Thursday, July 20, 2017

బ్రతుకున్న చచ్చినట్టే

చిత్రం :  మల్లెపువ్వు (1978)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు


పల్లవి :




ఏమి లోకం...  ఏమి స్వార్ధం
ఎక్కడున్నది మానవత్వం?? 


బ్రతుకున్న చచ్చినట్టే ఈ సంఘంలో...
చస్తేనే బ్రతికేది ఈ లోకంలో...
బ్రతుకున్న చచ్చినట్టే ఈ సంఘంలో...
చస్తేనే బ్రతికేది ఈ లోకంలో... 


నిజం నలిగిపోతోంది ధనం చేతిలో
నీల్గిమూల్గుతున్నది వల్లకాడిలో


బ్రతుకున్న చచ్చినట్టే ఈ సంఘంలో...
చస్తేనే బ్రతికేది ఈ లోకంలో... 



చరణం 1 :



మనుషులెందరున్నారు ఇందరిలో...
మనసనేది ఉన్నది ఎందరిలో
మనుషులెందరున్నారు ఇందరిలో...
మనసనేది ఉన్నది ఎందరిలో


ఒక్క మనసు బ్రతికున్నా... ఊరుకోదు మౌనంగా
రగిలి రగిలి మండుతుంది మహాజ్వాలగా... మహాజ్వాలగా


బ్రతుకున్న చచ్చినట్టే ఈ సంఘంలో...
చస్తేనే బ్రతికేది ఈ లోకంలో... 



చరణం 2 :



సాటిమనిషి చస్తున్నా జాలి పడని వీళ్ళు
లాభముంటే శవానైన పూజించే వీళ్ళు
సాటిమనిషి చస్తున్నా జాలి పడని వీళ్ళు
లాభముంటే శవానైన పూజించే వీళ్ళు



ఈ ఊసరవెళ్లులూ.. ఈ దగాకోరులూ
వీళ్ళే మన సంఘంలో పెద్దమనుషులు... చీడపురుగులు


బ్రతుకున్న చచ్చినట్టే ఈ సంఘంలో...
చస్తేనే బ్రతికేది ఈ లోకంలో... 



చరణం 3 :



మండిపోనీ... మసైపోనీ...
ధనమదాందులు... జరాదందులు
ఈ రాబందులు ఏలే లోకం... కాలిపోనీ
పేదల గుండెల నెత్తుటి కంటల పేరిచి కట్టిన కోటలన్నీ... కూలిపోనీ
కులాల పేరిట  మతాల పేరిట తరతరాలుగ చరిత్ర కుళ్ళు... మాసిపోనీ



శపిస్తుతున్నా... శాసిస్తున్నా... శపధం చేస్తున్నా
ఆగిపోదు ఈ గీతము... మూగపోదు ఈ కంఠము
ఇది ప్రళయం... ఇది విళయం
ఇది మహోదయం... 




ఆగిపోదు ఈ గీతము... మూగపోదు ఈ కంఠముఇది ప్రళయం... ఇది విళయంఇది మహోదయం...   





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2535



No comments:

Post a Comment