Tuesday, June 27, 2017

లేత పచ్చ ఆకులు

చిత్రం :  కల్యాణ తాంబూలం (1971)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల




పల్లవి : 


లేత పచ్చ ఆకులు... ఊ..ఊ...
రేయి నల్లవక్కలు...ఊ.. ఊ..
వెన్నెలంటి సున్నం... ఊ..ఊ...
ఈ మూడు కలసి మెలిసి పండినప్పుడే...
తాంబూలం.. అరుణమందారం... అదే కల్యాణం



లేత పచ్చ ఆకులు... ఊ..ఊ...
రేయి నల్లవక్కలు...ఊ.. ఊ..
వెన్నెలంటి సున్నం... ఊ..ఊ...
ఈ మూడు కలసి మెలిసి పండినప్పుడే...
తాంబూలం.. అరుణమందారం... అదే కల్యాణం



చరణం 1 :



నీటిలోని కలువకి.. నింగిలోని జాబిలికి
ఏనాడో జరిగింది.. కవితాకల్యాణం


కడలిలోని ఉప్పుకి... అడవిలోని ఉసిరికి
ఏనాడో జరిగింది... రసరాకల్యాణం

రవికులజుడు రాముడికి.. భూమిపుత్రి సీతకి
జరిగిందీ... కల్యాణం...
లోకకల్యాణం... అదే దాంపత్యం... ఇదే తాంబూలం



లేత పచ్చ ఆకులు... ఊ..ఊ...
రేయి నల్లవక్కలు...ఊ.. ఊ..
వెన్నెలంటి సున్నం... ఊ..ఊ...
ఈ మూడు కలసి మెలిసి పండినప్పుడే...
తాంబూలం.. అరుణమందారం... అదే కల్యాణం



చరణం 2 :


పలుకుతల్లి చిలకకి... పడుచుగోరింకకి
జరుగుతోంది అనాదిగా మాటవరస కల్యాణం


రేయిపగలు రెంటిని... ఆలుమగలుగా చేసి
జరుగుతోంది ప్రతిరోజు సంధ్యాకల్యాణం


పసుపులాంటి పార్వతికి... సున్నమంటి శివుడికి...
జరిగింది పారాణి కల్యాణం... జరిగింది అ ఉ మ సంగమం


అ ఉ మ సంగమం... ఓం... ఓం... ఓం






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2714

No comments:

Post a Comment