Tuesday, October 31, 2017

కొమ్మలో కోయిల సరిగమలు

చిత్రం :  సంసారం (1988) 

సంగీతం :  రాజ్-కోటి  

గీతరచయిత : 

నేపధ్య గానం : బాలు, సుశీల 


పల్లవి :


కొమ్మలో కోయిల సరిగమలు..

కోరికల మల్లెల ఘుమ ఘుమలు..

ఆరాధనంతా ఆలాపనైతే పాడుకున్న పాటలీవేళ

రచించే శుభలేఖ.. ఫలించే కలలింకా


కొమ్మలో కోయిల సరిగమలు..

కోరికల మల్లెల ఘుమ ఘుమలు..

ఆరాధనంతా ఆలాపనైతే పాడుకున్న పాటలీవేళ

రచించే శుభలేఖ.. ఫలించే కలలింకా



కొమ్మలో కోయిల సరిగమలు..

కోరికల మల్లెల ఘుమ ఘుమలు..




చరణం 1 : 



 కంటి కలలే ఏటి అలలై

కంటి కలలే ఏటి అలలై

తీరాలు దాటాయి రాగాలతో.... 

తీరాలు కలిసాయి కౌగిళ్ళలో....


కన్నె గాలి పెట్టుకున్న పూలమోగ్గులో..

తుమ్మె దొచ్చి అంటుకుంది ఎన్ని తేనెలో


ఆ దాహమే ఈ స్నేహమై పండింది ఇన్నాళ్ళకి..

ఇదేలే శుభవేళా..ఎదల్లో రసలీలా


కొమ్మలో కోయిల సరిగమలు..

కోరికల మల్లెల ఘుమ ఘుమలు.. 



చరణం 2 :



 కన్నె ఒడిలో ప్రేమ గుడిలో.... 

కన్నె ఒడిలో ప్రేమ గుడిలో.... 

నే హారతిస్తాను అందాలనే...  నే హారమేస్తాను ప్రాణాలనే..


చేయి మీద పెట్టుకున్న లేత ముద్దుల్లో..

గాజులమ్మ నవ్వుకున్న మోజు మద్దెల్లో..


నా పల్లకీ సాగాలిలే... నీ చైత్ర గీతాలతో..

అందాకా సెలవింకా...  సరేలే గోరింకా..


కొమ్మలో కోయిల సరిగమలు..

కోరికల మల్లెల ఘుమ ఘుమలు..

ఆరాధనంతా ఆలాపనైతే...  పాడుకున్న పాటలీవేళ

రచించే శుభలేఖ...  ఫలించే కలలింకా






1 comment:

  1. ఈ పాటంటే నాకు చాలా ఇష్టం

    ReplyDelete