Thursday, February 9, 2017

మనదే మనదేలే ఈ రోజు







చిత్రం :  మైనరు బాబు (1973)
సంగీతం :  టి చలపతిరావు
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు, సుశీల   



పల్లవి : 


మనదే మనదేలే ఈ రోజు
మన కందరికీ పండగలే ఈ రోజు
మనదే మనదేలే ఈ రోజూ
మన కందరికీ పండగలే ఈ రోజు


ఆశలు పండీ ఆకలి తీరి
బ్రతుకులు మారే పండుగరోజు
   
మనదే మనదేలే ఈ రోజు
మన కందరికీ పండుగలే ఈ రోజు



చరణం 1 :


గొప్ప గొప్పవాళ్ళకెదురు నిల్చినరోజు
వాళ్ళ గొప్పతనం గంగలోన కలిపిన రోజు
గొప్ప గొప్పవాళ్ళకెదురు నిల్చినరోజు
వాళ్ళ గొప్పతనం గంగలోన కలిపిన రోజు 


జబ్బ చరిచిన రోజు... రొమ్ము విరిచిన రోజు
మనం గెలిచిన రోజు  


మనదే మనదేలే ఈ రోజు
మన కందరికీ పండగలే ఈ రోజు


చరణం 2 :


కూలి.. యజమాని.. తేడాలె వుండవు
ఈ కులాల ఈ మతాల గొడవలుండవు
అందరిదొకటే మాట...  అందరిదొకటే బాట
అందరిదొకటే మాట.... అందరిదొకటే బాట
ఇకపై చూడు బరాటా...
ఆ..లలలా..ఆఆఆ.. లలలా..ఆఆఆ..లలలలా..ఆఆఆ  





చరణం 3 :



పనిచేస్తే అన్నానికి లోటు ఉండదు
సోమరిపోతులకు నిలువ నీడ ఉండదు
పనిచేస్తే అన్నానికి లోటు ఉండదు
సోమరిపోతులకు నిలువ నీడ ఉండదు

ఇది సామ్యవాదయుగం... ఇటే నడుస్తుంది జగం
ఇక ఆగదులే ఆగదులే.... జగన్నాధ రథం..



హోయ్...మనదే మనదేలే ఈ రోజూ

మన కందరికీ పండగలే ఈ రోజు


ఆశలు పండీ ఆకలి తీరి

బ్రతుకులు మారే పండుగరోజు     

    

మనదే మనదేలే ఈ రోజు

మన కందరికీ పండుగలే ఈ రోజు




హోయ్...హోయ్...హోయ్...హోయ్...హోయ్...



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2084

No comments:

Post a Comment