Wednesday, September 7, 2016

సుందరమో సుమధురమో






చిత్రం : అమావాస్య చంద్రుడు (1981)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి  




పల్లవి : 



సరిగమపదని సప్తస్వరాలు మీకు
అవి ఏడురంగుల ఇంద్రధనుస్సులు మాకు
సరిగమపదని సప్తస్వరాలు మీకు
అవి ఏడురంగుల ఇంద్రధనుస్సులు మాకు


మనసే ఒక మార్గము...  మమతే ఒక దీపము
ఆ వెలుగే మాకూ దైవము


సరిగమపదని సప్తస్వరాలు మీకు
అవి ఏడురంగుల ఇంద్రధనుస్సులు మాకు



సుందరమో సుమధురమో... చందురుడందిన చందన శీతలమో
మలయజ మారుత శీకరమో... మనసిజ రాగ వశీకరమో
సుందరమో సుమధురమో... చందురుడందిన చందన శీతలమో 






చరణం 1 :



ఆనందాలే భోగాలైతే... హంసానంది రాగాలైతే
నవ వసంత గానాలేవో సాగేనులే... సురవీణ నాదాలెన్నో మోగేనులే


వేకువలో వెన్నెలలో చుక్కలు చూడని కోనలలో
మావుల కొమ్మల ఊగిన కోయిల వేణువులూదిన గీతికలు

సుందరమో సుమధురమో...  చందురుడందిన చందన శీతలమో


చరణం 2 :



అందాలన్నీ అందే వేళ...  బంధాలన్నీ పొందే వేళ
కన్నుల్లో గంగా యమునా పొంగేనులే... కౌగిట్లో సంగమమేదో సాగేనులే


కోరికలే శారికలై ఆడిన పాడిన సందడిలో
మల్లెల తావుల పిల్లన గ్రోవులు పల్లవి పాడిన పందిరిలో



సుందరమో ... చందురుడందిన చందన శీతలమో
మలయజ మారుత శీకరమో... మనసిజ రాగ వశీకరమో
సుందరమో సుమధురమో... చందురుడందిన చందన శీతలమో






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5767

1 comment: