Wednesday, November 8, 2017

ఊయలలూగీ నా హృదయం

చిత్రం :  అభిమానం (1959)
సంగీతం :  ఘంటసాల
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపధ్య గానం :  ఘంటసాల, జిక్కి పల్లవి :


ఊయలలూగీ నా హృదయం... తీయని పాట పాడేనే
ఊయలలూగీ నా హృదయం...  


తీయని పాట పాడేనే...  ఊయలలూగీ నా హృదయం


చరణం 1 :తీవలతో సరాగాల తేలీ... పూవులతో సయ్యాటాడె గాలీ
తీవలతో సరాగాల తేలీ... పూవులతో సయ్యాటాడె గాలీ


ఎలమావి చేరీ....  చివురాకు మేసీ
ఎలమావి చేరీ....  చివురాకు మేసీ... కోయిల చనవుగ కూసేనే ఊయలలూగీ నా హృదయం... తీయని పాట పాడేనే
ఊయలలూగీ నా హృదయం...  


చరణం 2 : రాగసుధాతరంగాల డోలా...  వేడుకలా విహారాల వేళా
రాగసుధాతరంగాల డోలా...  వేడుకలా విహారాల వేళా


చిన్నారి చెలియా...  విన్నానమరయా
చిన్నారి చెలియా...  విన్నానమరయా
నా మది పరవశమాయేనే....  ఊయలలూగీ నా హృదయం... తీయని పాట పాడేనే
ఊయలలూగీ నా హృదయం...  

No comments:

Post a Comment