Showing posts with label శోభన్ బాబు. Show all posts
Showing posts with label శోభన్ బాబు. Show all posts

Saturday, April 1, 2017

ఓ బాటసారి...ఇది జీవిత రహదారి

చిత్రం :  ఇల్లాలు (1981)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత  :
నేపధ్య గానం  : ఏసుదాసు,  శైలజ 




పల్లవి :



ఓ బాటసారి...ఇది జీవిత రహదారి
ఓ బాటసారి...ఇది జీవిత రహదారి 


ఎంత దూరమో... ఏది అంతమో
ఎవరు ఎరుగని దారి ఇది
ఒకరికె సొంతం కాదు ఇది 


ఓ బాటసారి... ఇది జీవిత రహదారి..



చరణం 1 :



ఎవరు ఎవరికి తోడౌతారో.... ఎప్పుడెందుకు విడిపోతారో
మమతను కాదని వెళతారో... మనసే చాలని ఉంటారు
ఎవ్వరి పయనం ఎందాకో...
అడగదు ఎవ్వరిని... బదులే దొరకదని
అడగదు ఎవ్వరిని... బదులే దొరకదని


చరణం 2 :



కడుపుతీపికి రుజువేముందీ... అంతకు మించిన నిజమేముందీ...
కాయే చెట్టుకు బరువైతే.... చెట్టును భూమి మోస్తుందా..
ఇప్పుడు తప్పులు తెలుసుకొనీ... జరిగేదేమిటనీ..క్షమించదెవ్వరినీ


చరణం 3 :



తెంచుకుంటివి అనుబంధాన్ని... పెంచుకున్నదొక హృదయం దాన్ని..
అమ్మలిద్దరు వుంటారని అనుకోలేని పసివాడ్ని
బలవంతాన తెచ్చుకొని... తల్లివి కాగలవా? ... తనయుడు కాగలడా?


చరణం 4 :



అడ్డ దారిలో వచ్చావమ్మా... అనుకోకుండా కలిసావమ్మ
నెత్తురు పంచి ఇచ్చావూ... నిప్పును నీవే మింగావూ
ఆడదాని ఐశ్వర్యమేమిటో...ఇప్పుడు తెలిసింది..కథ ముగిసేపొయింది
ఇప్పుడు తెలిసింది..కథ ముగిసేపొయింది 


ఓ..బాటసారీ..ఇది జీవిత రహదారీ






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2663

నీరెండ దీపాలు నీ కళ్ళలో

చిత్రం : ఇల్లాలు (1981)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత :వేటూరి
నేపథ్య గానం : బాలు, సుశీల




పల్లవి :


లలలలల ... లలలలల .... లలలలల
లలలలల ... లలలలల .... లలలలల 

నీరెండ దీపాలు నీ కళ్ళలో... లలలలల
నా నీడ చూసాను ఎన్నాళ్ళకో.... లలలలల
ఈ కొండకోనల్ల వాకిళ్ళలో.... లలలలల
నీదాననైనాను కౌగిళ్ళలో.... లలలలల 


నీరెండ దీపాలు నీ కళ్ళలో.... లలలలల
నా నీడ చూసాను ఎన్నాళ్ళకో... లలలలల 




చరణం 1 :



ఈ సంధ్య వెలుగుల్లో నారింజ రంగుల్లో
ఈ సంధ్య వెలుగుల్లో నారింజ రంగుల్లో
నీ అందచందాలు మందారమై
నీ రాగభావాలు శృంగారమై


ఈ కొండగాలుల్లో నా గుండె ఊసుల్లో
నీ మాట అనురాగ సంగీతమై
నీ చూపు ప్రణయాల పేరంటమై
పొద్దెరగని ముద్దులలో ముద్దగ తడిసేవేళ



చరణం 2 :



నా ఆశలీనాడు ఆకాశమే చేరి
నా ఆశలీనాడు ఆకాశమే చేరి
మెరిసేను తారల్ల మణిహారమై
విరిసేను జాబిల్లి మనతీరమై


అందాల హరివిల్లు పొదరిల్లుగా మారి
వరిచేను విరిపానుపు మనకోసమై
కరగాలి జతగూడి మనమేకమై
ముద్దులలో నెలబాలుడి నిద్దురపోయిన వేళ



నీరెండ దీపాలు నీ కళ్ళలో.... లలలలల
నా నీడ చూసాను ఎన్నాళ్ళకో... లలలలల 





Friday, March 31, 2017

జిగినక.. అంబ పలుకు

చిత్రం : ఇద్దరు దొంగలు (1984)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల 



పల్లవి :


జిగినక.. జిగిజిగినక...
అంబ పలుకు జగదంబ పలుకు... సొగసమ్మ తళుకు తందానరోయ్


జిగినక.. జిగిజిగినక...
దులుపు దులుపు నీ తళుకు బెళుకు నడిజాము వరకు సిలకా



జిగినక.. జిగిజిగినక...
అంబ పలుకు జగదంబ పలుకు... సొగసమ్మ తళుకు తందానరోయ్


జిగినక.. జిగిజిగినక...
దులుపు దులుపు నీ తళుకు బెళుకు నడిజాము వరకు సిలకా


జిగినక.. జిగిజిగినక...
అరే... జిగినక.. జిగిజిగినక... 




చరణం 1 :


రాక రాక వచ్చినావు రాతిరంతా నీదోనురోయ్... హహ
వచ్చినాక వెళ్ళలేవు రాపిడంతా నాదేనురోయ్... హా


అహాహా... నంగనాచి రంగసాని దొంగసొత్తు దోచెయ్యనా..హా
ఉంగరాల జుట్టు తీసి చెంగుముద్దు కాజేయ్యనా... హా 


ఈ దోపిడి వద్దుర మావా... మరి రాతిరికెట్టా భామా
తీగదాక సాగినాక పోకచెక్కలివ్వమంటే పొద్దుపోదు తెలుసా


జిగినక.. జిగిజిగినక...
అంబ పలుకు జగదంబ పలుకు... సొగసమ్మ తళుకు తందానరోయ్
అరే... జిగినక.. జిగిజిగినక...
దులుపు దులుపు నీ తళుకు బెళుకు నడిజాము వరకు సిలకా


జిగినక.. జిగిజిగినక...
జిగినక.. జిగిజిగినక...



చరణం 2 :



చీకటింటికొచ్చినాక చీకుచింత తీర్చెయ్యనా...హా
సిగ్గు వచ్చిపోయినాక చీర నీకు కట్టెయ్యనా... హా


హహహ... సొమ్ములన్ని దోచుకుంటే సొమ్మసిల్లిపోతానురో..అయ్యయ్యో
సోకులన్నీ రాలిపోతే అమ్మతల్లి అంటానురో... 


అనుకోవే కృష్ణారామా... మరి బ్రతికేదెట్టా మావా
కాలమంతా చెల్లిపోతే కాయ కాస్త పండిపోతే... దిక్కులేదు తెలుసా


జిగినక.. జిగిజిగినక...
అంబ పలుకు జగదంబ పలుకు... సొగసమ్మ తళుకు తందానరోయ్


జిగినక.. జిగిజిగినక...
దులుపు దులుపు నీ తళుకు బెళుకు నడిజాము వరకు సిలకా


జిగినక.. జిగిజిగినక...
అరే... జిగినక.. జిగిజిగినక... 





 http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2687

పాడితే శిలలైన కరగాలి

చిత్రం : గోరింటాకు (1979)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  సుశీల  



పల్లవి : 


పాడితే శిలలైన కరగాలి
పాడితే శిలలైన కరగాలి... జీవిత గతులైన మారాలి


నా పాటకు ఆ బలమున్నదో లేదో... పాడిన పిదపే తెలియాలి
నా పాటకు ఆ బలమున్నదో లేదో... పాడిన పిదపే తెలియాలి
పాడితే శిలలైన కరగాలి



చరణం 1 :


నీ పాటతోటి నే పగిలిపోవలే... పాడమన్నది హృదయం
నీ పాటతోటి నే పగిలిపోవలే... పాడమన్నది హృదయం


పెగలిరాక నా పాట జీరగా... పెనుగులాడినది కంఠం
పెగలిరాక నా పాట జీరగా... పెనుగులాడినది కంఠం


గొంతుకు గుండెకు ఎంత దూరం...
గొంతుకు గుండెకు ఎంత దూరం... ఆశనిరాశకు అంతే దూరం
ఆశనిరాశకు అంతే దూరం... 


పాడితే శిలలైన కరగాలి... జీవిత గతులైన మారాలి
నా పాటకు ఆ బలమున్నదో లేదో... పాడిన పిదపే తెలియాలి
పాడితే శిలలైన కరగాలి



చరణం 2 :


తాళి కట్టెడి వేళ కోసమే వేచి చూసినది విరిమాలా
కట్టే వేళకు కట్టని తాళిని కత్తిరించినది విధిలీలా


వేచిన కళ్ళకు కన్నీళ్ళా.... వేయని ముడులకు నూరేళ్ళా
నా పాటకు పల్లవి మారేనా... ఈ పగిలిన గుండె అతికేనా
ఈ చితికిన బ్రతుకిక బ్రతికేనా..... 






Thursday, March 30, 2017

కౌగిలి... తొలి కౌగిలి

చిత్రం : గిరిజా కళ్యాణం (1981)
సంగీతం : సత్యం
గీతరచయిత : మైలవరపు గోపి
నేపధ్య గానం : బాలు,  శైలజ 



పల్లవి :


కౌగిలి...  తొలి కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి
కౌగిలి....  ఇది తొలి కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి


ఇది ఎన్నటికి సన్నజాజి పందిరి
ఇలా ఇలా నిలిచివుండని..హో
కౌగిలి తొలి  కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి
ఇది ఎన్నటికి సన్నజాజి పందిరి
ఇలా ఇలా నిలిచివుండని


కౌగిలి తొలి కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి 


చరణం 1 :



ఎంతందం ఏమందం...  ఈ లేతమేనిలో
ఆశలెన్నో రేపుతోంది గుండెలో..హా
ఈ సొగసు నా మనసు...  నీ చేతికివన్నా
నిన్ను వలచి నన్ను మరచి నిలవనా
ఆ.. పొదలొ పువ్వు....  నీ యెదపై నేను
నింగికి మబ్బు... నాతో నువ్వు



కౌగిలి....  ఇది తొలి కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి
ఇది ఎన్నటికి... సన్నజాజి పందిరి
ఇలా ఇలా...నిలిచివుండని


కౌగిలి..తొలి..కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి 



చరణం 2 :


నీ చేయి నా చేయి కలిసి నడవని
నీ అడుగున అడుగు వేసి సాగని..హా
ఎపుడమ్మ తీరేది ఈ వయస్సు  ఆకలి
నా కలలో  నిన్న మొదటి రాతిరి
సమయం రాని... ఒకటై పోని
వలపు నిండని... కలలు పండని


కౌగిలి ఇది...తొలి కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి
ఇది ఎన్నటికి సన్నజాజి పందిరి
ఇలా..ఇలా..నిలిచివుండని


కౌగిలి..తొలి..కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి






యవ్వనమే ఎదురై నిలిచింది

చిత్రం : గిరిజా కళ్యాణం (1981)
సంగీతం : సత్యం
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల 



పల్లవి :


యవ్వనమే ఎదురై నిలిచింది... కౌగిలికే పిలిచింది
యవ్వనమే ఎదురై నిలిచింది... కౌగిలికే పిలిచింది



మమతల మధుమాసంలో.. మల్లెల సావాసంలో
మమతల మధుమాసంలో.. మల్లెల సావాసంలో
మందారమకరందమై... అందమై... అందమై...


యవ్వనమే ఎదురై నిలిచింది... కౌగిలికే పిలిచింది
మమతల మధుమాసంలో.. మల్లెల సావాసంలో
శృంగారసుమగంధమై... బంధమై... బంధమై



చరణం 1 :


అందీ అందని రుచితో నీ అందం కవ్విస్తుంటే...
చక్కిలిగింతల చలికే ఆ చుక్కలు దిగి వస్తుంటే


చూసీ చూడని కలలే నీ చూపులు లాగేస్తోంటే
ముద్దులు ముచ్చట పడుతూ నీ ముద్దర వేసేస్తోంటే
చలిమంట కాగాలి చెలి జంటలో... జంటలో.. జంటలో



యవ్వనమే ఎదురై నిలిచింది... కౌగిలికే పిలిచింది



చరణం 2 :



కౌగిలి చాలని వలపే ఏకాంతం కోరుతూ ఉంటే
గాలికి తెలియని కబురే చెలి కన్నులు పంపుతు ఉంటే 


మాపటి వేళకు సిగలో విరులే మరులౌతుంటే
వెచ్చని ఆ ఊపిరులే నా వయసుకు గురి పెడుతుంటే
అందాల తొలి పూజ అందాలిలే... అందాలిలే... అందాలిలే



యవ్వనమే ఎదురై నిలిచింది... కౌగిలికే పిలిచింది
మమతల మధుమాసంలో.. మల్లెల సావాసంలో
శృంగారసుమగంధమై... బంధమై... బంధమై


యవ్వనమే ఎదురై నిలిచింది... కౌగిలికే పిలిచింది





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2660

తాగాను... నేను తాగాను

చిత్రం : గంగ - మంగ (1973)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : సుశీల 


పల్లవి :



తాగాను... నేను తాగాను... బాగా నేను తాగాను..తాగాను
భలే నిషాలో ఉన్నాను..ఉన్నాను..తాగాను..నేను తాగాను   



చరణం 1 :


కైపులో ఉన్నాను కలలుకంటున్నాను
మదిలోని వేదన మరువలేకున్నాను
కైపులో వున్నాను కలలు కంటున్నాను
మదిలోని వేదన మరువలేకున్నాను

మ్మ్ హూ మ్మ్ హూ వలపులో పడ్డాను
వెత తీర్చ వచ్చాను... వలపులో పడ్డాను
నే నెవ్వరో నేనే చెప్పలేకున్నాను

తాగాను...  నేను తాగాను...  బాగా నేను తాగాను....  తాగాను    




చరణం 2 :



కోటి తారలు నిన్నే కోరుకుంటాయి
అందాలు చందాలు అందజేస్తాయి
కోటి తారలు నిన్నే కోరుకుంటాయి
అందాలు చందాలు అందజేస్తాయి 

మ్మ్ హూ మ్మ్ హూ
ఆ నెలరాజుతో చెలిమి నే కోరలేను
నీ దారిలో నుండి తొలగిపోతాను
మన్నించమన్నాను....  మరచిపొమ్మంటాను






Thursday, March 23, 2017

దేహమేరా దేవాలయం

చిత్రం : దేవాలయం (1985)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత :
నేపధ్య గానం : బాలు 



పల్లవి :


దేహో దేవాలయో ప్రోక్తో
జీవో దేవస్సనాతనః


దేహమేరా దేవాలయం
దేహమేరా దేవాలయం
జీవుడే సనాతన దైవం


నేనే బ్రహ్మ...  నేనే విష్ణువు
నేనే బ్రహ్మ...  నేనే విష్ణువు
నేనే శివుడై నిలబడితే....
ఏ అర్హత నాకుండాలీ?
ఏ అధికారం కావాలీ?


అహం బ్రహ్మస్మి...  అహం బ్రహ్మస్మి
దేహమేరా...  దేవాలయం 



చరణం 1 : 



ఆత్మాత్వం గిరిజా మతిః
పరిజనాః ప్రాణః శరీరం గృహం


అనలేదా అది శంకరుడు...
అంతకు మించిన వారా మీరు?


ఆడంబరమూ బాహ్యవేశము
అర్బాటలే మీ మతమా
అస్థికులంటే మీరేనా
అస్థికలంటే శరీరమా


శిలా గోపురం ఆలయమా
శఠగోపురమే అర్చనమా


దేహమేరా దేవాలయం
జీవుడే సనాతన దైవం 



చరణం 2 : 



అద్వేష్టా సర్వ భూతానాం
మైత్రః కరుణ యేవచ
నిర్మమో నిరహంకారః
నమ దుఃఖ సుఖ క్షమీ


సంతుష్ట స్సతతం యెగీ
యదాత్మా దృఢ నిశ్చయః


మై అర్పిత మనో బుద్దిర్యోహో
మద్బక్త స్సమే ప్రియః
మద్బక్త స్సమే ప్రియః
మద్బక్త స్సమే ప్రియః





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2136

Wednesday, February 1, 2017

గోగులుపూచే గుట్ట మీదా

చిత్రం : ధర్మచక్రం (1980)
సంగీతం : సత్యం
గీతరచయిత : మైలవరపు గోపి
నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి :


గోగులుపూచే గుట్ట మీదా... మందలు కాచే అందగాడా
తొందరెందుకు.. చిందులెందుకు.. సందపొద్దు వాలాలిరా
హేయ్.. లబలబదియ్య



గోగులుపూచే గుట్ట మీదా... గోపికలాంటి సిన్నదానా
సద్దు చెయ్యకా...  ముద్దులియ్యకా నిన్నిడిచిపెడతానటే...
హేయ్.. లబలబదియ్య



గోగులుపూచే గుట్ట మీదా... గోపికలాంటి సిన్నదానా  



చరణం 1 :


బొంగరాల బుగ్గ మీదా... ఊ..హూ..
నీ ఉంగరాల సిగ్గు చూస్తే.. ఊ..హూ..
ఎండమావి గుండెలోనా... ఊ..హూ
కొండవాగు వరదలైతే.. ఊ..హూ


వరదాలాంటి మరదలొస్తే... నన్ను కెరటమల్లే  కిలకేస్తే..ఏ..ఏ..
వరదాలాంటి మరదలొస్తే... నన్ను కెరటమల్లే  కిలకేస్తే..ఏ..ఏ..


చక్కిలిగింతలచిక్కని వాడా ఉక్కిరిబిక్కిరి అయిపోతావేం...
చక్కిలిగింతలచిక్కని వాడా ఉక్కిరిబిక్కిరి అయిపోతావేం...


హైలో హైలో హైలో హైలో.... సైలో సైలో సైలో సైలో...




చరణం 2 :



కొంటె చూపు ఎండలాడితే.. ఊ..హూ
నా దోర నవ్వు బేరమాడితే.. ఆహా
ఆ పూలబుట్ట వన్నెలన్నీ.. ఊ..హూ
నన్ను మాల కట్టి వేసుకోనీ.. ఊ..హూ.. 



దొంగలాగ తొంగి చూడకు... ఒరయ్యో..  దుయ్యబట్టి కొయ్యబోకు..ఓ..ఓ..
దొంగలాగ తొంగి చూడకు... ఒరయ్యో .. దుయ్యబట్టి కొయ్యబోకు..ఓ..ఓ.. 


రంగుల చీర పొంగులతోటే రంకెలు వేసి రెచ్చిపోకు...
రంగుల చీర పొంగులతోటే రంకెలు వేసి రెచ్చిపోకు... 



గోగులుపూచే గుట్ట మీదా... మందలు కాచే అందగాడా
తొందరెందుకు.. చిందులెందుకు.. సందపొద్దు వాలాలిరా


హేయ్.. లబలబదియ్య

గోగులుపూచే గుట్ట మీదా... గోపికలాంటి సిన్నదానా
 






Sunday, January 1, 2017

కుడికన్ను కొట్టగానే

చిత్రం :  దేవత (1982)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల





పల్లవి :


కుడికన్ను కొట్టగానే కుర్రాణ్ణి... ఎడం కన్ను కొట్టగానే ఎర్రోణ్ణి
కుడికన్ను కొట్టగానే కుర్రాణ్ణి... ఎడం కన్ను కొట్టగానే ఎర్రోణ్ణి
ఆ రెండు కళ్ళు కొట్టరాదా... నన్ను రెచ్చగొట్టి చూడరాదా
వంకాయ్.. హోయ్.. హోయ్ 


కుడికన్ను కొట్టగానే కుర్రోడా... ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా
కుడికన్ను కొట్టగానే కుర్రోడా... ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా
ఆ రెండుకళ్ళు కొట్టనేలా... ఈ గుండె తలుపు తట్టనేలా
వంకాయ్.. హోయ్.. హోయ్...


కుడికన్ను కొట్టగానే కుర్రాణ్ణి... ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా



చరణం 1 :


గుమ్మా ముద్దుగుమ్మా... ముద్దు గుమ్మాలు దాటింది లెమ్మంటా
అరే... అమ్మో.. ఎవడి సొమ్మో... దాచుకోకమ్మో... దోచాలి రమ్మంటా
జోరుగా.. నీరునారుగా పచ్చపైరల్లే ఉర్రూతలూగాలంటా


ఊగాలా... తత్తరపడి విచ్చలవిడి ఉయ్యాలా...
నిద్దరచెడి ముద్దరపడి పొద్దుల గురి తప్పాలా
ముద్దుల ముడి విప్పాలా... అల్లరి పడి సందేలా
మల్లెలతో చెప్పాలా... వంకాయ్.. హోయ్.. హోయ్


కుడికన్ను కొట్టగానే కుర్రోడా... ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా
ఆ రెండు కళ్ళు కొట్టరాదా... నన్ను రెచ్చగొట్టి చూడరాదా



చరణం 2 :



బుగ్గో..పూతమొగ్గో... కొత్తబేరాలు కోరింది రమ్మంటా
అహ.. సిగ్గో చిలిపి ముగ్గో పట్టపగ్గాలు లేవంది తెమ్మంటా
జోడుగా ఏరు నీరుగా పల్లెసీమల్లో ఊరేగి పోవాలంటా


రేగాలా.. బెత్తర చెలి చూపులు సుడి రేగాలా
నడిరాతిరి కొన ఊపిరి చక్కలిగిలి కావాలా
దిక్కులు చలికూగాలా ... చుక్కలు దిగి రావాలా
మొక్కుబడులు చెయ్యాలా.... వంకాయ్... హోయ్.. హోయ్



కుడికన్ను కొట్టగానే కుర్రాణ్ణి... ఎడం కన్ను కొట్టగానే ఎర్రోణ్ణి
కుడికన్ను కొట్టగానే కుర్రాణ్ణి... ఎడం కన్ను కొట్టగానే ఎర్రోణ్ణి
ఆ రెండు కళ్ళు కొట్టరాదా... నన్ను రెచ్చగొట్టి చూడరాదా
వంకాయ్.. హోయ్.. హోయ్... హోయ్...  



కుడికన్ను కొట్టగానే కుర్రోడా... ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా
కుడికన్ను కొట్టగానే కుర్రోడా... ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా
ఆ రెండుకళ్ళు కొట్టనేలా... ఈ గుండె తలుపు తట్టనేలా



అవునన్నావ్ అవునన్నావ్

చిత్రం : గడుసు పిల్లోడు (1985)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల  




పల్లవి : 



అవునన్నావ్ అవునన్నావ్... అడిగినదానికి అవునన్నావ్
అన్నాక ఎందుకు కంగారుపడతావ్...
అన్నాక ఎందుకు కంగారుపడతావ్...


అవునన్నా... అవునన్నా... అడిగినదానికి అవునన్నా
అన్నాక ఎందుకు తొందరపడతావ్...
అన్నాక ఎందుకు తొందరపడతావ్... 



చరణం 1 :



నేనా తొందర పడుతున్నది... నీ అందం తరుముకు వస్తున్నది
నేనా తొందర పడుతున్నది... నీ అందం తరుముకు వస్తున్నది


నేనా కంగారు పడుతున్నది...
నేనా కంగారు పడుతున్నది...
నీ తొందర చూస్తే దడపుడుతున్నది
నీ తొందర చూస్తే దడపుడుతున్నది 


ఏమన్నావ్... నువ్ అడిగినదానికి ఔనన్నా
ఏమడిగావ్... నువ్ ఔనన్నదే నేనడిగా
ఏమన్నావ్... నువ్ అడిగినదానికి ఔనన్నా
ఏమడిగావ్... నువ్ ఔనన్నదే నేనడిగా 



అవునన్నావ్ అవునన్నావ్... అడిగినదానికి అవునన్నావ్

అన్నాక ఎందుకు కంగారుపడతావ్...అన్నాక ఎందుకు తొందరపడతావ్...



చరణం 2 :



ఏదో దగ్గర అవుతున్నది... ఈ దూరం బరువుగా తోస్తున్నది
ఏదో దగ్గర అవుతున్నది... ఈ దూరం బరువుగా తోస్తున్నది


ఏదో ఒకటై పొమ్మన్నది...
ఏదో ఒకటై పొమ్మన్నది...
ఈ ఇద్దరనేదే ఇక వద్దన్నది...
ఈ ఇద్దరనేదే ఇక వద్దన్నది...


ఏం చేద్దాం... వయసును మనసుకు వదిలేద్దాం
వదిలేద్దామా... ముడి వేసి మరి వదిలేద్దాం...
ఏం చేద్దాం... వయసును మనసుకు వదిలేద్దాం
వదిలేద్దామా... ముడి వేసి మరి వదిలేద్దాం...


అవునన్నా... అవునన్నా... అడిగినదానికి అవునన్నా
అన్నాక ఎందుకు తొందరపడతావ్... 


అవునన్నావ్ అవునన్నావ్... అడిగినదానికి అవునన్నావ్
అన్నాక ఎందుకు కంగారుపడతావ్...


ఆ.. ఆ... ఆ... ఆ.. అహా...హా
లలలాలాలలా... 






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2527

చీకటి పడుతోంది

చిత్రం : గడుసు పిల్లోడు (1985)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల  



పల్లవి : 


చీకటి పడుతోంది... ఇంటికి చేరే వేళయ్యింది.. హహహ
చీకటి పడుతోంది... ఇంటికి చేరే వేళయ్యింది


చీకటి పడుతోంది... జంటలు చేరే వేళయ్యింది
చీకటి పడుతోంది... జంటలు చేరే వేళయ్యింది


చీకటి పడుతోంది... ఇంటికి చేరే వేళయ్యింది



చరణం 1 :


పుణ్యకాలం దాటిపోయింది... ఈ.. ఈ.. పొంగు కాస్త ఆరిపోయింది
పుణ్యకాలం దాటిపోయింది... పొంగు కాస్త ఆరిపోయింది


పుణ్యకాలం ముందు ముందుంది... పొంగు ఆరని వయసు మనకుంది


వెళ్ళనీయ్ నన్నింటికి... ఈ వేడుక చాలీనాటికి..అహా..
వెళ్ళనీయ్ నన్నింటికి... ఈ వేడుక చాలీనాటికి


వచ్చినట్టే వెళ్ళడానికి... ఈ వల్లమాలిన పాట్లు దేనికి


చీకటి పడుతోంది... ఇంటికి చేరే వేళయ్యింది
చీకటి పడుతోంది... జంటలు చేరే వేళయ్యింది
చీకటి పడుతోంది... ఇంటికి చేరే వేళయ్యింది



చరణం 2 :



ఎంత బాగుంది?... ఏం బాగుంది?..ఊం...


ఈ గాలి... చలి వేస్తోంది
ఈ తోటా... భయమేస్తోంది
ఆకాశం.. నలుపెక్కింది
నా ఆశా... కొండెక్కింది


ఈ గాలి... చలి వేస్తోంది
ఈ తోటా... భయమేస్తోంది
ఆకాశం.. నలుపెక్కింది
నా ఆశా... కొండెక్కింది


ఈ చాటు సరసాలు.. ఈ దొంగ సరదాలు
ఈ వయసుకుండాలి... జలసాలు
వాటికే వెయ్యాలి పగ్గాలు



చీకటి పడుతోంది... జంటలు చేరే వేళయ్యింది
చీకటి పడుతోంది... ఇంటికి చేరే వేళయ్యింది



చరణం 3 :



మగాడికేమీ తెగింపు వస్తుంది... ఈ.. ఈ...
ఆడపిలకు బిగింపు సొగసైంది... ఈ.. ఈ.. 


సొగసులు చూస్తే నోరు ఊరుతుంది... ఈ.. ఈ..
బిగువులు చూస్తే తెగింపు పుడుతుంది.. ఈ.. ఈ.. 


తప్పంతా వయసుది... అది హద్దులు దాటి పోతుంది
తప్పంతా వయసుది... అది హద్దులు దాటి పోతుంది


హద్దులకైనా హద్దుంది.. అది మరీ లాగితే తెగిపోతుంది



చీకటి పడుతోంది... ఇంటికి చేరే వేళయ్యింది
చీకటి పడుతోంది... జంటలు చేరే వేళయ్యింది.. హహహ...
చీకటి పడుతోంది... ఇంటికి చేరే వేళయ్యింది







Thursday, July 23, 2015

ఆ నవ్వుకు ఒక ఆమనీ

చిత్రం  :  ఇద్దరు దొంగలు (1984)
సంగీతం  :  చక్రవర్తి
గీతరచయిత  :  వేటూరి
నేపధ్య గానం  : బాలు, సుశీల 



పల్లవి :


ఆ నవ్వుకు ఒక ఆమనీ.. అహ.. హా..
ఆ చూపుకు ఒకటే చలి.. అహ..హా..
ఆ కౌగిట ఒక వేసవి.. అహ..హా..
ఆ చక్కిట చిరు జాబిలి.. అహ..హా..


ఏమి లయలు.. ఎంత హొయలు.. ఎన్ని రుచులు నీలో
మొగ్గలు మొగ్గలుగా.. అవి సిగ్గులుపడెనాలో
మొగ్గలు మొగ్గలుగా.. అవి సిగ్గులుపడెనాలో


ఆ నవ్వుకు ఒక ఆమనీ.. అహ.. హా..
ఆ చూపుకు ఒకటే చలి..  అహ.. హా..




చరణం 1 :


ఎన్నో స్వరాల నీ నవ్వు చూసి నేనే వరించగా
నీ రూపమంత ఆలాపనాయె నాలోన నీడగా
ఎన్నో స్వరాల నీ నవ్వు చూసి నేనే వరించగా
నీ రూపమంత ఆలాపనాయె నాలోన నీడగా


నీ కొంటెచూపు మనసంత వెలుగు వేదాలు పాడగా
అల్లారుపొద్దు అల్లారుముద్దు నీకే జవాబులిస్తాగా


బదులైనా బతుకైనా..ముద్దుకు ముద్దే చెల్లంటా

వయసుకు వయసే వళ్ళంటా..

కన్ను తుదల.. ఎన్ని ఎదల తీపి సుధలు నీలో..

వెచ్చని ముద్దులుగా..  అవి అచ్చులు పడెనాలో

వెచ్చని ముద్దులుగా..  అవి అచ్చులు పడెనాలో




ఆ నవ్వుకు ఒక ఆమనీ.. అహ.. హా..
ఆ చూపుకు ఒకటే చలి.. అహ..హా..
ఆ కౌగిట ఒక వేసవి.. అహ..హా..
ఆ చక్కిట చిరు జాబిలి.. అహ..హా.. 


చరణం 2 :


ఎన్నో యుగాల నీ వీక్షణాల కరిగే క్షణలలో
చేసే దగాలు చెరిపే సగాలు కలిపే సుఖాలలో
ఎన్నో యుగాల నీ వీక్షణాల కరిగే క్షణలలో
చేసే దగాలు చెరిపే సగాలు కలిపే సుఖాలలో


వీచే పెదాల చిలిపీ సిరాల.. చిరు సంతకాలతో
నా జీవితాలు చెలి కాగితాలు..నీకంకితాలు చేస్తాగా


కలలైనా.. నిజమైనా.. కౌగిలి పెట్టిన ఇల్లంటా
ఇద్దరి పేరే ప్రేమంటా..
ఎన్నిజతులు.. ప్రేమ జతలు.. పూలరుతులు నీలో..



తుంటరి తుమ్మెదనై.. అవి తొందరపడెనాలో
తుంటరి తుమ్మెదనై.. అవి తొందరపడెనాలో 



ఆ నవ్వుకు ఒక ఆమనీ.. అహ.. హా..
ఆ చూపుకు ఒకటే చలి.. అహ..హా..
ఆ కౌగిట ఒక వేసవి.. అహ..హా..
ఆ చక్కిట చిరు జాబిలి.. అహ..హా..


ఏమి లయలు.. ఎంత హొయలు.. ఎన్ని రుచులు నీలో
మొగ్గలు మొగ్గలుగా.. అవి సిగ్గులుపడెనాలో
వెచ్చని ముద్దులుగా..  అవి అచ్చులు పడెనాలో


లలలల.. లా.. లల.. లాలలల.. లలలాలా.. 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2750

Wednesday, March 27, 2013

కొమ్మ మీద కోయిలమ్మ

చిత్రం : డాక్టర్ బాబు (1973)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల 


పల్లవి : 


కొమ్మ మీద..హహా..కొకిలమ్మ..ఆహా
గొంతెత్తి పాదిందిలే... ఆ ఆ ఆ
గుండెలోన ఓహో... కోరికేదో..ఓహో
పడగెత్తి ఆడిందిలే... హాయ్..హాయ్


కొమ్మ మీద..హహా..కొకిలమ్మ..ఆహా
గొంతెత్తి పాదిందిలే... ఆ ఆ ఆ
గుండెలోన ఓహో... కోరికేదో..ఓహో
పడగెత్తి ఆడిందిలే


లలలలలా... లలలలలా... లలలలా
లలలలలా... లలలలలా... లలలలా 



చరణం 1 : 



చిన్నరి చిలకమ్మ గూటిలో
కొంటే గోరింక చేరింది ఎందుకే?
ఎందుకే ? ... అహ అహ అహ అహా ఆ


బంగారు చామంతి పువ్వులో
గండు తుమ్మెద దూరింది ఎందుకే ?
ఎందుకే ?


చిన్నరి చిలకమ్మ గూటిలో
కొంటే గోరింక చేరింది ఎందుకే?
బంగారు చామంతి పువ్వులో
గండు తుమ్మెద దూరింది ఎందుకే ?


చల్లగాలి తగిలీ... ఆ ఆ ఆ ఆ ఆ
మనసంతా రగిలీ... ఓ ఓ ఓ ఓ ఓ
చల్లగాలి తగిలీ...నా మనసంతా రగిలీ
ఒళ్లంతా  ఝలు ఝల్లు మంటున్నదీ... ఈ..
ఏమో... ఏమో... అవుతుందీ..


కొమ్మ మీద..హహా..కొకిలమ్మ..ఆహా
గొంతెత్తి పాదిందిలే... ఆ ఆ ఆ
గుండెలోన ఓహో... కోరికేదో..ఓహో
పడగెత్తి ఆడిందిలే


లలలలలా... లలలలలా... లలలలా
లలలలలా... లలలలలా... లలలలా 



చరణం 2 : 



లల్లలలాలా లలలలాల లల్లలలాలా
లల్లలలాలా లలలలాల లల్లలలాలా 


ఆ కొండ ఈ కొండ సందులో
తుళ్ళి పడుతుంది సెలయేరు..ఎందుకే ?.. ఎందుకే ?..
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
లలాలలాలలాలలాలలా
నల్లని మబుల నీడలో..
నెమలి పురివిప్పి ఆడుతుంది..ఎందుకే?... ఎందుకే?


ఆ కొండ ఈ కొండ సందులో
తుళ్ళి పడుతుంది సెలయేరు..ఎందుకే ?
నల్లని మబుల నీడలో..
నెమలి పురివిప్పి ఆడుతుంది..ఎందుకే? 


వయసు పులకరించీ... ఆ ఆ ఆ ఆ ఆ
ఆశలు చిగురించీ... ఓ ఓ ఓ ఓ ఓ
వయసు పులకరించీ... నా ఆశలు చిగురించీ
వళ్ళంత ఝలు ఝలు మంటుందే..ఏ..
ఏమో..ఏమో..అవుతుందే..


కొమ్మ మీద..హహా..కొకిలమ్మ..ఆహా
గొంతెత్తి పాదిందిలే... ఆ ఆ ఆ
గుండెలోన ఓహో... కోరికేదో..ఓహో
పడగెత్తి ఆడిందిలే





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2092

విరిసే కన్నులలో

చిత్రం : డాక్టర్ బాబు (1973)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : సుశీల 


పల్లవి : 


విరిసే కన్నులలో.. వేయి బాసలున్నవిలే..
అవి నా గుండెలలో... మూగవోయివున్నవిలే.. 


విరిసే కన్నులలో.. వేయి బాసలున్నవిలే.. 


చరణం 1 : 


ఎదురుగా నువ్వులేవు.. ఏ అందాలిక లేవు...
జతగా నువు రావు.. జాబిలి కళలే లేవు... 


నీ మనసే నాదైనా... నీ.. మనసే నాదైనా..
ఇరువురి దారులింక వేరేలే... 


విరిసే కన్నులలో.. వేయి బాసలున్నవిలే..
అవి నా గుండెలలో... మూగవోయివున్నవిలే..
విరిసే కన్నులలో.. వేయి బాసలున్నవిలే.. 



చరణం 2 : 


నీవు లేని నా మనసే.. దేవుడు లేని కోవెల..
నీవులేని నా వలపే.. నిట్టూర్పుల వెన్నెల.. 


నీ తోడే లేకుంటే...నీ తోడే లేకుంటే..
నా బ్రతుకుకే కన్నీటి కథయేలే... 


విరిసే కన్నులలో.. వేయి బాసలున్నవిలే...
అవి నా గుండెలలో... మూగవోయివున్నవిలే..
విరిసే కన్నులలో.. వేయి బాసలున్నవిలే.. 






విరిసే కన్నులలో

చిత్రం : డాక్టర్ బాబు (1973)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల


పల్లవి :


విరిసే కన్నులలో వేయిబాసలున్నవిలే ..
అవి నా గుండెలలో... అల్లరి చేస్తున్నవిలే...


విరిసే కన్నులలో వేయిబాసలున్నవిలే ....


చరణం 1 :


నీ కనుపాపలే .. వినీల కాంతి దీపాలు..
నీ చిరునవ్వులే.. వెన్నెలల పారిజాతాలు..
నీ సొగసే నాదైతే .. నీ సొగసే నాదైతే ..
కలకలలాడులే వసంతాలు...


విరిసే కన్నులలో వేయిబాసలున్నవిలే ...
అవి నా గుండెలలో... అల్లరి చేస్తున్నవిలే...



చరణం 2 :


ఎదురుగా నువ్వుంటే.. ఉదయ కాంతులెందుకులే..
జతగా నువ్వుంటే... జాబిలి ఇంకెందుకులే...


నీ వలపే నాదైతే.. నీ వలపే నాదైతే ...
ఏ బృందావనాలు... ఎందుకులే..


విరిసే కన్నులలో వేయిబాసలున్నవిలే ..
అవి నా గుండెలలో... అల్లరి చేస్తున్నవిలే...


విరిసే కన్నులలో వేయిబాసలున్నవిలే .
..








Saturday, December 15, 2012

చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివీ

చిత్రం: గోరింటాకు (1979) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
గీతరచయిత: దేవులపల్లి 
నేపధ్య గానం: బాలు, సుశీల 


పల్లవి: 

చెప్పనా...సిగ్గు విడిచి చెప్పరానివీ... 
చెప్పకుంటే నీకు నీవే తెలుసుకోనివి... 
చెప్పనా...చెప్పనా...చెప్పనా.... 

అడగనా...నోరు తెరిచి అడగరానివి...ఈ.. 
అడకుంటే నీకు నీవే ఇవ్వలేనివీ...ఈ.. 
అడగనా...అడగనా...అడగనా.... 

చెప్పనా...సిగ్గు విడిచి చెప్పరానివి.... 
అడగనా...నోరు తెరిచి అడగరానివి.... 

చరణం 1: 

చెప్పమనీ...చెప్పకుంటే ఒప్పననీ... 
చెప్పి చెప్పి నా చేత చెప్పించుకున్నవి చెప్పనా? 

అడగమనీ...అడగకుంటే జగడమనీ... 
అడిగి అడిగి నా చేత అడిగించుకున్నవి అడగనా? 

అడుగు మరి...చెప్పు మరి... 
అడుగు మరి...చెప్పు మరి... 

చెప్పితే అల్లరి... అడిగితే తుంటరి... 
చెప్పనా...సిగ్గు విడిచి చెప్పరానివి... 
అడగనా...నోరు తెరిచి అడగరానివి... 

చరణం 2: 

నిన్న రాత్రి వచ్చి...సన్న దీప మార్పి... 
పక్క చేరి నిదురపోవు సోయగాన్ని... 
వీపుతట్టి రెచ్చగొట్టి కలలాగ వెళ్లిపోతే... 
పిల్ల గతి...కన్నెపిల్ల గతి ఏమిటో...చెప్పనా... 

పగటి వేళ వచ్చి పరాచకలాడి... 
ఊరుకొన్న పడుచువాణ్ణి ఉసిగొలిపి... 
పెదవి చాపి.. పిచ్చి రేపి ఇస్తానని ఊరిస్తే... 
ఇవ్వమనీ...ఇచ్చి చూడమని ముద్దులే అడగనా... 

వద్దని...హద్దు దాట వద్దనీ... 
అన్న కొద్ది ముద్దు చేసి కొసరి తీసుకున్నవి చెప్పనా... 

నేననీ..వేరనేది లేదనీ...అనీ అనీ...ఆగమని.. 
ఆపుతున్నదెందుకని అడగనా.... 

అడుగు మరి...చెప్పు మరి... 
అడుగు మరి...చెప్పు మరి... 

చెప్పితే అల్లరి... అడిగితే తుంటరి... 
అడగనా...అడగనా...అడగనా.... 
చెప్పనా... సిగ్గు విడిచి చెప్పరానివి... 
అడగనా... నోరు తెరిచి అడగరానివి...

గోరింట పూచింది కొమ్మలేకుండా

చిత్రం: గోరింటాకు (1979) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
గీతరచయిత: దేవులపల్లి 
నేపధ్య గానం: సుశీల 

పల్లవి: 

గోరింట పూచింది కొమ్మలేకుండా 
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది 
గోరింట పూచింది కొమ్మలేకుండా 
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది 
ఎంచక్కా పండిన ఎర్రని చుక్క 
చిట్టీపేరంటానికి కలకాలం రక్ష 

చరణం 1: 

మామిడీ చిగురెరుపు మంకెన పువ్వెరుపు 
మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు 
మామిడీ చిగురెరుపు మంకెన పువ్వెరుపు 
మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు 
సందే వన్నెల్లోన సాగే మబ్బెరుపు 
తానెరుపు అమ్మాయి తనవారిలోన.. 


గోరింట పూచింది కొమ్మలేకుండా 
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది 
చరణం 2: 

మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు 
గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు 
మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు 
గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు 
సింధూరంలా పూస్తే చిట్టి చేయంతా 
అందాల చందమామ అతనే దిగివస్తాడు 

చరణం 3: 

పడకూడదమ్మా పాపాయి మీద 
పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు 
పాపిష్టి కళ్ళల్లో పచ్చాకామెర్లు 
కోపిష్టి కళ్ళల్లో కొరివిమంటల్లు 

గోరింట పూచింది కొమ్మలేకుండా 
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది

ఎలా ఎలా దాచావు

చిత్రం: గోరింటాకు (1979)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: దేవులపల్లి
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం...ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ

ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం...ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ..
ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ....

చరణం 1:

పిలిచి పిలిచినా..పలుకరించినా ..పులకించదు కదా నీ ఎదా
ఉసురొసుమనినా...గుసగుసమనినా ఊగదేమది నీ మది...

నిదుర రాని నిశిరాతురులెన్నో...నిట్టూరుపులెన్నో...
నోరులేని ఆవేదనలెన్నో...ఆరాటములెన్నో...

ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం...ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ..
ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ....

చరణం 2:

తలుపులు తెరుచుకొని వాకిటనే నిలబడతారా ఎవరైనా?
తెరిచి ఉందనీ వాకిటి తలుపు... చొరబడతారా ఎవరైనా?

దొరవో... మరి దొంగవో
దొరవో... మరి దొంగవో
దొరికావు ఈనాటికీ....

దొంగను కానూ...దొరనూ కానూ..
దొంగను కానూ...దొరనూ కానూ...నంగనాచినసలే కానూ....

ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం...ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ

ఇలాగ వచ్చి అలాగ తెచ్చి

చిత్రం: గోరింటాకు (1979) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
గీతరచయిత: శ్రీశ్రీ 
నేపధ్య గానం: బాలు, సుశీల 

పల్లవి: 

ఇలాగ వచ్చి అలాగ తెచ్చి 
ఎన్నో వరాల మాలలు గుచ్చి 
నా మెడ నిండా వేశావు 
నన్నో మనిషిని చేశావు 
ఎలాగా తీరాలి నీ ఋణమెలాగ తీరాలి 

తీరాలంటే దారులు లేవా 
కడలి కూడా తీరం లేదా 
అడిగినవన్నీ ఇవ్వాలీ 
అడిగినప్పుడే ఇవ్వాలీ 
అలాగ తీరాలీ నా ఋణమలాగ తీరాలి 

చరణం 1: 

అడిగినప్పుడే వరమిస్తారు.. ఆకాశంలో దేవతలు 
అడగముందే అన్నీ ఇచ్చే.. నిన్నే పేరున పిలవాలీ 
నిన్నే తీరున.. కొలవాలీ 

అసలు పేరుతో నను పిలవద్దు 
అసలు కన్నా వడ్డీ ముద్దు 
ముద్దు ముద్దుగా ముచ్చట తీర 
పిలవాలీ.. నను కొలవాలీ 

అలాగ తీరాలీ.. నా ఋణమలాగ తీరాలీ 

చరణం 2: 

కన్నులకెన్నడూ కనగరానిది 
కానుకగా నేనడిగేదీ 

అరుదైనది నీవడిగేది 
అది నిరుపేదకెలా దొరికేది 
ఈ నిరుపేదకెలా దొరికేది 

నీలో ఉన్నది.. నీకే తెలియదు 
నీ మనసే నే కోరుకున్నది 

అది నీకెపుడో ఇచ్చేశానే 
నీ మదిలో అది చేరుకున్నదీ 

ఇంకేం?... 
ఇలాగ తీరిందీ.. మన ఋణమిలాగ తీరింది 
ఇలాగ తీరిందీ.. మన ఋణమిలాగ తీరింది