చిత్రం : ఆకలి రాజ్యం (1980)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు
పల్లవి :
హే హే హే హే హే హే హేహే ఏ ఏహే
రు రు రు రు రూరు రూ రూ రురు
సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే... బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కుడా పెళ్లి లాంటిదే... బ్రదర్
సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే... బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కుడా పెళ్లి లాంటిదే... బ్రదర్
చరణం 1 :
మన తల్లి అన్నపూర్ణ.. మన అన్న దానకర్ణ
మన భూమి వేదభూమిరా.. తమ్ముడూ
మన కీర్తి మంచు కొండరా
మన తల్లి అన్నపూర్ణ.. మన అన్న దానకర్ణ
మన భూమి వేదభూమిరా.. తమ్ముడూ
మన కీర్తి మంచు కొండరా
డిగ్రీలు తెచ్చుకొని చిప్ప చేత పుచ్చుకొని
ఢిల్లీకి చేరినాము దేహి దేహి అంటున్నాము
దేశాన్ని పాలించే భావి పౌరులం బ్రదర్
సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే... బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కుడా పెళ్లి లాంటిదే... బ్రదర్
చరణం 2 :
బంగారు పంట మనది మిన్నేరు గంగ మనది
ఎలుగెత్తి చాటుదామురా ఇంట్లో ఈగల్ని తోలుదామురా
ఈ పుణ్య భూమిలో పుట్టడం మన తప్పా
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా
ఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్పా... ఆ.. ఆ..
ఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్పా
గంగలో మునకేసి కాషాయం కట్టెయ్ బ్రదర్
సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే... బ్రదర్
చరణం 3 :
సంతాన మూలికలము సంసార బానిసలము
సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడు... సంపాదనొకటి కరువురా
చదవెయ్య సీటు లేదు... చదివొస్తే పనీ లేదు
అన్నమో రామచంద్రా అంటే పెట్టే దిక్కే లేదు
దేవుడిదే భారమని పెంపు చేయరా బ్రదర్
సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే... బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కుడా పెళ్లి లాంటిదే... బ్రదర్
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5619
No comments:
Post a Comment