Tuesday, May 30, 2017

ఒక కొమ్మకు పూసిన పువ్వులం



చిత్రం : జీవన రాగం (1986)
సంగీతం : సత్యం
గీతరచయిత :
నేపధ్య గానం : బాలు, సుశీల 





పల్లవి : 


ఒక కొమ్మకు పూసిన పువ్వులం... అనురాగం మనదేలే
ఒక గూటిని వెలిగిన దివ్వెలం... మమకారం మనదేలే
చెల్లెమ్మా... నీవేను నా ప్రాణము
ఓ... చెల్లెమ్మా... నీ తోటిదే లోకము


ఒక కొమ్మకు పూసిన పువ్వులం... అనురాగం మనదేలే
ఒక గూటిని వెలిగిన దివ్వెలం... మమకారం మనదేలే
అన్నయ్యా... నీవేను నా ప్రాణము
ఓ... అన్నయ్యా... నీ తోటిదే లోకము



చరణం 1 :



నా చెల్లి నవ్వు సిరిమల్లిపువ్వు... పలికించె నాలో రాగాల వీణ
మా అన్న చూపు మేఘాల మెరుపు... కురిపించె నాలో పన్నీటి వాన


ఇది కరగని చెరగని కలగా ఎద నిలిచెనులే కలకాలం
చిరునవ్వుల వెన్నెల సిరిగా చిగురించునులే చిరకాలం


 ఈ బంధం... సాగేను ఏనాటికి
ఆ దైవం దీవించు ముమ్మాటికి



చరణం 2 :


మా ఇంటి పంటా... చిన్నారి చెల్లి... నా కంటిపాపా బంగారు తల్లి
ఈ చోట ఉన్నా... ఏ చోట ఉన్నా... ఎదలోన నిన్నే కొలిచేను అన్నా


మమకారం మనకే సొంతం... విడరానిది ఈ అనుబంధం
ఈ అన్నకు నేనే చెల్లి.... కావాలి మళ్ళి మళ్ళి


ఈ బంధం... సాగేను ఏనాటికి

ఆ దైవం దీవించు ముమ్మాటికి


ఒక కొమ్మకు పూసిన పువ్వులం... అనురాగం మనదేలే
ఒక గూటిని వెలిగిన దివ్వెలం... మమకారం మనదేలే
చెల్లెమ్మా... నీవేను నా ప్రాణము
అన్నయ్యా... నీ తోటిదే లోకము





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2705

3 comments:

  1. దయచేసి చూడగలరు.
    చరణం 1 :
    మా చెల్లి ..... సిరిమల్లె ......
    .........................
    .........................
    ......... చిగురించునులే ....

    ReplyDelete
    Replies
    1. దయచేసి చూడగలరు.
      పల్లవి:
      ఒక కొమ్మకు పూసిన పూవులం ...

      Delete
    2. కరక్ట్ చేశాను మహేష్ గారు! థాంక్స్ అండి.

      Delete