స్వరాల పల్లకి
Guest Book
[Sign My Guestbook]
[View My Guestbook]
Powered by E-Guestbooks Server
.
Saturday, April 1, 2017
నీరెండ దీపాలు నీ కళ్ళలో
చిత్రం : ఇల్లాలు (1981)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత :వేటూరి
నేపథ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
లలలలల ... లలలలల .... లలలలల
లలలలల ... లలలలల .... లలలలల
నీరెండ దీపాలు నీ కళ్ళలో... లలలలల
నా నీడ చూసాను ఎన్నాళ్ళకో.... లలలలల
ఈ కొండకోనల్ల వాకిళ్ళలో.... లలలలల
నీదాననైనాను కౌగిళ్ళలో.... లలలలల
నీరెండ దీపాలు నీ కళ్ళలో.... లలలలల
నా నీడ చూసాను ఎన్నాళ్ళకో... లలలలల
చరణం 1 :
ఈ సంధ్య వెలుగుల్లో నారింజ రంగుల్లో
ఈ సంధ్య వెలుగుల్లో నారింజ రంగుల్లో
నీ అందచందాలు మందారమై
నీ రాగభావాలు శృంగారమై
ఈ కొండగాలుల్లో నా గుండె ఊసుల్లో
నీ మాట అనురాగ సంగీతమై
నీ చూపు ప్రణయాల పేరంటమై
పొద్దెరగని ముద్దులలో ముద్దగ తడిసేవేళ
చరణం 2 :
నా ఆశలీనాడు ఆకాశమే చేరి
నా ఆశలీనాడు ఆకాశమే చేరి
మెరిసేను తారల్ల మణిహారమై
విరిసేను జాబిల్లి మనతీరమై
అందాల హరివిల్లు పొదరిల్లుగా మారి
వరిచేను విరిపానుపు మనకోసమై
కరగాలి జతగూడి మనమేకమై
ముద్దులలో నెలబాలుడి నిద్దురపోయిన వేళ
నీరెండ దీపాలు నీ కళ్ళలో.... లలలలల
నా నీడ చూసాను ఎన్నాళ్ళకో... లలలలల
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2755
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment