Monday, July 11, 2016

ఓ రాణి.. మహరాణి






చిత్రం : వేట (1986)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల




పల్లవి :



ఓ రాణి.. మహరాణి...
ప్రియదర్శిని.. రసవర్షిణి రావే


ఈ రాణి... అలివేణి
నవరాగిణి... యువమోహిని.. నీదే


సుధలా నా పెదవుల్లో ప్రవహించే...
ఎదలా పైఎద మీద పవళించే
మధురభావనల... మౌనగీతికలోనా..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ ఆ ఆ ఆ ఆ

ఓ రాణి.. మహరాణి...
నవరాగిణి... యువమోహిని.. నీదే




చరణం 1 :



వేసవి చిగురాకునై.. నీ గాలిలో డోలలూగానులే
ఆమని తొలి పూవునై.. నీ ప్రేమకే పూజ చేశానులే


ఇన్నాళ్ల ఎడబాటులో... ఒడిగెట్టినా ఆశనై
ఎడబెట్టినా ఆశతో... నిలబెట్టినా శ్వాసనై  
ఎదురు చూచితిని ఎదను చాచితిని నీకై..
ఆ.. ఆ.. ఆ.. ఆ..ఆఆఆ...



ఈ రాణి... అలివేణి
ప్రియదర్శిని.. రసవర్షిణి రావే





చరణం 2 :



వెన్నెలా కను గిన్నెలా... నీకోసమే నింపుకున్నానులే
వానలా తడి వీణలా... నీ పాటనే చల్లుకున్నానులే


ఇన్నాళ్ల విరహాగ్నిలో...  తడి ఆరినా ప్రేమనై
ఈనాటి ఈ హాయిలో... తనువంత కర్పూరమై
కరిగిపోతిని కలిసిపోతిని నీలో...
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..ఆ. ఆ..ఆ..ఆ




ఓ రాణి.. మహరాణి...
ప్రియదర్శిని.. రసవర్షిణి రావే


ఈ రాణి... అలివేణి
నవరాగిణి... యువమోహిని.. నీదే


సుధలా నా పెదవుల్లో ప్రవహించే...
ఎదలా పైఎద మీద పవళించే
మధురభావనల... మౌనగీతికలోనా..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ ఆ ఆ ఆ ఆ







No comments:

Post a Comment