Wednesday, June 22, 2016

తోటాకూరా కోస్తుంటే





చిత్రం :  రుస్తుం (1984)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల
 





పల్లవి : 


తోటాకూరా కోస్తుంటే తొంగి తొంగి చూస్తావు...
వంగా పండు కోస్తుంటే వంగి వంగి చూస్తావు


తొంగి తొంగి చూసేది ఏంది మావా...
తొంగి తొంగి చూసేది ఏంది మావా...
దొంగ గడ్డి మేసేది ఎందుకు మావా
దొంగ గడ్డి మేసేది ఎందుకు మావా




హొయ్... తోటాకూరా కోస్తుంటే పైట జారా వేస్తావు
వంగా పండు కోస్తునే వన్నేలారా వేస్తావు 


తొంగి తొంగి చూసేది చందమావా...
తొంగి తొంగి చూసేది చందమావా...
దొడ్డిదారినొచ్చేది ప్రేమ ప్రేమా
దొడ్డిదారినొచ్చేది ప్రేమ ప్రేమా




చరణం 1 :


కాయో పండో కవ్విస్తోంది... కొమ్మచాటు వద్దింకా.. హహా..
పువ్వు పింది పండె దాకా కొట్టా వద్దు గోరింకా... హహా..


వన్నె చూశా... కన్ను వేశా... అబ్బ నీకు ఎంత ఆశా


చేనే కంచే మేసేస్తోంటే గొప్ప తంటా..
చేసేదంతా చెప్పెస్తోంటే ఒప్పనంటా


వాలు పొద్దు ముద్దు లేని వంగ తోటా
వాలు పొద్దు ముద్దు లేని వంగ తోటా
ఒళ్లు ఒళ్లు అల్లుకుంటే వలపు తోటా
ఒళ్లు ఒళ్లు అల్లుకుంటే వలపు తోటా


అరె... తోటాకూరా కోస్తుంటే పైట జారా వేస్తావు
వంగా పండు కోస్తుంటే వంగి వంగి చూస్తావు 




చరణం 2 :



పామో తేలో ఉంటాయేమో వాదించకు వద్దింకా
ఊరు వాడా చూస్తేనేమి చాటు మాటు వద్దింకా



అమ్మ చాటు నాకు లేదు... అయ్య చాటు నాకు లేదు


చెయ్యి చెయ్యి చెట్టా పట్టి చెక్కేద్దామా
సందే గాలి సందిళ్లల్లో నొక్కేద్దామా


తోడు లేని జీవితాలే తోటకూరా...
తోడు లేని జీవితాలే తోటకూరా...
నీడనిస్తే తోడు ఉంటా కట్టుకోరా
నీడనిస్తే తోడు ఉంటా కట్టుకోరా


హొయ్... తోటాకూరా కోస్తుంటే పైట జారా వేస్తావు
వంగా పండు కోస్తుంటే వంగి వంగి చూస్తావు


తొంగి తొంగి చూసేది చందమావా...
తొంగి తొంగి చూసేది చందమావా...
దొంగ గడ్డి మేసేది ఎందుకు మావా
దొంగ గడ్డి మేసేది ఎందుకు మావా






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=9355

No comments:

Post a Comment