చిత్రం : గూఢచారి 116 (1966)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
పడిలేచే కెరటం చూడు... పడుచుపిల్ల బింకం చూడు
తొంగి చూచు సిగ్గులు చూడు... పొంగుతున్న అందం చూడు

చరణం 1 :
వెన్నెల విరిసే వేళా... వన్నెలు మెరిసే వేళా
చందమామ పరుగులు చూడు... చల్లగాలి ఆరడి చూడు

మిసమిసలా చిన్నలు చూడు... ఉసిగొలిపే హృదయం చూడు
పడిలేచే కెరటం చూడు... పడుచుపిల్ల బింకం చూడు
తొంగి చూచు సిగ్గులు చూడు... పొంగుతున్న అందం చూడు
పడిలేచే కెరటం చూడు...
చరణం 2 :
పరులెవరూలేని చోటా... పరువాలు పూచే చోటా
తరుగుతున్న కాలం చూడు... పెరుగుతున్న ఆశలు చూడు

మరుగులేని మమతలు చూడూ... మనసుంటే నన్నే కూడు
పడిలేచే కెరటం చూడు... పడుచుపిల్ల బింకం చూడు
తొంగి చూచు సిగ్గులు చూడు... పొంగుతున్న అందం చూడు
పడిలేచే కెరటం చూడు...
No comments:
Post a Comment