Wednesday, December 20, 2017

నీకోసం వెలిసింది

చిత్రం : ప్రేమనగర్ (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల



పల్లవి :


నీకోసం...
నీకోసం...


నీకోసం వెలిసింది ప్రేమ మందిరం
నీకోసం విరిసింది హృదయ నందనం
నీకోసం వెలిసింది ప్రేమ మందిరం
నీకోసం విరిసింది హృదయ నందనం


నీకోసం వెలిసింది ప్రేమ మందిరం



చరణం 1 :


ప్రతి పువ్వు నీ నవ్వే నేర్చుకున్నది
ప్రతి తీగ నీ ఒంపులు తెంచుకున్నది 


ప్రతి పాదున నీ మమతే పండుతున్నది
ప్రతి పందిరి నీ మగసిరి చాటుతున్నది 


నీకోసం విరిసింది హృదయ నందనం
నీకోసం వెలిసింది ప్రేమ మందిరం



చరణం 2 :



అలుపు రాని వలపును ఆదుకునే దిక్కడ
చెప్పలేని తలపులు చేతలయే దిక్కడ 


చెడిపోని బంధాలు వేసుకునేదిక్కడ
తొలిచే మీ అనుభవాలు తుది చూసేదిక్కడ

ఆ.. ఆ.. ఆ.. ఓ..ఓ..ఓ..ఆహహహా..ఓ..ఓ..ఓ... 


నీకోసం వెలిసింది ప్రేమ మందిరం


చరణం 3 :


కలలెరుగని మనసుకు కన్నెరికం చేశావు
శిల వంటి మనిషిని శిల్పంగా చేశావు


తెరవని నా గుడి తెరిచి దేవివై వెలిశావు
నువ్ మలచిన ఈ బతుకు నీకే నైవేద్యం 

ఆ.. ఆ.. ఆ.. ఓ..ఓ..ఓ..ఆహహహా..ఓ..ఓ..ఓ... 


నీకోసం వెలిసింది ప్రేమ మందిరం
నీకోసం విరిసింది హృదయ నందనం

నీకోసం వెలిసింది ప్రేమ మందిరం

నీకోసం...
నీకోసం...




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1679

1 comment:

  1. ఎంత గొప్ప పాటండీ!
    అంత గొప్ప ఈ పాటలో ఏముందండీ?
    మాటలూ మామూలువే,భావాలూ మామూలువే,
    బహుశః అత్రేయ ప్రేమలో ఉన్న నిజాయితీ మహత్యం కాబోలు!

    ReplyDelete