Tuesday, July 12, 2016

ఓ చిన్నదానా నా ఒంటిబాధ





చిత్రం :  రక్త సింధూరం (1985)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల   




పల్లవి :



ఓ చిన్నదానా నా ఒంటిబాధ కన్నావా..  ఓ భామా
ఈ సందెవేళ నా జాలి గాధ విన్నావా.. రా భామా 


నా కంటిపాపా నీ జంటతోనే ఓ ఇంటివాణ్ణి చేసేయ్యవా
ఏకాంత వేళ   ఈ కాంత సేవా వరమియ్యవా

ఓ చిన్నవాడా  చిలకమ్మ తోడ విన్నాలే నీ గోలా
నా ఇంటి దొంగ నీ ఇంటి బెంగ కన్నాలే ఈ వేళ


ఈ చంటివాణ్ణి ఓ ఇంటివాణ్ణి చేస్తాను గానీ మానెయ్యవా
నా అందమంతా నీ హారతేలే లాలించరా





చరణం 1 :


జలకాలాడించనా.. జడలే అల్లించనా
జాజీపూలెట్టి పూజించనా


కసిగా కవ్వించనా... రుచిగా నవ్వించనా
నడుమే అందించి లాలించనా


ఇల్లే కట్టేస్తే.. కౌగిళ్లిచ్చేస్తా
ముగ్గే పెట్టెస్తే ముగిళ్లిచేస్తా


సామిరంగ సందెముద్దు పెట్టనీదాయే
నింగిలోని రంగు పొద్దు జారనీడాయే



ఓ చిన్నదానా నా ఒంటిబాధ కన్నావా..  ఓ భామా
నా ఇంటి దొంగ నీ ఇంటి బెంగ కన్నాలే ఈ వేళ




చరణం 2  :



మనసై జపించనా... వయసై తపించనా
మల్లేదీపాలు వెలిగించనా


సొగసై వరించనా.. సగమై తరించనా
మసకా మంత్రాలు వల్లించనా


ముసిరే సిగ్గుల్తో ముద్దే ఇచ్చేస్తా
ఇచ్చే ముద్దుల్తో నచ్చేదిమ్మంటా


అబ్బరంగా ఒక్కటిచ్చి పండుకోడాయే
నిబ్బరంగా నిప్పు ఈడు ఉండనీదాయే



ఓ చిన్నవాడా  చిలకమ్మ తోడ విన్నాలే నీ గోలా
ఈ సందెవేళ నా జాలి గాధ విన్నావా.. రా భామా 


ఈ చంటివాణ్ణి ఓ ఇంటివాణ్ణి చేస్తాను గానీ మానెయ్యవా
ఏకాంత వేళ   ఈ కాంత సేవా వరమియ్యవా  


ఉమ్మ్.. ఉమ్మ్మ్.. ఉమ్మ్మ్.. ఉహు..హు..ఉహు..
అహాహా... ఓ..హో..హో...






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=9364

No comments:

Post a Comment