Tuesday, November 7, 2017

పాలు కావాలా

చిత్రం  :  వంశగౌరవం (1982)
సంగీతం  :  చక్రవర్తి
గీతరచయిత  :  వేటూరి
నేపధ్య గానం  :  బాలు, సుశీల 





పల్లవి : 




పాలు కావాలా...ఆ...  పండు కావాలా... ఆ..
లాల పొయ్యాలా...ఆ..  జోల పాడాలా.. ఆ
పొద్దునిద్దరోయే వేళా... ముద్దు ఇద్దరయ్యే వేళా
నాలో నీలో ఊగే పూల ఉయ్యాలా




పాలు కావాలా...ఆ...  పండు కావాలా... ఆ..
లాల పొయ్యాలా...ఆ..  జోల పాడాలా.. ఆ
పొద్దునిద్దరోయే వేళా... ముద్దు ఇద్దరయ్యే వేళా
నాలో నీలో ఊగే పూల ఉయ్యాలా



పాలు కావాలా...ఆ...  పండు కావాలా... ఆ..
లాల పొయ్యాలా...ఆ..  జోల పాడాలా.. ఆ 





చరణం 1 :


రెట్టింపు ఫలమిచ్చే నట్టింటి దేవత...
వ్రతమేమో సంసారమంటా... వరమిస్తే సంతానమంటా 



లాలించి పాలించే నా ఇంటి దేవుడు...
అడిగింది అనురాగమంటా... ఇచ్చింది అందాల జంటా



పత్రమో... పుష్పమో... ఫలమో మరి ఇమ్మంటా
అల్లరి నా పాపా... అంత తొందర వద్దంటా.. ఆ
అంత తొందర వద్దంటా.. ఆ



పాలు కావాలా...ఆ...  పండు కావాలా... ఆ..
లాల పొయ్యాలా...ఆ..  జోల పాడాలా.. ఆ
పొద్దునిద్దరోయే వేళా... ముద్దు ఇద్దరయ్యే వేళా
నాలో నీలో ఊగే పూల ఉయ్యాలా



పాలు కావాలా...ఆ...  పండు కావాలా... ఆ..
లాల పొయ్యాలా...ఆ..  జోల పాడాలా.. ఆ 



చరణం 2 :



మొగవారి పొరపాట్లు మనసైన అగచాట్లు...
పాపళ్లు చూస్తేనే తంటా... తాపాలు ఇక ఆపమంటా


కీడించి మేలెంచే నా ఇంటి ఇల్లాలు...
అలిగేది తానొక్క కంటా... వలపించు వేరొక్క కంటా



అల్లరి... ఆ... ఆగడం... ఆ సరసాలిక చాలంటా...
ముద్దుల నా పాప... నాకు నిద్దర రాదంటా...
నాకు పొద్దేపోదంటా.. అహహా



పాలు కావాలా...ఆ...  పండు కావాలా... ఆ..
లాల పొయ్యాలా...ఆ..  జోల పాడాలా.. ఆ
పొద్దునిద్దరోయే వేళా... ముద్దు ఇద్దరయ్యే వేళా
నాలో నీలో ఊగే పూల ఉయ్యాలా



పాలు కావాలా...ఆ...  పండు కావాలా... ఆ..
లాల పొయ్యాలా...ఆ..  జోల పాడాలా.. ఆ 






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2765

No comments:

Post a Comment