Tuesday, October 31, 2017

అమ్మ ప్రేమకు మారు పేరు

చిత్రం :  రామబాణం (1979)
సంగీతం :  సత్యం
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు 


పల్లవి :


అమ్మ... ప్రేమకు మారు పేరు
అమ్మ మనసు పూలతేరు
అమ్మ ప్రేమకు మారు పేరు
అమ్మ మనసు పూలతేరు


ఆ పేరు నీడ సోకగానే...  నూరు జన్మల సేదతీరు 


చరణం 1 :


మండువేసవిలో ముంగిట వెలసిన... మంచుకొండ మా అమ్మ
పవలురేయి ఆరక వెలిగే పరంజ్యోతి మా అమ్మ
ఆలనకైనా పాలనకైనా... 
ఆలనకైనా పాలనకైనా... ఆదిదేవత మా అమ్మ



అమ్మ ప్రేమకు మారు పేరు
అమ్మ మనసు పూలతేరు



చరణం 2 :



జన్మజన్మలా పున్నెము వలన... నీ కమ్మని కడుపున పుట్టాను
మళ్ళీ జన్మలు ఎన్నున్నా...  నా తల్లివి నీవే అంటాను
కలలోనైనా మెలకువనైనా...
కలలోనైనా మెలకువనైనా...  నీ దీవనలే కోరుకుంటాను 



అమ్మ ప్రేమకు మారు పేరు
అమ్మ మనసు పూలతేరు
ఆ పేరు నీడ సోకగానే...  నూరు జన్మల సేదతీరు 
అమ్మ ప్రేమకు మారు పేరు
అమ్మ మనసు పూలతేరు 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=6639




No comments:

Post a Comment