స్వరాల పల్లకి
Guest Book
[Sign My Guestbook]
[View My Guestbook]
Powered by E-Guestbooks Server
.
Tuesday, December 19, 2017
ఊరు మారినా ఉనికి మారునా
చిత్రం : మూగనోము (1969)
సంగీతం : ఆర్. గోవర్ధన్
గీతరచయిత : ఆరుద్ర
నేపథ్య గానం : ఘంటసాల
పల్లవి :
ఊరు మారినా... ఉనికి మారునా
మనిషి దాగినా... మమత దాగునా
ఊరు మారినా... ఉనికి మారునా
మనిషి దాగినా... మమత దాగునా
మరలిరాని పయనంలో... మజిలీ లేదు
ఆడదాని కన్నీటికి అంతేలేదు
ఊరు మారినా... ఉనికి మారునా
మనిషి దాగినా... మమత దాగునా
చరణం 1 :
అనురాగ దీపం... అసమాన త్యాగం
స్త్రీజాతి కొరకే సృజియించె దైవం
చిరునవ్వులన్నీ... పెరవారికొసగి
చీకటులలోనే జీవించు యువతి
తలపులే వీడవు... వీడేది మనిషే
వలపులే వాడవు... వాడేది తనువే
ఊరు మారినా... ఉనికి మారునా
మనిషి దాగినా... మమత దాగునా
చరణం 2 :
మగవానికేమో... ఒకనాటి సుఖమూ
కులకాంతకదియే... కలకాల ధనమూ
తనవాడు వీడా ... అపవాదు తోడా
పదినెలలమోతా... చురకత్తి కోతా
సతులకే ఎందుకు ఈ ఘోరశిక్ష
సహనమే స్త్రీలకూ... శ్రీరామరక్ష
ఊరు మారినా... ఉనికి మారునా
మనిషి దాగినా... మమత దాగునా
ఊరు మారినా... ఉనికి మారునా
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment