Sunday, January 1, 2017

మల్లెమొగ్గ తెలుపు


చిత్రం : ఇంటిగౌరవం (1970)
సంగీతం :  కోదండపాణి
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :రాణి..
చింతపువ్వు ఎరుపు.. చిలకముక్కు ఎరుపు
చింతపువ్వు ఎరుపు.. చిలకముక్కు ఎరుపు
చేయి చేయి కలుపు.. లేత వలపు తెలుపు..
రాణి.. ఈ.. ఈ.. ఈ.. రాణిమల్లెమొగ్గ తెలుపు.. మంచి మనసు తెలుపు
మల్లెమొగ్గ తెలుపు.. మంచి మనసు తెలుపు
చేయి చేయి కలుపు.. నిండు వలపు నిలుపు
రాజా.. ఓ.. రాజా...చరణం 1 :


అబ్బ.. ఊరించు పెదవులు ఎరుపు.. అవి నాలోన ఆశలు రేపు

అబ్బ.. ఊరించు పెదవులు ఎరుపు.. అవి నాలోన ఆశలు రేపు

ఆగాలి పెళ్ళైన వరకు.. ఆపైన తమదే గెలుపు

వలచే వేళా.. తొలగేవేలా?

వలచే వేళా.. తొలగేవేలా?

ఈ ఎడమోము.. పెడమోము రుచి చూడు పులుపు మల్లెమొగ్గ తెలుపు.. మంచి మనసు తెలుపు
చేయి చేయి కలుపు.. లేత వలపు తెలుపు..
రాణి.. ఈ.. ఈ.. ఈ.. రాణిచరణం 2 :


అబ్బ...  నీ చేయి చిదిమిన చోట... అయ్యో నా బుగ్గ కందేను చూడు
అబ్బ...  నీ చేయి చిదిమిన చోట... అయ్యో నా బుగ్గ కందేను చూడు


నీ నవ్వు వెలిగిన తూటా .. నా మేను పొంగేను చూడు


నీలో నాలో... ఒకటే ఆశా...

నీలో నాలో... ఒకటే ఆశా...


అది పండేను మురిపాలు నిండెను రేపుమల్లెమొగ్గ తెలుపు.. మంచి మనసు తెలుపు
మల్లెమొగ్గ తెలుపు.. మంచి మనసు తెలుపు
చేయి చేయి కలుపు.. లేత వలపు తెలుపు..
రాణి.. ఈ.. ఈ.. ఈ.. రాణి

No comments:

Post a Comment