Friday, December 29, 2017

నమో నమో నటరాజ నమో






చిత్రం :  నాగుల చవితి (1956)
సంగీతం :  సుదర్శనం-గోవర్థనం
గీతరచయిత : పరశురాం
నేపథ్య గానం :  భగవతి 



పల్లవి :


ఓం నమఃశ్శివాయః ఓం నమఃశ్శివాయః
ఓం నమఃశ్శివాయః ఓం నమఃశ్శివాయః


ఓం నమో నమో నటరాజ నమో
హర జటాజూటధర శంభో
ఓం నమో నమో నటరాజ
నమో నమో నటరాజ


ఓం నమో నమో నటరాజ నమో
హర జటాజూటధర శంభో
ఓం నమో నమో నటరాజ
నమో నమో నటరాజ  




చరణం 1 : 



గంగా గౌరి హృదయ విహారి
గంగా గౌరి హృదయ విహారి
లీలా కల్పిత సంసారి
లీలా కల్పిత సంసారి
గంగా గౌరి హృదయ విహారి
లీలా కల్పిత సంసారి
భళిరే భాసుర బ్రహ్మచారి
భళిరే భాసుర బ్రహ్మచారి
భావజ మద సంహారి
భావజ మద సంహారి 


ఓం నమో నమో నటరాజ నమో
హర జటాజూటధర శంభో
ఓం నమో నమో నటరాజ
నమో నమో నటరాజ




చరణం 2 : 



ఫణిభూషా భిక్షుక వేషా
ఫణిభూషా భిక్షుక వేషా
ఈశా త్రిభువన సంతోషా
ఈశా త్రిభువన సంతోషా
అఖిలచరాచర అమృతకారీ
అఖిలచరాచర అమృతకారీ
హాలాహల గళధారి
హాలాహల గళధారి


ఓం నమో నమో నటరాజ నమో
హర జటాజూటధర శంభో
ఓం నమో నమో నటరాజ
నమో నమో నటరాజ


చరణం 3 : 


మహాదేవ జయ జయ శివశంకర... జయ శివశంకర
జయ త్రిశూలధర జయ డమరుక ధర... జయ డమరుక ధర
హే దేవాది దేవ మహేశ జయజయ  గౌరీశా
హే దేవాది దేవ మహేశ జయజయ  గౌరీశా
జయజయ శ్రీ గౌరీశా 


ఓం నమో నమో నటరాజ
నమో హర జటాజూటధర శంభో
ఓం నమో నమో నటరాజ
నమో నమో నటరాజ
ఓం నమో నమో నటరాజ
నమో నమో నటరాజ


ఓం నమఃశ్శివాయః ఓం నమఃశ్శివాయః
ఓం నమఃశ్శివాయః ఓం నమఃశ్శివాయః





No comments:

Post a Comment