Tuesday, October 31, 2017

శ్రీరస్తు మదనా

చిత్రం :  సంపూర్ణ ప్రేమాయణం (1984)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల 




పల్లవి :



హుర్రే....
శ్రీరస్తు మదనా...  శృంగార వదనా
ఈ శీతాకాలం ఒంటిగ ఉండగలనా


ఓసిసి లలనా...  నేనొపగలనా
ఈ మాఘమాసం వెంట కట్టుకుందునా


టకచికి టకచికి టకచిటి టకచిటి.. ఠా
టకచికి టకచికి టకచిటి టకచిటి.. ఠా.. ఠా.. ఠా..



శ్రీరస్తు మదనా...  శృంగార వదనా
ఈ శీతాకాలం ఒంటిగ ఉండగలనా


ఓసిసి లలనా....  నేనొపగలనా
ఈ మాఘమాసం వెంట కట్టుకుందునా



టకచికి టకచికి టకచిటి టకచిటి.. ఠా
టకచికి టకచికి టకచిటి టకచిటి.. ఠా.. ఠా.. ఠా..




చరణం 1 : 




జారకుండా జారుపైట ఆపగలనా...
మానకుండా ఆరుబైట ఉంచగలనా...
వచ్చే ఈడు రాకుండా నేనాపగలనా...
తీరా వస్తే తీరకలేదు అనగలనా....


ఓ ఇందువదనా ఈనాటి భజన...
కౌగిళ్ళలో చేయాలమ్మ రాత్రి పొద్దున్న...
ఇద్దరు ఒకటై చేద్దామమ్మ ఎవ్వరు వద్దన్నా...



శ్రీరస్తు మదనా... నేనొపగలనా
ఈ శీతాకాలం ఒంటిగ ఉండగలనా
ఈ మాఘమాసం వెంట కట్టుకుందునా




చరణం 2 :



వేళా లేదు పాళా లేదు ఏమి తపనా...
వేళం వెర్రి ముదిరిపోయే ఎంత చెప్పినా...
పూటా పూటా వెయ్యలేను పూల వంతెనా...
రేపు మాపు తిప్పలాయే రెప్ప పండునా...


ఓ హంసగమన నీ మత్తు వలనా...
వేశానమ్మ వెన్నెల్లోనే వెండి నిచ్చెనా...
దగ్గర కొస్తే ముగ్గురమౌతాం... తానాతందానా...



శ్రీరస్తు మదనా...  శృంగార వదనా
ఈ శీతాకాలం ఒంటిగ ఉండగలనా
ఓసిసి లలనా...  నేనొపగలనా
ఈ మాఘమాసం వెంట కట్టుకుందునా



టకచికి టకచికి టకచిటి టకచిటి.. ఠా
టకచికి టకచికి టకచిటి టకచిటి.. ఠా.. ఠా.. ఠా..






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2177


No comments:

Post a Comment