స్వరాల పల్లకి
Guest Book
[Sign My Guestbook]
[View My Guestbook]
Powered by E-Guestbooks Server
.
Sunday, December 4, 2016
మధురం మధురం నాదం
చిత్రం : కోకిలమ్మ (1983)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం : బాలు, పి. బి. శ్రీనివాస్
పల్లవి :
మధురం మధురం నాదం... అది అమరం అమరం వేదం
నాదం గానం సామం... స్వర కలితం లలితం రమ్యం
మధురం మధురం నాదం... అది అమరం అమరం వేదం
నాదం గానం సామం... స్వర కలితం లలితం రమ్యం
శ్రీవాణీ వీణా జనితం.. సురమౌని మహతీ సరితం.. అతిలోక బ్రహ్మానందం ఓంకారనాదం
శ్రీవాణీ వీణా జనితం.. సురమౌని మహతీ సరితం.. అతిలోక బ్రహ్మానందం ఓంకారనాదం
అమితం అమృతం నిరతం... శిశు పశు ఫణి సహితం విదితం
చౌకం మధ్యమ దురితం... త్రైకాల సంచారం
ఆ.. ఆ.. ఆ... ఆ..
ఆ.. ఆ.. ఆ... ఆ..
ఆ.. ఆ.. ఆ... ఆ..
శ్రీవాణీ వీణా జనితం.. సురమౌని మహతీ సరితం అతిలోక బ్రహ్మానందం ఓంకారనాదం
చరణం 1 :
మామూలు వెదురే మాధవ మురళియై రాగాల సుధలే చిలికినది
మామూలు వెదురే మాధవ మురళియై రాగాల సుధలే చిలికినది
త్యాగయ్య గళమై అన్నయ్య పదమై వాగ్గేయ సిరులే కురిసినవి
గీతం కవితా హృదయం... సంగీతం జనతా హృదయం
రాగం తానం మకుటం... త్రైమూర్తి రూపం
చరణం 2 :
జయదేవ కవితై గోవింద గీతై పద్మావతేగా పలికినది
జయదేవ కవితై గోవింద గీతై పద్మావతేగా పలికినది
ప్రియురాలి శోకమే తొలి కావ్య శ్లోకమై శ్రీరామచరితై నిలిచినది
తీరని దాహం గానం... కడతీర్చే జ్ఞానం గానం
రాగం భోగం మోక్షం... సంగీతయోగం
శ్రీవాణీ వీణా జనితం సురమౌని మహతీ సరితం అతిలోక బ్రహ్మానందం ఓంకారనాదం
ఆ.. ఆ.. ఆ... ఆ..ఆ.. ఆ.. ఆ... ఆ..
ఆ.. ఆ.. ఆ... ఆ..
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment