Thursday, June 1, 2017

మల్లెపువ్వు గిల్లింది

చిత్రం :  కొంగుముడి (1985)
సంగీతం :  బాలు
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, జానకి 

పల్లవి : 

మల్లెపువ్వు గిల్లింది... తెల్లచీర నవ్వింది
పైట జారిపోయింది... పాలపిట్ట  కూసింది
మల్లెపువ్వు గిల్లింది... తెల్లచీర నవ్వింది
పైట జారిపోయింది... పాలపిట్ట  కూసింది

పట్టెమంచం కిర్రుమన్నదిరా... చల్ మోహన రంగా
నీకు నాకు జోడు కుదిరెను పదరా... చల్ మోహన రంగా

చరణం 1 :

గాలికైనా సందులేని కౌగిలింతల్లో... కౌగిలింతల్లో
పూలు కూడా అత్తరయ్యే పులకరింతల్లో... పులకరింతల్లో
గాలికైనా సందులేని కౌగిలింతల్లో...
పూలు కూడా అత్తరయ్యే పులకరింతల్లో

మీగడంత ఒలకనివ్వే పాలపుంతల్లో...
జాజిపూలే జలకమాడే జలదరింతల్లో...

గుడ్డి దీపం గుబులు రేపెనురా... చల్ మోహన రంగా
నేను ఉంటే దీపమెందుకు పదరా... చల్ మోహన రంగా
నేను ఉంటే దీపమెందుకు పదరా... చల్ మోహన రంగా  

మల్లెపువ్వు గిల్లింది... తెల్లచీర నవ్వింది
పక్కనొచ్చి కూక్కుంటే...  పట్టుజారి పోయింది
తలుపు గడియా బిగుసుకున్నాదే... చల్ మోహన రంగి
నీకు నాకు జోడు కుదిరెను పదవే... చల్ మోహన రంగి
నీకు నాకు జోడు కుదిరెను పదవే...

చరణం 2 :

గోడలన్నీ గొడవ చూసి నవ్వుకుంటుంటే... నవ్వుకుంటుంటే
నీడ కూడా నిజము తెలిసి సిగ్గుపడుతుంటే... సిగ్గుపడుతుంటే
గోడలన్నీ గొడవ చూసి నవ్వుకుంటుంటే...
నీడ కూడా నిజము తెలిసి సిగ్గుపడుతుంటే

కిటికిటీలు కటకటాలు కిలుకుమంటుంటే 

సందు చూసి చందమామ తొంగి చూస్తుంటే

కోడి కూస్తే కొంప మునగదటే... చల్ మోహన రంగి

కోడి కోసి కూర తింద్దాం పదవే... చల్ మోహన రంగి

కోడి కోసి కూర తింద్దాం పదవే... 

మల్లెపువ్వు గిల్లింది... తెల్లచీర నవ్వింది
పైట జారిపోయింది... పాలపిట్ట  కూసింది
మల్లెపువ్వు గిల్లింది... తెల్లచీర నవ్వింది
పక్కనొచ్చి కూక్కుంటే...  పట్టుజారి పోయింది

పట్టెమంచం కిర్రుమన్నదిరా... చల్ మోహన రంగా
నీకు నాకు జోడు కుదిరెను పదరా... చల్ మోహన రంగి...
నీకు నాకు జోడు కుదిరెను పదవే...
 
No comments:

Post a Comment