Saturday, October 1, 2016

ఓహో తమరేనా

చిత్రం : కన్నెమనసులు (1966)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల 

పల్లవి :

ఓహో తమరేనా చూడవచ్చారు... చూసీ ఏం చేస్తారు
ఓహో తమరేనా చూడవచ్చారు... చూసీ ఏం చేస్తారు

అమ్మమ్మ... అమ్మమ్మా ... అయ్యో రామా
ఓహో తమరేనా చూడవచ్చారు... చూసీ ఏం చేస్తారు

చరణం 1 :

సంతలోని జంతువును కాను సుమా
వంట యింటి కుందేలును అవను సుమా
సంతలోని జంతువును కాను సుమా
వంట యింటి కుందేలును అవను సుమా

ఎవరేమిటన్నా మగవాళ్ళకన్నా
మా వాళ్ళె మిన్నా నీ డాబు సున్నా..
వెళ్ళండి వెళ్ళండి మీ దారి మళ్ళండి...  డూ డూ డూ బసవన్నా

ఓ మామా....  అయ్యో రామా
ఓహో తమరేనా చూడవచ్చారు... చూసీ ఏం చేస్తారు

చరణం 2 :

అలుగుట తగదురా పెళ్ళి కుమారా
హాస్యములాడితిరా వలపుల చోరా
చెమటలు పోసినవా చెంగున వీతురా
చెమటలు పోసినవా చెంగున వీతురా
చెలరేగి నీ భరతం పట్టిస్తారా

ఓ మామా....  అయ్యో రామా
ఓహో తమరేనా చూడవచ్చారు... చూసీ ఏం చేస్తారు

చరణం 3 :

మూడునాళ్ళ ముచ్చటకే మురిసినచో
ఆడపిల్ల బ్రతుకంతా హరోంహరా
మూడునాళ్ళ ముచ్చటకే మురిసినచో
ఆడపిల్ల బ్రతుకంతా హరోంహరా
పెళ్ళాడు రోజు ఉంటుంది మోజు
ఆపైన క్లోజు పడుతుంది బూజు
ఆనాడు ఈనాడు ఏనాడు మనువాడు ఇంతే రివాజు

ఓ మామా....  అయ్యో రామా
ఓహో తమరేనా చూడవచ్చారు... చూసీ ఏం చేస్తారు

No comments:

Post a Comment