Wednesday, June 1, 2016

L అంటే O అంటే





చిత్రం :  రుద్రనేత్ర (1981)
సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, చిత్ర 






పల్లవి :



L అంటే O అంటే V అంటే E అంటే ...  లవ్వు లవ్వు LOVE లే
K అంటే I అంటే S అంటే S అంటే...  కిస్సు కిస్సు KISS లే
L అంటే O అంటే V అంటే E అంటే...  లవ్వు లవ్వు LOVE లే
K అంటే I అంటే S అంటే S అంటే...  కిస్సు కిస్సు KISS లే


నువ్వంటే నేనంటే ఓ జంటే
నీవెంటే నేనుంటా మోజుంటే
వద్దన్నా ముద్దంటా వలపుంటే
సై అంటే సై అంటే సయ్యాటే


L అంటే O అంటే V అంటే E అంటే...  లవ్వు లవ్వు LOVE లే
K అంటే I అంటే S అంటే S అంటే...  కిస్సు కిస్సు KISS లే 




చరణం 2 : 



వస్తే రమ్మంటా వయసే తెమ్మంటా వాలు పొద్దుల పూట
నేనే కన్నంటా నువ్వే చూపంటా పేలనీ తొలి తూటా
అరె గుట్టే నాదంటా గురిలో వుందటా ఆడనా చెలి వేట
గువ్వే నేనంట గుబులే నాదంటా గూటికే రమ్మంటా


ఈ జోరులో... ఓ.. ఈ జోరులో చలాకి అందాలు ముద్దడితే ముచ్చట
జోహారని పెదాల ఎంగిల్లు అందించనా ఇచ్చట
ఆ... కౌగలింతకే కన్నె తాపాలూ చెల్లంటా
గట్టి తాకిడి ఏదో సాగింది లెమ్మంటా
ఆమాటే నువ్వంటె నేనింటే ... కొట్టిందిలే గంట


L అంటే O అంటే V అంటే E అంటే లవ్వు లవ్వు LOVE లే
K అంటే I అంటే S అంటే S అంటే కిస్సు కిస్సు KISS లే 





చరణం 2 :




సోకే నాదంటా సొత్తే నీదంట దోచుకో మరి వాటా
పువ్వే నువ్వంటా తొడిమే నేనంటా తూచనా చెలి కాటా
ఏరే నేనంటా నీరే నీవ్వంటా ఏకమై పదమంటా
నీతో నేనుంటే మోతే మోతంటా చేరుకో పొదరింట 


ఈ ఊపులో...  ఓ... ఈ ఊపులో గులాబి గుప్పెళ్ళు విప్పెయ్యనా ఇచ్చటా
అరే ఈ కైపులో వరించి వత్తిళ్ళు పెంచెయ్యనా అచ్చటా


చుక్కలాడితే ఉక్క పోసేదే ప్రేమంటా
గుట్టు చప్పుడై గుండె లాగింది రమ్మంటా
ఆమాటే నువ్వంటే నేనింటే కొట్టిందిలే గంట


L అంటే O అంటే V అంటే E అంటే .. లవ్వు లవ్వు LOVE లే
K అంటే I అంటే S అంటే S అంటే ... కిస్సు కిస్సు KISS లే


నువ్వంటే నేనంటే ఓ జంటే
నీవెంటే నేనుంటా మోజుంటే


L అంటే O అంటే V అంటే E అంటే...  లవ్వు లవ్వు LOVE లే
K అంటే I అంటే S అంటే S అంటే ... కిస్సు కిస్సు KISS లే
S S S లే 







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9436

No comments:

Post a Comment