Wednesday, June 14, 2017

కందిరీగతో చెప్పాను రా

చిత్రం : కక్ష (1980)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత  : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల 

పల్లవి :

కందిరీగతో చెప్పాను రా... బూరె కాదు బుగ్గ ఇది కుట్టవద్దని
కుట్టినా ఎవరికీ చెప్పొద్దని..గోల చెయ్యొద్దని పరువు తియ్యొద్దని 

దొంగ చాటుగా వస్తానులే... బుగ్గ మీద కాటేసి పోతానులే
అడిగితే చెప్పుకో కందిరీగ అని... కాటు వేసిందని...  బుగ్గ వాచిందని
కందిరీగ తో చెప్పాను రా... దొంగ చాటుగా వస్తానులే  

చరణం 1 :

ఉండుండి గుండె దడదడమంటోంది రా...
ఆగాగి వయసు పెటపెటమంటోంది రా
దాన్ని ఆపేది ఎట్టా ... దీన్ని అణిచేది ఎట్టా
దాన్ని ఆపేది ఎట్టా ... దీన్ని అణిచేది ఎట్టా

ఊగూగి మనసు రెపరెపమంటున్నదే.. అహహ..
ఉత్తిత్తినే ఒళ్ళు చిమచిమలాడింది లే... అ.. హా...
దాన్ని తీర్చేది ఎట్టా... దీన్ని అర్చేది ఎట్టా
దాన్ని తీర్చేది ఎట్టా... దీన్ని అర్చేది ఎట్టా

కందిరీగతో చెప్పాను రా... బూరె కాదు బుగ్గ ఇది కుట్టవద్దని
కుట్టినా ఎవరికీ చెప్పొద్దని..గోల చెయ్యొద్దని పరువు తియ్యొద్దని 

అహా... దొంగ చాటుగా వస్తానులే... బుగ్గ మీద కాటేసి పోతానులే
అడిగితే చెప్పుకో కందిరీగ అని... కాటు వేసిందని బుగ్గ వాచిందని

చరణం 2 :

కళ్ళల్లో నీకు ఇల్లు ఒకటి కట్టానురా.. హోయ్ హోయ్
ఒళ్ళంతా కళ్లుగా నిన్ను ఎదురు చూశాను రా
కళ్ళల్లో నీకు ఇల్లు ఒకటి కట్టాను
ఒళ్ళంతా కళ్లుగా నిన్ను ఎదురు చూశాను రా
అద్దె ఇవ్వొద్దు నువ్వు... పొద్దుకో ముద్దు ఇవ్వు
అద్దె ఇవ్వొద్దు నువ్వు... పొద్దుకో ముద్దు ఇవ్వు

పొద్దుకో ముద్దని పద్దెవరు రాస్తారు లే..
వద్దన్నకొద్దీ ముద్దెక్కువ అవుతుందిలే
నీకు నెల తప్పకుండా... అద్దె నేనిచ్చుకుంటా
నీకు నెల తప్పకుండా... అద్దె నేనిచ్చుకుంటా

కందిరీగతో చెప్పాను రా... బూరె కాదు బుగ్గ ఇది కుట్టవద్దని
కుట్టినా ఎవరికీ చెప్పొద్దని..గోల చెయ్యొద్దని పరువు తియ్యొద్దని 

హొయ్ హొయ్... దొంగ చాటుగా వస్తానులే... బుగ్గ మీద కాటేసి పోతానులే
అడిగితే చెప్పుకో కందిరీగ అని... కాటు వేసిందని బుగ్గ వాచిందని

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2653

No comments:

Post a Comment