Monday, August 1, 2016

హల్లో మై రీటాచిత్రం  :  వయసు పిలిచింది (1978)
సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత  :  వీటూరి
నేపధ్య గానం  :  బాలు  పల్లవి :మాటే మరచావే..చిలకమ్మ..మనసువిరిచావే
అంతట నీవే కనిపించి..అలజడి రేపావే


హల్లో మై రీటా... ఏమైంది నీ మాట
హల్లో మై రీటా... ఏమైంది నీ మాట


పాడేవు సరికొత్త పాట... మారింది నీ బాట...
హల్లో మై రీటా...  ఏమైంది నీ మాట
పాడేవు సరికొత్త పాట... మారింది నీ బాట... 
చరణం 1 :
నీ పెదవులుచిలుకును మధురసం
నీ హృదయం మాత్రం పాదరసం
నీ పెదవులు చిలుకును మధురసం
నీ హృదయం మాత్రం పాదరసం


నాలో రేపావు... ఊ... జ్వాల ఒకరితో పాడేవు... ఊ... జోల
నను మరచిపోవడం న్యాయమా
మనసమ్మినందుకు నమ్మినందుకు
వలపు గుండెకే గాయమా
కథలే మారెను కలలే మిగిలెను హే... ఏయ్ 


హల్లో మై రీటా...  ఏమైంది నీ మాట
పాడేవు సరికొత్త పాట... మారింది నీ బాట


చరణం 2 :
ప్రేమన్నది దేవుని కానుక
అది నీకు కేవలం వేడుక
ప్రేమన్నది దేవుని కానుక
అది నీకు కేవలం వేడుక
కృష్ణుడు ఆశపడి... రాగా
రాధిక వేరు పడి... పోగా
ఎడబాటు సహించదు హృదయము
ఒకనాటికెైన నీ జీవితాన  కనరాకపోవునా ఉదయము
నిజమే తెలుసుకో గతమే తలచుకో..హేయ్హల్లో మై రీటా... ఏమైంది నీ మాట
హల్లో మై రీటా... ఏమైంది నీ మాట
పాడేవు సరికొత్త పాట... మారింది నీ బాట
మాటే మరచావే...చిలకమ్మ.. మనసువిరిచావే..
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5605

No comments:

Post a Comment