ పప్పులు ఉడకవు ఆపర గోలా
భామా...  ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా..




చరణం 2 :




ఏదిక్కూ లేని చోటే ఏకాంతము
నా దిక్కూ మొక్కూ నువ్వే సాయంత్రమూ
ఇప్పట్లో వద్దూ మనకు వేదాంతము
సిగ్గంటూ బుగ్గివ్వడమే సిద్దాంతము


కవ్వింతల్లో కసిగా ఉంటే.. కౌగిలి కన్నా దారేముంది
అది రైటో కాదో నైటో పగలో..రావే
చెలి ఆకలి తీర్చకు చూపులతో ఈ వేళా


భామా...  ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా..
మావా...  నీ పప్పులు ఉడకవు ఆపర గోలా
వద్దంటే వయసొచ్చి వద్దన్నా మనసిచ్చి
నిద్దరకే సెలవిచ్చేయ్ ఈ వేళా..



భామా...  ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా..
మావా...  నీ పప్పులు ఉడకవు ఆపర గోలా







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9348

No comments:

Post a Comment