Showing posts with label పి. బి. శ్రీనివాస్. Show all posts
Showing posts with label పి. బి. శ్రీనివాస్. Show all posts

Monday, November 15, 2021

సుధామధురము కళాలలితమీ సమయము

 



చిత్రం : కృష్ణప్రేమ (1961)

సంగీతం : పెండ్యాల  

గీతరచయిత :  శ్రీశ్రీ 

నేపథ్య గానం :  పి. బి. శ్రీనివాస్, సుశీల  


పల్లవి :


సుధామధురము కళాలలితమీ సమయము

ఆహా...  మధురము

సుధామధురము కళాలలితమీ సమయము

ఆహా...  మధురము

రాగ తాళ సమ్మేళన వేళ...

రాగ తాళ సమ్మేళన వేళ... 

 

సుధామధురము కళాలలితమీ సమయము

ఆహా...  మధురము

 

చరణం 1 :


పాడెనే మలయానిలం...  ఆహా ఆడెనే ప్రమదావనం

ఆ ఆ ఆ ఆ

పాడెనే మలయానిలం... ఆహా ఆడెనే ప్రమదావనం

పాటలతో సయ్యాటలతో ఈ జగమే మనోహరము

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ


సుధామధురము కళాలలితమీ సమయము

ఆహా...  మధురము


చరణం 2 :


రాగముల... సరాగముతో

నా మది ఏలెను నీ మురళి

అందముల... పసందులతో చిందులు వేసెను నీ సరళి


నీ కులుకే లయానిలయం

నీ పలుకే సంగీతమయం

ప్రమద గానాల ప్రణయ నాట్యాల

ప్రకృతి పులకించెనే..హ హ హ హా


సుధామధురము కళాలలితమీ సమయము

ఆహా...  మధురము


చరణం 3 :



పదముల వాలితిని హృదయమే వేడితిని

పదముల వాలితిని హృదయమే వేడితిని

పరువపు నా వయసు మెరిసే నా సొగసు

చెలిమి పైన నివాళిగా చేకొనుమా వనమాలీ

ఆ ఆ ఆ ఆ ఆ ఆ

నా హృదయ విహారిణివే నాట్యకళా విలాసినివే

ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఆ ఆ ఆ ఆ

ఆ ఆ ఆ ఆ

ఆ ఆ ఆ ఆ ఆ


సుధామధురము కళాలలితమీ సమయము

ఆహా...  మధురము..


Wednesday, February 3, 2021

ఏం... ఎందుకని

 



చిత్రం : తేనె మనసులు (1965)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం : పి. బి. శ్రీనివాస్, సుశీల 


పల్లవి :


ఏం... ఎందుకని... ఈ సిగ్గెందుకని

ఆలుమగల మధ్యనున్నది ఎవరికి తెలియదని


ఏం... ఎందుకని... ఈ సిగ్గెందుకని

ఆలుమగల మధ్యనున్నది ఎవరికి తెలియదని


చరణం 1 :


దీపముంటే సిగ్గంటివి... చీకటైనా సిగ్గెందుకు

దీపముంటే సిగ్గంటివి... చీకటైనా సిగ్గెందుకు

మొగ్గ విరిసే తీరాలి... సిగ్గు విడిచే పోవాలి 


ఏం... ఎందుకని... ఈ సిగ్గెందుకని

ఆలుమగల మధ్యనున్నది ఎవరికి తెలియదని



చరణం 2 :


ఆ గదిలో నీ హృదిలో... కౌగిలిలో ఈ బిగిలో

ఆ గదిలో నీ హృదిలో... కౌగిలిలో ఈ బిగిలో

ఎలా ఉందో ఏమౌతుందో... ఏం చేయాలని నీకుందో... చెప్పు


ఏం... ఎందుకని... ఈ సిగ్గెందుకని

ఆలుమగల మధ్యనున్నది ఎవరికి తెలియదని


చరణం 3 :


ఊహు! పక్కన చేరాడా చేరి... చెక్కిలి నొక్కాడా

చెల్లీ పక్కన చేరాడా చేరి... చెక్కిలి నొక్కాడా

ఇక్కడనా? చెక్కిలినా?... ఏమిటిదీ గిల్లినదా... 

ఇక్కడనా? చెక్కిలినా?... ఏమిటిదీ గిల్లినదా... 

పంటికి గోటికి తేడా లేదా

ఎందుకులే... ఎందుకులే... ఈ బుకాయింపులు


ఏం... ఎందుకని... ఈ సిగ్గెందుకని

ఆలుమగల మధ్యనున్నది ఎవరికి తెలియదని


చరణం 4 :


పగటి వేషం నాదమ్మా... రాత్రి నాటకం నీదమ్మా

పగటి వేషం నాదమ్మా... రాత్రి నాటకం నీదమ్మా

అందుకని...  అందుకని

నువు చేసినదంతా చెప్పాలి... 

నువు చేసినదంతా చెప్పాలి... నే చెప్పినట్లు నువు చేయాలి


ఏం... ఎందుకని... ఈ సిగ్గెందుకని

ఆలుమగల మధ్యనున్నది ఎవరికి తెలియదని



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7063

మాస్టారూ... డ్రిల్ మాస్టారూ




చిత్రం : తేనె మనసులు (1965)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం : పి. బి. శ్రీనివాస్, సుశీల 


పల్లవి :


ఒన్ టూ త్రీ ఫోర్...

ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్

మాస్టారూ... డ్రిల్ మాస్టారూ


ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ 

ఫోర్ త్రీ టూ ఒన్


మానేస్తారా... ఇక మానేస్తారా

ఉద్యోగం ఇస్తాము చేస్తారా 

ఒక ఉద్యోగం ఇస్తాము చేస్తారా


ఒన్ టూ త్రీ ఫోర్...

ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్

మాస్టారూ... డ్రిల్ మాస్టారూ

ఉద్యోగం ఇస్తాము చేస్తారా 

ఒక ఉద్యోగం ఇస్తాము చేస్తారా


మాస్టారూ... డ్రిల్ మాస్టారూ



చరణం 1 :


ఒళ్ళు వంచి పని చేయాలి... మెదడుకు పదును పెట్టాలి

ఒళ్ళు వంచి పని చేయాలి... మెదడుకు పదును పెట్టాలి


అమ్మయ్యే మెదడే... 

అది లేకున్నా పరవలేదు... మీకు తోడుడై నేనే ఉంటాను

అమ్మయ్యా ఉంటారా


మెలుకువగా పని చేశారంటే... మీరే దొరలైపోతారు  


ఒన్ టూ త్రీ ఫోర్...

ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్

మాస్టారూ... డ్రిల్ మాస్టారూ

ఉద్యోగం ఇస్తాము చేస్తారా 

ఒక ఉద్యోగం ఇస్తాము చేస్తారా


మాస్టారూ... డ్రిల్ మాస్టారూ



చరణం 2 :


మరి జీతం?

నెలకు ముప్పై రోజులు జీతం... రోజుకు రెండే పూటలు బత్తెం..

నెలకు ముప్పై రోజులు జీతం... రోజుకు రెండే పూటలు బత్తెం... చిత్తం


పూటపూటకు పని ఉంటుంది... నాలుగు రోజులు సెలవుంటుంది

సెలవుల్లో ఏం చేయాలి


మా కొలువుననే మీరుండాలి

మా కనుసన్నలలో మెలగాలి

దానికి జీతం...  నా జీవితం



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3525

Tuesday, February 2, 2021

పురుషుడు నేనై పుట్టాలి

 




చిత్రం :  తేనె మనసులు (1965)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం : సుశీల, ఘంటసాల, పి. బి. శ్రీనివాస్

 

పల్లవి :


పురుషుడు నేనై పుట్టాలి... ప్రకృతి నీవే రావాలి

ఇరువురి మనసులు కలవాలి...

ఆ కలయిక కళకళలాడాలి


పురుషుడు నేనై పుట్టాలి... ప్రకృతి నీవే రావాలి

ఇరువురి మనసులు కలవాలి...

ఆ కలయిక కళకళలాడాలి



పుడమే నేనై పుట్టాలి... ఒడిదుడుకులను ఓర్వాలి

పుడమే నేనై పుట్టాలి... ఒడిదుడుకులను ఓర్వాలి

కడలిని నదినీ కలపాలి... ఆ కలయిక కళకళలాడాలి


పుడమే నేనై పుట్టాలి... ఒడిదుడుకులను ఓర్వాలి

కడలిని నదినీ కలపాలి... ఆ కలయిక కళకళలాడాలి


చరణం 1 :


మెరమెరలాడే వయసు నేనై... మిసమిసలాడే సొగసు నీవై

మెరమెరలాడే వయసు నేనై... మిసమిసలాడే సొగసు నీవై

వెల్లువలాగా వెన్నెలలాగా... ముల్లోకాలను ముంచాలి

వెల్లువలాగా వెన్నెలలాగా... ముల్లోకాలను ముంచాలి


పుడమే నేనై పుట్టాలి... ఒడిదుడుకులను ఓర్వాలి

కడలిని నదినీ కలపాలి... ఆ కలయిక కళకళలాడాలి



చరణం 2 :



పైమెరుగులకే ఉరకలువేసే... పరువానికి పగ్గం వేసి

పైమెరుగులకే ఉరకలువేసే... పరువానికి పగ్గం వేసి

పగ్గం కట్టిన కన్నె మనసులో... లోతులు తెలిసి మసలాలి

పగ్గం కట్టిన కన్నె మనసులో... లోతులు తెలిసి మసలాలి


పురుషుడు నేనై పుట్టాలి... ప్రకృతి నీవే రావాలి

కడలిని నదినీ కలపాలి... ఆ కలయిక కళకళలాడాలి


దేవుడు నేనై పుట్టాలి... దేన్నో తాన్నో ప్రేమించి 

దేవుడు నేనై పుట్టాలి... దేన్నో తాన్నో ప్రేమించి

ఆడదాని మనసంటేనే... విషమని తెలిసి ఏడ్వాలి


దేవుడు నేనై పుట్టాలి... దేన్నో తాన్నో ప్రేమించి

ఆడదాని మనసంటేనే... విషమని తెలిసి ఏడ్వాలి


చరణం 3 :


గాజు వంటి హృదయం తనది... రాతి వంటి నాతికి తగిలి

గాజు వంటి హృదయం తనది... రాతి వంటి నాతికి తగిలి

ముక్కలు చెక్కలుగా పగిలి... నెత్తురు కన్నీరవ్వాలి

ముక్కలు చెక్కలుగా పగిలి... నెత్తురు కన్నీరవ్వాలి



దేవుడు నేనై పుట్టాలి... దేన్నో తాను  ప్రేమించి

ఆడదాని మనసంటేనే... విషమని తెలిసి ఏడ్వాలి

విషమని తెలిసి ఏడ్వాలి



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7064

Tuesday, August 25, 2020

ఎగరేసిన గాలిపటాలు

చిత్రం :  స్నేహం (1977)
సంగీతం :   కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపథ్య గానం :  పి. బి. శ్రీనివాస్   



పల్లవి :


ఎగరేసిన గాలిపటాలు
దొంగాట దాగుడుమూతలూ
గట్టు మీద పిచ్చుక గూళ్ళు
కాలువలో కాగితం పడవలూ


గోళీలు గోటీబిళ్ళ... ఓడిపోతే పెట్టిన డిల్ల
చిన్ననాటి ఆనవాళ్ళు... స్నేహంలో మైలురాళ్ళు



చరణం 1 :


పడగొట్టిన మావిడికాయ... పొట్లంలో ఉప్పూకారం
తీర్ధంలో కొన్న బూర... కాయ్ రాజా కయ్
కాయ్ రాజా కయ్... కాయ్ రాజా కయ్
కాయ్ రాజా కయ్... కాయ్ రాజా కయ్... కాయ్ రాజా కయ్



చరణం 2 :



దసరాలో పువ్వుల బాణం... దీపావళి బాణా సంచా
చిన్నప్పటి ఆనందాలు... చిగురించిన మందారాలు


నులివెచ్చని భోగిమంటా... మోగించిన గుడిలో గంటా
వడపప్పు పానకాలు... పంచుకున్న కొబ్బరి ముక్క


గొడమీద రాసిన రాతలు...వీడిపోవు వేసిన బొమ్మలు
చెరిగిపోని జ్ఞాపకాలు... చిత్త స్వాతి వానజల్లు


చిన్ననాటి ఆనవాళ్ళు... స్నేహంలో మైలిరాళ్ళు
చిన్నప్పటి ఆనందాలు... చిగురించిన మందారాలు




Wednesday, June 24, 2020

నీకోసమని నే వేచినానే

చిత్రం :  మంచి రోజు (1970)
సంగీతం :  ఎం.బి.శ్రీరాం
గీతరచయిత : దాశరథి
నేపథ్య గానం :  పి. బి. శ్రీనివాస్ 



పల్లవి :


నీకోసమని నే వేచినానే
ఉరింపులు ఇక చాలునే
ఈ బిగువేలనే నా మాటవిని
మోముగని పులకించని... నీ మోముగని పులకించని



నీకోసమని నే వేచినానే
ఉరింపులు ఇక చాలునే   


               

చరణం 1 :


నీ కనుపాపలలో నా రూపం
ఈ  కోపము మాని నను చూడని
నీ నవ్వులు కురిసే వెన్నెలలో
మధుపానము చేసి ననుపాడని


నీకోసమని నే వేచినానే
ఉరింపులు ఇక చాలునే  

                     

చరణం 2 :


అనురాగసుమాలే వెదజల్లి
నీ బ్రతుకుబాటలో పయనించని
మన మనసులు రెండు ముడివేసి
బిగికౌగిలి గదిలో శయనించని 


నీకోసమని నే వేచినానే
ఉరింపులు ఇక చాలునే
ఈ బిగువేలనే నా మాటవిని
మోముగని పులకించని... నీ మోముగని పులకించని




https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4672

Wednesday, August 8, 2018

ఓహో గులాబి బాలా

చిత్రం:  మంచిమనిషి (1964)
సంగీతం:  ఎస్. రాజేశ్వరరావు/టి. చలపతిరావు
గీతరచయిత:  దాశరథి 
నేపథ్య గానం:  పి. బి. శ్రీనివాస్ 


పల్లవి :


ఓ గులాబీ... ఓ గులాబీ
వలపు తోటలో విరిసిన దానా..
లేత నవ్వులా  వెన్నెల సోనా..


ఓహో గులాబి బాలా... అందాల ప్రేమ మాలా 
సొగసైన కనులదానా... సొంపైన మనసుదానా 
నీ వారెవరో తెలుసుకో... తెలుసుకో..తెలుసుకో 


ఓహో గులాబి బాలా... అందాల ప్రేమ మాలా 



చరణం 1 :


కొంటె తుమ్మెదలవలెచెవూ... తుంటితేనెలందించెవూ..
కొంటె తుమ్మెదలవలెచెవూ... తుంటితేనెలందించెవూ..
మోసం చేసీ మీసం దువ్వే మోసకారులకు లోంగేవూ... లోంగేవూ..



ఓహో గులాబి బాలా... అందాల ప్రేమ మాలా..



చరణం 2 :



రూపం చూసీ వస్తారు... చూపులగాలం వేస్తారు
రూపం చూసీ వస్తారు... చూపులగాలం వేస్తారు
రేకులుచిదిమీ... సొగసులు నునిమీ..
చివరకు ద్రోహం చేస్తారు... చివరకు ద్రోహం చేస్తారు


ఓహో గులాబి బాలా... అందాల ప్రేమ మాలా 
సొగసైన కనులదానా... సొంపైన మనసుదానా 
నీ వారెవరో తెలుసుకో... తెలుసుకో..తెలుసుకో 
ఓహో గులాబి బాలా... అందాల ప్రేమ మాలా 







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=140

Monday, July 9, 2018

నీవే నీవే కావలసినది

చిత్రం : ఇంటికి దీపం ఇల్లాలే (1961)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : పి. బి. శ్రీనివాస్, సుశీల 



పల్లవి :



ఓహో ఓహో ఓహో ఓఓఓ ఓహో
ఓహో ఓహో ఓహో ఓఓఓ ఓహో


నీవే... నీవే
నిన్నే... నిన్నే
నీవే నీవే... కావలసినది
నిన్నే నిన్నే... నే వలచినది


నీవే... నీవే
నిన్నే... నిన్నే
నీవే నీవే... కావలసినది
నిన్నే నిన్నే... నే వలచినది



చరణం 1 :



నీ వలపు నీడలో నా తలపె ఆగెనే
నీ ఎదట నా హృదయం మూగపోయి నిలిచెనే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ వలపు నీడలో నా తలపె ఆగెనే
నీ ఎదట నా హృదయం మూగపోయి నిలిచెనే
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 

వేచి వేచి వేదనలో వేడాయే వెన్నెలే
వేచి వేచి వేదనలో వేడాయే వెన్నెలే
చూసి చూసి సోయగాలు...  సోలిపోయే కన్నులే
సోలిపోయే కన్నులే 


ఓఓ... ఓఓఓఓ..
నీవే నీవే ... నిన్నే నిన్నే
నీవే నీవే ... కావలసినది
నిన్నే నిన్నే... ... నే వలచినది..
ఆ హా హా... ఓ హో హో ఆ హా అహా 



చరణం 2 :



నీ కోసమే జీవనం... నీ రూపమె భావనం
నీవు లేని నిముషాన ఈ జగమే కాననం
ఆ ... ఆ... ఆ...  ఆ
నీ కోసమే జీవనం... నీ రూపమె భావనం
నీవు లేని నిముషాన  ఈ జగమే కాననం
ఓ...  ఓ...  ఓ... ఓ ... 


నీ కనులా జాడలో... నా కలలు పండెనే
నీ కనులా జాడలో... నా కలలు పండెనే
నీవు లేక నేనిక... తావిలేని పూవులే
తావిలేని పూవులే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 


నీవే... నీవే
నిన్నే... నిన్నే
నీవే నీవే... కావలసినది
నిన్నే నిన్నే... నే వలచినది





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=627

Wednesday, June 6, 2018

పగటి పూట చంద్రబింబం

చిత్రం : చిక్కడు-దొరకడు (1967)
సంగీతం : టి. వి. రాజు
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : ఘంటసాల, సుశీల, పి. బి. శ్రీనివాస్




సాకి : 



విరిసిన ఇంద్రచాపమో... భువిన్ ప్రభవించిన చంద్రబింబమో..
మరు పువుబంతియో... రతియో... మల్లెలదొంతియో... మోహకాంతియో
సరస కవీంద్రకల్పిత రసాకృతియో... నవరాగ గీతియో...
వరసరసీరుహానన బిరాన వరించి తరింప జేయవే 


పల్లవి :



పగటి పూట చంద్రబింబం అగుపించెను...  ఏదీ ఏదీ
అందమైన నీ మోమే అదిగాకింకేది?


కానరాని మన్మథుడేమో కనుపించెను... ఏడీ ఏడీ
ఎదుటవున్న నీవేలే ఇంకా ఎవరోయీ 



చరణం 1 :


వన్నె వన్నె తారలెన్నో కన్నుగీటి రమ్మన్నాయీ
వన్నె వన్నె తారలెన్నో కన్నుగీటి రమ్మన్నాయీ.. ఏవీ ఏవీ
అవి నీ సిగలోనే ఉన్నాయి


పదును పదును బాణాలేవో ఎదను నాటుకుంటున్నాయీ
పదును పదును బాణాలేవో ఎదను నాటుకుంటున్నాయీ...  ఏవీ ఏవీ
అవి నీ ఓరచూపులేనోయీ


పగటి పూట చంద్రబింబం అగుపించెను...  ఏదీ ఏదీ
అందమైన నీ మోమే అదిగాకింకేది?



చరణం 2 :


ఇంత చిన్న కనుపాపలలో ఎలా నీవు దాగున్నావు
ఇంత చిన్న కనుపాపలలో ఎలా నీవు దాగున్నావు



ఇంత లేత వయసున నీవు ఎంత హొయలు కురిపించేవు
ఇంత లేత వయసున నీవు ఎంత హొయలు కురిపించేవు
ఏమో..  ఏమో...  ఇరువురి మనసులు ఒకటైతే ఇంతే.. ఇంతేనేమో 



అహహ.. ఆహహహా.. ఓహోహో..ఓ..ఓహొ..ఓహో...





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=698

Saturday, February 10, 2018

కనులు పలకరించెను

చిత్రం :  ఆడబ్రతుకు (1965)
సంగీతం :  విశ్వనాథన్ రామమూర్తి
గీతరచయిత :  సినారె 
నేపధ్య గానం :  పి. బి. శ్రీనివాస్ 


పల్లవి :


కనులు పలకరించెను...పెదవులు పులకించెను
బుగ్గలపై లేత లేత... సిగ్గులు చిగురించెను
కనులు పలకరించెను...పెదవులు పులకించెను




చరణం 1 :



నిన్ను నేను చూసే వేళా... నన్ను నీవు చూడవేలా
నిన్ను నేను చూసే వేళా... నన్ను నీవు చూడవేలా
నేను పైకి చూడగానే... నీవు నన్ను చూతువేలా
తెలిసిపోయె నీలో ఏదో వలపు తొంగి చూసెను  


కనులు పలకరించెను... పెదవులు పులకించెను
బుగ్గలపై లేత లేత... సిగ్గులు చిగురించెను



చరణం 2 :



మొలక నవ్వు దాచుకోకు... జిలుగుపైట జారనీకు
మొలక నవ్వు దాచుకోకు... జిలుగుపైట జారనీకు
కురులు చాటు చేసుకోకు... తెరలు లేవు నీకు నాకు
తెలిసిపోయే నీలో ఏదో... వలపు తొంగి చూచెను 


కనులు పలకరించెను...పెదవులు పులకించెను
బుగ్గలపై లేతలేత... సిగ్గులు చిగురించెను 



చరణం 3 :



అందమైన ఈ జలపాతం... ఆలపించె తీయని గీతం
ఓహో హో..ఓహో హో..ఓహో హో..ఓ ఓ ఓ ..
అందమైన ఈ జలపాతం... ఆలపించె తీయని గీతం


కనిపించని నీ హృదయంలో... వినిపించెను నా సంగీతం
తెలిసిపోయె నీలో ఏదో... వలపు తొంగి చూచెను   


కనులు పలకరించెను... పెదవులు పులకించెను
బుగ్గలపై లేత లేత... సిగ్గులు చిగురించెను






Friday, February 9, 2018

తనువుకెన్ని గాయాలైనా

చిత్రం :  ఆడబ్రతుకు (1965)
సంగీతం :  విశ్వనాథన్ రామమూర్తి
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం :  పి. బి. శ్రీనివాస్ 



పల్లవి :


తనువుకెన్ని గాయాలైనా... మాసిపోవునెలాగైనా
మనసుకొక్క గాయమైన... మాసిపోదు చితిలోనైనా


తనువుకెన్ని గాయాలైనా... మాసిపోవునెలాగైనా
మనసుకొక్క గాయమైన... మాసిపోదు చితిలోనైనా




చరణం 1 :



ఆడవాళ్లు ఆడుకునే ఆటబొమ్మ... ఈ మగవాడు
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ
ఆడవాళ్లు ఆడుకునే ఆటబొమ్మ... ఈ మగవాడు


ఆడుకున్న ఫరవాలేదు... పగులగొట్టి పోతారెందుకో
పగులగొట్టి పోతారెందుకో...



తనువుకెన్ని గాయాలైనా... మాసిపోవునెలాగైనా
మనసుకొక్క గాయమైన... మాసిపోదు చితిలోనైనా 



చరణం 2 :



మగువలను పుట్టించావే...... మా సుఖమునకే అన్నావే
అందుకు ధర తెమ్మన్నావే... బ్రతుకే బలి ఇమ్మన్నావే
బ్రతుకే బలి ఇమ్మన్నావే...



తనువుకెన్ని గాయాలైనా... మాసిపోవునెలాగైనా
మనసుకొక్క గాయమైన... మాసిపోదు చితిలోనైనా





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=83

బుజ్జి బుజ్జి పాపాయీ

చిత్రం :  ఆడబ్రతుకు (1965)
సంగీతం :  విశ్వనాథన్ రామమూర్తి
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  పి. బి. శ్రీనివాస్    




పల్లవి :


బుజ్జి బుజ్జి పాపాయీ... బుల్లి బుల్లి పాపాయీ
బుజ్జి బుజ్జి పాపాయీ... బుల్లి బుల్లి పాపాయీ
నీ బోసి నవ్వులలో... పూచే పున్నమి వెన్నెలలోయీ

బుజ్జి బుజ్జి పాపాయీ... బుల్లి బుల్లి పాపాయీ
బుజ్జి బుజ్జి పాపాయీ... బుల్లి బుల్లి పాపాయీ


చరణం 1 :



పాలుగారు ప్రాయంలో నీలాగే ఉన్నాను
బంగారు ఊయలలో పవళించి ఊగేను
ఆనాటి అచ్చటలే... ఈనాటి ముచ్చటలై
మనసే మురిసెనురా మమతే పెరిగెనురా


నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోయీ
బుజ్జి బుజ్జి పాపాయీ... బుల్లి బుల్లి పాపాయీ 



చరణం 2 :



ఒక హృదయం పొంగితే ఉరికేది కవితరా
ఇరు హృదయాలొకటైతే పాడేది లాలిరా
ఒక హృదయం పొంగితే ఉరికేది కవితరా
ఇరు హృదయాలొకటైతే పాడేది లాలిరా


ఏ తల్లి కన్నదో... ఏ బంధమున్నదో...
మనసే మురిసెనురా... మమతే పెరిగెనురా


నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోయీ
బుజ్జి బుజ్జి పాపాయీ... బుల్లి బుల్లి పాపాయీ


చరణం 3 :



పూవంటి మనసులో ముల్లున్న జగతిరా
మోసాలు ద్వేషాలు ముసిరే బ్రతుకురా


పూవంటి మనసులో ముల్లున్న జగతిరా
మోసాలు ద్వేషాలు ముసిరే బ్రతుకురా


నమ్ముకున్న నావారు నాకిదే నేర్పారు
నమ్ముకున్న నావారు నాకిదే నేర్పారు
పాపాయిగా ఉంటే బాధలే ఉండవురా


నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోయీ
బుజ్జి బుజ్జి పాపాయీ... బుల్లి బుల్లి పాపాయీ






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=18304

Tuesday, January 30, 2018

ఏవేవో చిలిపి తలపులు

చిత్రం :  సుమంగళి (1965)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  పి. బి. శ్రీనివాస్, జానకి 




పల్లవి :



ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి
అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది
ఏవేవో..



ఏవేవో వలపు తలపులురుకుతున్నవి
అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది
ఏవేవో..



చరణం 1 :



కురులలోన మల్లెపూలు కులుకుచున్నవి
అరవిరిసిన పడుచుతనం పిలుచుచున్నది
కురులలోన మల్లెపూలు కులుకుచున్నవి
అరవిరిసిన పడుచుతనం పిలుచుచున్నది

మరపురాని తొలిరేయి మరల రానిది
మరపురాని తొలిరేయి మరల రానిది
మగువ జీవితాన ఇదే మధురమన్నది


ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి
అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది
ఏవేవో....



చరణం 2 :



ఒక్క క్షణం

మ్మ్ మ్మ్ మ్మ్

ఒక్కక్షణం జారిపోతే దక్కనన్నది
కాలానికి బిగి కౌగిలి కళ్ళెమన్నది
ఒక్కక్షణం జారిపోతే దక్కనన్నది
కాలానికి బిగి కౌగిలి కళ్ళెమన్నది

కన్నె మనసు ఏవేవో కలలు కన్నది
కన్నె మనసు ఏవేవో కలలు కన్నది
ఆ కలల రూపు ఈ రేయే కాంచమన్నది
మ్మ్ మ్మ్హు..
ఆహా!


ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి
అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది
ఏవేవో... 


చరణం 3 :



తీయనైన తలపు లేవో ముసురుకొన్నవి
తీసియున్న తలపులను మూయమన్నది
తీయనైన తలపు లేవో ముసురుకొన్నవి
తీసియున్న తలపులను మూయమన్నది

మనసు తోటి తనువు కూడ నీది కానున్నది
మనసు తోటి తనువు కూడ నీది కానున్నది
మనుగడ ఈ నాటితో మనది కానున్నది 


ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి
అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది 

ఏవేవో వలపు తలపులురుకుతున్నవి
అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది
ఏవేవో..







Thursday, January 4, 2018

అందాలే తొంగి చూసే

చిత్రం : ప్రేమించి చూడు (1965)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం :  పి. బి. శ్రీనివాస్, సుశీల  



పల్లవి : 



ఆ.. ఆ.. హ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. 


అందాలే తొంగి చూసే... హ.. హా. హా..
ఆనందం ఈల వేసే... రా రా రా
సొగసు విరిసే.. వయసు మెరిసే.. ఎగిసిపోద్దామా


అందాలే తొంగి చూసే... హ.. హా. హా..
ఆనందం ఈల వేసే... రా రా రా
సొగసు విరిసే.. వయసు మెరిసే.. ఎగిసిపోద్దామా



చరణం 1 :


నా చెంత సిగ్గులెందుకో... నీ చేత నన్నే అందుకో
లోలోని పొంగు చూసుకో... నీలోనే నన్ను దాచుకో
కన్నులు నీవే.. కలలు నావే... కాదేమో సరి చూసుకో...హొయ్.. హొయ్.. హొయ్


ఆ.. ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ.. 



అందాలే తొంగి చూసే... హ.. హా. హా..
ఆనందం ఈల వేసే... రా రా రా
సొగసు విరిసే.. వయసు మెరిసే.. ఎగిసిపోద్దామా


ఆ.. ఆ.. ఆ.. హ.. హ.. ఆ.. ఆ
ల.. ల.. లా. లాలలలాలలా...




చరణం 2 :



గుండెల్లో చూపు దించకు... కళ్ళల్లో కైపు పెంచకు
నన్నింక కవ్వించకు... నాజూకు తీగ వంచకు
మత్తుగ నవ్వి.. మెత్తగ దువ్వి...
మనసు ఉడికించకు... ఊ.. ఊ.. హాయ్



ఆ.. ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ.. 



అందాలే తొంగి చూసే... హ.. హా. హా..
ఆనందం ఈల వేసే... రా రా రా
సొగసు విరిసే.. వయసు మెరిసే.. ఎగిసిపోద్దామా


ఆ.. ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఆ.. ఆ.. ఆ.. హ.. హ.. ఆ.. ఆ


అందాలే తొంగి చూసే... హ.. హా. హా..
ఆనందం ఈల వేసే... రా రా రా
సొగసు విరిసే.. వయసు మెరిసే.. ఎగిసిపోద్దామా 







Wednesday, January 3, 2018

మీ అందాల చేతులు

చిత్రం : ప్రేమించి చూడు (1965)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం :  పి. బి. శ్రీనివాస్  




పల్లవి :

మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద
మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద
సాయమువలదా..హోయ్... ఓ చేయ్ వేసేదా..ఆ..ఆ..ఆ.



చరణం 1 :



చిన్నారి మేను సన్నాని నడుము అల్లాడిపోవాలా..హోయ్..
ఉయ్యాలలూచే వయ్యారి చేతులు మోటారుతోలాలా
చిన్నారి మేను సన్నాని నడుము అల్లాడిపోవాలా..హోయ్..
ఉయ్యాలలూచే వయ్యారి చేతులు మోటారుతోలాలా


వింతైన సొంపు వన్నెలు తరిగి వాడిపోవాలా
ఇటు అప్టుడేటుగా టిప్పుటాపుగా అలసిపోవాలా..హోయ్
ఓ హో..హో..


మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద
సాయమువలదా..హోయ్..ఓ చేయ్ వేసేదా



చరణం 2 :




కాలేజి చదువుల తేలేవు గాని కాసింత తగ్గాలి..హోయ్..
వేలాది వేల రూపాయలున్నా వినయము చూపాలీ
కాలేజి చదువుల తేలేవు గాని కాసింత తగ్గాలి..హోయ్..
వేలాది వేల రూపాయలున్నా వినయము చూపాలీ
మగవాని తోడు వలదన్న వనిత మహిలోన కనరాదు
ఈ కోపమెందుకూ తాపమెందుకూ... తగునా ఇదినీకూ..హోయ్
ఓ..హో..హో..


మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద
సాయమువలదా..హోయ్..ఓ చేయ్ వేసేదా




చరణం 3  :



కడగంటి చూపు కబురంపగానే శుభలేఖ పంపేను..హోయ్..
విడిదింటినుండి ఊరేగి నిన్నే పెళ్ళడవస్తాను
కడగంటి చూపు కబురంపగానే శుభలేఖ పంపేను..హోయ్..
విడిదింటినుండి ఊరేగి నిన్నే పెళ్ళడవస్తాను


మనసైనవాణ్ణి...  మామా అనగానే పోంగేను
ఈ మనసైనవాణ్ణి.. మామా అనగానే పోంగేను
ఇక వలపుదారిలో కలికి సేవలో కాలం గడిపేనూ..హోయ్..
ఓ..హో..హో..


మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద
సాయమువలదా..హోయ్..ఓ చేయ్ వేసేదా


Tuesday, October 31, 2017

ముద్దు ముద్దు నవ్వు

చిత్రం :  సత్తెకాలపు సత్తయ్య (1969)
సంగీతం :  ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : ఆత్రేయ
నేపధ్య గానం : పి. బి. శ్రీనివాస్, ఎల్. ఆర్. ఈశ్వరి




పల్లవి :


ఓలలలాయి ఒలలలాయి ఒలలలలాయి... 


 ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వూ
జాజిమల్లె పువ్వు బజ్జోమ్మ నువ్వూ


ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వూ
జాజిమల్లె పువ్వు బజ్జోమ్మ నువ్వూ




చరణం 1 : 



 ఏ ఇంటి పంటవో...  ఏ తల్లి నోమువో
ఏ ఇంటి పంటవో... ఏ తల్లి నోమువో
ఈ ఒంటి వానికీ... నా వంటి పేదకూ


ఏ ఇంటి పంటవో... ఏ తల్లి నోమువో
ఈ ఒంటి వానికీ... నా వంటి పేదకూ


ప్రాణాలు పోసావు... బతకాలి అన్నావు
ఉరితాడు జోజోల ఉయ్యాల చేసావు
ఉయ్యాల చేసావు..


ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వూ
జాజిమల్లె పువ్వు బజ్జోమ్మ నువ్వూ
బజ్జోమ్మ నువ్వూ





చరణం 2 :



 నా బాధ విన్నావు... నీ గాధ చెప్పావు
ఈ పూరి గుడిసెలో... నా బీడు మనసులో... 


నా బాధ విన్నావు... నీ గాధ చెప్పావు
ఈ పూరి గుడిసెలో... నా బీడు మనసులో... 


చిన్నారి పొన్నారి... చిగురల్లె వెలిసావు
సిరిలేదు గిరిలేదు... మనసుంటే అన్నావు..
మనసుంటే అన్నావు..


ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వూ
జాజిమల్లె పువ్వు బజ్జోమ్మ నువ్వూ
బజ్జోమ్మ నువ్వూ


ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వూ
జాజిమల్లె పువ్వు బజ్జోమ్మ నువ్వూ
బజ్జోమ్మ నువ్వూ... బజ్జోమ్మ నువ్వూ
బజ్జోమ్మ నువ్వూ... బజ్జోమ్మ నువ్వూ





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=6505

Sunday, December 4, 2016

మధురం మధురం నాదం

చిత్రం : కోకిలమ్మ (1983)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, పి. బి. శ్రీనివాస్ 




పల్లవి :



మధురం మధురం నాదం...  అది అమరం అమరం వేదం
నాదం గానం సామం...  స్వర కలితం లలితం రమ్యం 


మధురం మధురం నాదం...  అది అమరం అమరం వేదం
నాదం గానం సామం...  స్వర కలితం లలితం రమ్యం 


శ్రీవాణీ వీణా జనితం.. సురమౌని మహతీ సరితం.. అతిలోక బ్రహ్మానందం ఓంకారనాదం
శ్రీవాణీ వీణా జనితం.. సురమౌని మహతీ సరితం.. అతిలోక బ్రహ్మానందం ఓంకారనాదం


అమితం అమృతం నిరతం...  శిశు పశు ఫణి సహితం విదితం
చౌకం మధ్యమ దురితం...  త్రైకాల సంచారం 


ఆ.. ఆ.. ఆ... ఆ.. 
ఆ.. ఆ.. ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ... ఆ.. 


శ్రీవాణీ వీణా జనితం.. సురమౌని మహతీ సరితం అతిలోక బ్రహ్మానందం ఓంకారనాదం 



చరణం 1 :




మామూలు వెదురే మాధవ మురళియై రాగాల సుధలే చిలికినది
మామూలు వెదురే మాధవ మురళియై రాగాల సుధలే చిలికినది


త్యాగయ్య గళమై అన్నయ్య పదమై వాగ్గేయ సిరులే కురిసినవి
గీతం కవితా హృదయం...   సంగీతం జనతా హృదయం
రాగం తానం మకుటం...  త్రైమూర్తి రూపం 




చరణం 2 :



జయదేవ కవితై గోవింద గీతై పద్మావతేగా పలికినది
జయదేవ కవితై గోవింద గీతై పద్మావతేగా పలికినది


ప్రియురాలి శోకమే తొలి కావ్య శ్లోకమై శ్రీరామచరితై నిలిచినది 


తీరని దాహం గానం...  కడతీర్చే  జ్ఞానం గానం
రాగం భోగం మోక్షం...  సంగీతయోగం 


శ్రీవాణీ వీణా జనితం సురమౌని మహతీ సరితం అతిలోక బ్రహ్మానందం ఓంకారనాదం 


ఆ.. ఆ.. ఆ... ఆ..ఆ.. ఆ.. ఆ... ఆ..
ఆ.. ఆ.. ఆ... ఆ..





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7625



POSTED BY : Satyabhama Pappu



Thursday, September 3, 2015

ఈ దారి నా స్వామి నడిచేనే

చిత్రం :  చెల్లెలి కాపురం (1971)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  దేవులపల్లి
నేపధ్య గానం :  జానకి, పి. బి. శ్రీనివాస్



పల్లవి :


ఈ దారి నా స్వామి నడిచేనే... పాదాల జాడలివిగోనే
రానే వచ్చాడు.. తీరా తానే వచ్చాడూ..
కృష్ణుడు.. రానే వచ్చాడు.. తీరా తానే వచ్చాడూ..
లేవండీ పొదరింటా..  లేవండీ పొదరింటా.. లెండే పొగడా గోరింటా
రానే వచ్చాడు.. తీరా తానే వచ్చాడూ..  


ఎవరే . . ఎవరే . . ఎవరే . .
మువ్వల మురళిని నవ్వే పెదవుల ముద్దాడే వాడే నన్నేలువాడు
కన్నుల చల్లని వెన్నెల జల్లుల విరజిమ్మే వాడే.. నన్నేలువాడు
ఓహొ..  ఓహొ.. ఓహొ


ఈ నల్లని రూపం చూచీ.. ఈ పిల్ల సోయగము వలచీ
ఈ నల్లని రూపం చూచీ.. ఈ పిల్ల సోయగము వలచీ
రేపల్లె విడిచి రేయల్ల నడచి మన పల్లెకు దయచేసాడటే


లేవండీ పొదరింటా.. లెండే పొగడా గోరింటా
రానే వచ్చాడు.. తీరా తానే వచ్చాడూ.. కృష్ణుడు
రానే వచ్చాడు..  తీరా తానే వచ్చాడూ.. 




చరణం 1 :


అటు అడుగిడితే నా తోడూ . . ఇటు చూడూ
అటు అడుగిడితే నా తోడూ.. ఇటు చూడూ
ఇట నిలిచినాడు నీ కోసం.. లీలా ప్రియుడూ.. ఇటు చూడూ


వలచి వలచి వచ్చినదెవరో.. పిలిచి పిలిచి అలసిన ఈ పిల్లగ్రోవినడుగు
వలచి వలచి వచ్చినదెవరో..  పిలిచి పిలిచి అలసిన ఈ పిల్లగ్రోవినడుగు
పిల్లగ్రోవినడుగూ... ఇటు చూడూ



చరణం 2 :


కృష్ణా.. ఏల స్వామీ దయమాలీ.. ఈ దీనురాలిని ఎగతాలీ
ఏల స్వామీ దయమాలీ.. నీ కళ్ళ ఎదుటా నిలువలేనీ.. పాదధూళిని పొందలేనీ
నీడకైనా నోచుకోనీ..  రేయి కనులా నల్లనైన దీనురాలిని ఎగతాలీ


కనులకు తోచేది కాదు సోయగమూ.. మనసులో పూచేటీ మధురిమగానీ
నీ చెలులు చూసేదీ నీ బాహ్యమూర్తీ.. నేను వలచేదీ నా నీలలోదీప్తి 




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2062

Wednesday, September 3, 2014

అందాల ఓ చిలకా

చిత్రం :  లేత మనసులు (1966)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం : పి. బి. శ్రీనివాస్, సుశీల 



పల్లవి :



అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా


అందాల చెలికాడా అందుకో నా లేఖ
నా కనులతో రాసాను ఈ మదిలోన దాచాను 


చరణం 1 :


మిసమిసలాడే వెందుకని తళతళలాడే వేమిటని
మిసమిసలాడే వెందుకని తళతళలాడే వేమిటని
కురుల మోముపై వాలెనేలనో
విరులు కురులలో నవ్వెనెందుకో
అడుగుతడబడే చిలకకేలనో
పెదవి వణికెను చెలియకెందుకో


అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా



చరణం 2 :


మిసమిసలాడే వయసోయి తళతళలాడే కనులోయి
మిసమిసలాడే వయసోయి తళతళలాడే కనులోయి
కురుల మోముపై మరులు గొనెనులే
విరులు కురులలో సిరులు నింపెలే
అడుగుతడబడి సిగ్గు బరువుతో
పెదవి వణికెలే వలపు పిలుపుతో


అందాల చెలికాడా అందుకో నా లేఖ
నా కనులతో రాసాను ఈ మదిలోన దాచాను


అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా



చరణం 3 :


నీవే పాఠం నేర్పితివి నీవే మార్గం చూపితివి
ప్రణయ పాఠము వయసు నేర్పులే
మధుర మార్గము మనసు చూపులే


నీవు పాడగా నేను ఆడగా
యుగము క్షణముగా గడచిపోవుగా


అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా


Sunday, May 11, 2014

నీలి మేఘ మాలవో

చిత్రం :  మదన కామరాజు కథ (1962)
సంగీతం : రాజన్-నాగేంద్ర
గీతరచయిత :  జి. కృష్ణమూర్తి
నేపధ్య గానం :  పి. బి. శ్రీనివాస్, సుశీల



పల్లవి:


నీలి మేఘ మాలవో... నీలాల తారవో
నీ సోయగాలతో...మదినీ దోచిపోదువో..ఓ ఓ ఓ..


నీలి మేఘ మాలనో...నీలాల తారనో
నా సోయగాలతో...మదినీ ఈ ఈ దోచిపోతినో..ఓ ఓ ఓ..


నీలి మేఘ మాలనో...


చరణం 1:


నీ రాక కోసమే చెలి... నే వేచియుంటినే...
ఆరాటమేలనో ప్రియా... నే చెంత నుంటినే...
ఆనంద మధుర గీతములా.. ఆలపింతమా ఆ ఆ ఆ ...


నీలి మేఘ మాలనో....


చరణం 2:


చివురించు వలపు తీవెల... విరి పూలు పూయగా...
చిరునవ్వు విరుపు లోపల... హరివిల్లు విరియదా...
నెలవంక నావలోన మనము కలసిపోదమా ఆ ఆ ఆ ...


నీలి మేఘ మాలవో...


చరణం 3:


మనలోని కలత మాయమై... మన ఆశ తీరెగా...
అనురాగ రాగమే ఇక...మన రాగమాయెగా....
మనసార ప్రేమ మాధురుల సాగి పోదమా ఆ ఆ ఆ ...


నీలి మేఘ మాలనో... నీలాల తారనో...
నీ సోయగాలతో... మదినీ దోచి పోదువో...