Saturday, December 3, 2016

వైశాఖ మాసాన వయసొచ్చెనమ్మా








చిత్రం  :  కంచు కాగడా (1984)
సంగీతం  :  చక్రవర్తి
గీతరచయిత  :  వేటూరి
నేపధ్య గానం  :  బాలు, సుశీల  




పల్లవి  :



వైశాఖ మాసాన వయసొచ్చెనమ్మా...
ఆషాఢ మాసాన వానొచ్చెనమ్మా...
చినుకుపడ్డా వేళా...  చీకటొచ్చే వేళా
చిన్నవాడి మీదే మనసాయెనమ్మా
కాదు కాదు వాన జల్లు...  కన్నె ఈడు తేనె ముల్లు



వైశాఖ మాసాన వయసొచ్చెనమ్మా...
వయసన్నదే గాలి వానంటిదమ్మా
వానలొచ్చే  వేళా... హా.. వరద పొంగే వేళా
వాటేసుకోకుంటే  బ్రతుకెందుకమ్మా
ఆగిపోదు వాన జల్లు...  కౌగిలింతే నీకు ఇల్లు



చరణం 1 :



గుండె చాటు గూటిలో... గుట్టులాంటి చోటులో
తొలిసారిగా నీకు తోడవ్వనా... చలిగాలిలో నీకు వేడవ్వనా



నల్లమబ్బు నీడలో... పిల్లగాలి పైటలో
చిరుగాలిలా దూరి సిగ్గంటనా... చినుకల్లే నీ లేత బుగ్గంటనా



చీమలాగ కుట్టింది తేమ ఇప్పుడు... చిచ్చుపెట్టి చంపింది వాన ఇప్పుడు
వాన వల్ల తెలిసింది వయసు చప్పుడు... 

కన్నెసోకు వాన విల్లు... కన్ను సోకి పూల జల్లు


అరే... వైశాఖ మాసాన వయసొచ్చెనమ్మా...
హోయ్... ఆషాఢ మాసాన వానొచ్చెనమ్మా...



చరణం 2 :



మబ్బు చాటు ఎండలా.. మండుతున్న గుండెలో
నీ అందమే కాపు పెట్టెయ్యనా... నీ కాపురం నేను చేసెయ్యనా


కౌగిలింత ఖైదులో... ఘాటు ప్రేమ శిక్షలో
తాపాల తాళాలు వేసెయ్యనా... నిను జన్మ ఖైదీని చేసెయ్యనా


ఒంపులెన్నో చూశాను ఒక్కసారిగా... చూడగానే పుట్టింది వేడి కోరికా
ఒంటికంటుకున్నాది పైట జారకా...
వాన వచ్చే వయసు గిల్లి... పొంగి పోయే పాలవెల్లి


అరే... వైశాఖ మాసాన వయసొచ్చెనమ్మా...
హోయ్...వయసన్నదే గాలి వానంటిదమ్మా


చినుకుపడ్డా వేళా...  వరద పొంగే వేళా
చిన్నవాడి మీదే మనసాయెనమ్మా 







No comments:

Post a Comment