Showing posts with label ఆర్. గోవర్ధన్. Show all posts
Showing posts with label ఆర్. గోవర్ధన్. Show all posts

Tuesday, September 11, 2018

పచ్చని చెట్టు ఒకటి

చిత్రం : రాము (1968)
సంగీతం :  ఆర్. గోవర్ధన్
గీతరచయిత :  ఆరుద్ర
నేపథ్య గానం :  సుశీల 


పల్లవి :


పచ్చని చెట్టు ఒకటి
వెచ్చని చిలకలు రెండు
పాటలు పాడి జోకొట్టాలి జో.. జో.. జో


పచ్చని చెట్టు ఒకటి
వెచ్చని చిలకలు రెండు
పాటలు పాడి జోకొట్టాలి జో.. జో.. జో



చరణం 1 :



చల్లని పలుకుల తల్లి... చక్కని నవ్వుల తండ్రి
కమ్మని నోముల పంట నేనే సుమా
చల్లని పలుకుల తల్లి... చక్కని నవ్వుల తండ్రి
కమ్మని నోముల పంట నేనే సుమా


ఇద్దరి బుగ్గల మీదా ముద్దుల మూటలు కడితే
ఇంపుగ నిదుర పోవాలి జో.. జో.. జో
ఇద్దరి బుగ్గల మీదా ముద్దుల మూటలు కడితే
ఇంపుగ నిదుర పోవాలి జో.. జో.. జో


పచ్చని చెట్టు ఒకటి
వెచ్చని చిలకలు రెండు
పాటలు పాడి జోకొట్టాలి జో.. జో.. జో



చరణం 2 :



చిట్టి చిలక పలకా... చిలక తల్లి కులకా
చిలక రాజు చెట్లచాటున వెతకాలి
చిట్టి చిలక పలకా... చిలక తల్లి కులకా
చిలక రాజు చెట్లచాటున వెతకాలి


చల్లగ మురిసే వేళ చాటుగ మసలే వేళ
ఎల్లరు కళకళలాడాలి జో.. జో.. జో
చల్లగ మురిసే వేళ చాటుగ మసలే వేళ
ఎల్లరు కళకళలాడాలి జో.. జో.. జో


పచ్చని చెట్టు ఒకటి
వెచ్చని చిలకలు రెండు
పాటలు పాడి జోకొట్టాలి జో.. జో.. జో
పాటలు పాడి జోకొట్టాలి జో.. జో.. జో
పాటలు పాడి జోకొట్టాలి జో.. జో.. జో





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=160

Tuesday, December 19, 2017

ఊరు మారినా ఉనికి మారునా

చిత్రం :  మూగనోము (1969)
సంగీతం :  ఆర్. గోవర్ధన్
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  ఘంటసాల



పల్లవి :


ఊరు మారినా...  ఉనికి మారునా
మనిషి దాగినా...  మమత దాగునా
ఊరు మారినా...  ఉనికి మారునా
మనిషి దాగినా...  మమత దాగునా


మరలిరాని పయనంలో...  మజిలీ లేదు
ఆడదాని కన్నీటికి అంతేలేదు 


ఊరు మారినా...  ఉనికి మారునా
మనిషి దాగినా...  మమత దాగునా



చరణం 1 :


అనురాగ దీపం...  అసమాన త్యాగంస్త్రీజాతి కొరకే సృజియించె దైవంచిరునవ్వులన్నీ...  పెరవారికొసగిచీకటులలోనే జీవించు యువతి


తలపులే వీడవు...  వీడేది మనిషేవలపులే వాడవు...  వాడేది తనువే


ఊరు మారినా...  ఉనికి మారునామనిషి దాగినా...  మమత దాగునా




చరణం 2 : 




మగవానికేమో... ఒకనాటి సుఖమూ
కులకాంతకదియే...  కలకాల ధనమూ
తనవాడు వీడా ... అపవాదు తోడా
పదినెలలమోతా...  చురకత్తి కోతా


సతులకే ఎందుకు ఈ ఘోరశిక్ష
సహనమే స్త్రీలకూ...  శ్రీరామరక్ష



ఊరు మారినా...  ఉనికి మారునా
మనిషి దాగినా...  మమత దాగునా
ఊరు మారినా...  ఉనికి మారునా




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1159

Tuesday, August 26, 2014

రా రా కృష్ణయ్యా

చిత్రం : రాము (1968)
సంగీతం : ఆర్. గోవర్ధన్
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : ఘంటసాల


పల్లవి :


దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడూ
దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు
ఆకలికి అన్నమూ వేదనకు ఔషధం
పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనసా


రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా
దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా
రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా
దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా
రా రా కృష్ణయ్యా రా రా.....



చరణం 1:


మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా ఎదురుచూచు కన్నులలో కదిలేవయ్యా
మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా ఎదురుచూచు కన్నులలో కదిలేవయ్యా
పేదలమొరలాలించే విభుడవు నీవే కోరిన వరములనొసగే వరదుడ వీవే
పేదలమొరలాలించే విభుడవు నీవే కోరిన వరములనొసగే వరదుడ వీవే
అజ్ఞానపు చీకటికీ దీపము నీవే అన్యాయమునెదిరించే ధర్మము నీవే
నీవే కృష్ణా... నీవే కృష్ణా... నీవే కృష్ణా


రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా
దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా
రా రా కృష్ణయ్యా..... రా రా కృష్ణయ్యా



చరణం 2 :


కుంటివాని నడిపించే బృందావనం గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం
కుంటివాని నడిపించే బృందావనం గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం
మూఢునికీ జ్ఞానమొసగు బృందావనం మూగవాని పలికించే బృందావనం
మూఢునికీ జ్ఞానమొసగు బృందావనం మూగవాని పలికించే బృందావనం
అందరినీ ఆదరించు సన్నిధానం అభయమిచ్చి దీవించే సన్నిధానం
సన్నిధానం... దేవుని.. సన్నిధానం.. సన్నిధానం


రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా
దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా
రా రా కృష్ణయ్యా.....
కృష్ణా కృష్ణా రా రా కృష్ణా



చరణం 3 :


కరుణించే చూపులతో కాంచవయ్యా శరణొసగే కరములతో కావవయ్యా
కరుణించే చూపులతో కాంచవయ్యా శరణొసగే కరములతో కావవయ్యా
మూగవాని పలికించి బ్రోవవయ్యా కన్నతల్లి స్వర్గములో మురిసేనయ్యా
మూగవాని పలికించి బ్రోవవయ్యా కన్నతల్లి స్వర్గములో మురిసేనయ్యా
నిన్ను చూసి బాధలన్ని మరిచేనయ్యా ఆధారము నీవేరా రా రా కృష్ణా
నిన్ను చూసి బాధలన్ని మరిచేనయ్యా ఆధారము నీవేరా రా రా కృష్ణా


కృష్ణా కృష్ణా రా రా కృష్ణా
రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా
దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా
రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా



మామిడికొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే

చిత్రం : రాము (1968)
సంగీతం : ఆర్. గోవర్ధన్
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం :  సుశీల


పల్లవి :


మామిడికొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే
మాటలు రాని కోయిలమ్మ పాడునులే
ఆనందంతో... అనురాగంతో... నా మది ఆడునులే


మామిడికొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే.. ఏ ఏ...
మాటలు రాని కోయిలమ్మ పాడునులే.. ఏ ఏ..
ఆనందంతో... అనురాగంతో... నా మది ఆడునులే



చరణం 1:


నన్నే నీవు అమ్మ అన్న  నాడు
మీ నాన్న మనసు గంతులు వేసి ఆడు
నన్నే నీవు అమ్మ అన్న నాడు
మీ నాన్న మనసు గంతులు వేసి ఆడు


మంచికాలం.. మరలా రాదా... ముళ్లబాటే.. పూలతోట
ఆనందంతో... అనురాగంతో... నా మది ఆడునులే..


మామిడికొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే....
మాటలు రాని కోయిలమ్మ పాడునులే....
ఆనందంతో... అనురాగంతో... నా మది ఆడునులే  


చరణం 2:


గూటిలోని పావురాలు.. మూడు
అవి గొంతు కలిపి తీయని పాట.. పాడు
గూటిలోని పావురాలు.. మూడు
అవి గొంతు కలిపి తీయని పాట.. పాడు
మంచు తెరలు.. తొలగిపోయి ...పండువెన్నెల.. కాయునులే
ఆనందంతో... అనురాగంతో... నా మది ఆడునులే

మామిడికొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే....

మాటలు రాని కోయిలమ్మ పాడునులే....
ఆనందంతో... అనురాగంతో... నా మది ఆడునులే  


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=161

మంటలు రేపే నెలరాజా

చిత్రం : రాము (1968)
సంగీతం :  ఆర్. గోవర్ధన్
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం : ఘంటసాల



పల్లవి :


మంటలు రేపే నెలరాజా.. ఈ తుంటరి తనము నీకేలా

మంటలు రేపే నెలరాజా.. ఈ తుంటరి తనము నీకేలా

వలపులు రేపే విరులారా.. ఈ శిలపై రాలిన ఫలమేమీ

మంటలు రేపే నెలరాజా.. ఈ తుంటరి తనము నీకేలా



చరణం 1:


ఆకాశానికి అంతుందీ.. నా ఆవేదనకు అంతేదీ
ఆకాశానికి అంతుందీ.. నా ఆవేదనకు అంతేదీ
మేఘములోనా మెరుపుంది.. నా జీవితమందునా వెలుగేది
మంటలు రేపే నెలరాజా.. ఈ తుంటరి తనము నీకేలా



చరణం 2 :


తీగలు తెగిన వీణియపై... ఇక తీయని రాగం పలికేనా
తీగలు తెగిన వీణియపై... ఇక తీయని రాగం పలికేనా
ఇసుక ఎడారిని ఎపుడైనా... ఒక చిన్న గులాబి విరిసేనా
మంటలు రేపే నెలరాజా... ఈ తుంటరి తనము నీకేలా


చరణం 3 :


మదిలో శాంతిలేనపుడు... ఈ మనిషిని దేవుడు చేసాడు
సుఖము శాంతి ఆనందం... నా నొసటను వ్రాయుట మరిచాడు


మంటలు రేపే నెలరాజా... ఈ తుంటరి తనము నీకేలా
వలపులు రేపే విరులారా... ఈ శిలపై రాలిన ఫలమేమీ
మంటలు రేపే నెలరాజా... ఈ తుంటరి తనము నీకేలా



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=159

Thursday, August 7, 2014

నిజమైనా... కలయైనా

చిత్రం :  మూగనోము (1969)
సంగీతం : ఆర్. గోవర్ధన్
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  ఘంటసాల



పల్లవి :


నిజమైనా... కలయైనా... నిరాశలో.. ఒకటేలే
పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేలే...


నిజమైనా... కలయైనా... నిరాశలో ఒకటేలే...ఒకటేలే


చరణం 1 :


పదే పదే ఎవరినో పరాకుగా పిలిచేను
పదే పదే ఎవరినో పరాకుగా పిలిచేను
నా నీడే నా తోడై జగమంతా తిరిగేను


నిజమైనా... కలయైనా... నిరాశలో.. ఒకటేలే
పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేలే...ఒకటేలే


చరణం 2 :


గులాబినై నీ జడలో మురిసానే ఆ నాడు
గులాబినై నీ జడలో మురిసానే ఆ నాడు
బికారినై నీ కోసం వెతికానే ఈనాడు


నిజమైనా... కలయైనా... నిరాశలో.. ఒకటేలే
పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేలే....ఒకటేలే


చరణం 3 :


చెలి చెలి నా మదిలో చితులెన్నో రగిలేను
చెలి చెలి నా మదిలో చితులెన్నో రగిలేను
చెలిలేని నాకేమో విషాదమే మిగిలేను


నిజమైనా... కలయైనా... నిరాశలో.. ఒకటేలే
పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేలే....ఒకటేలే




తల్లివి నీవే త౦డ్రివి నీవే

చిత్రం :  మూగనోము (1969)
సంగీతం : ఆర్. గోవర్ధన్
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  సుశీల



పల్లవి :


తల్లివి నీవే త౦డ్రివి నీవే
తల్లివి నీవే త౦డ్రివి నీవే
చల్లగ కరుణి౦చే దైవము నీవే


తల్లివి నీవే త౦డ్రివి నీవే
చల్లగ కరుణి౦చే దైవము నీవే


చరణం 1 :


వేడుకున్న దయతలచే వే౦కటరమణా
తోడునీడవై మాపై చూపుము కరుణా
వే౦కటరమణా వే౦కటరమణా
వేడుకున్న దయతలచే వే౦కటరమణా
తోడునీడవై మాపై చూపుము కరుణా
నీకన్న మాకెవరు లేనేలేరు
నీదీవెనలే మాకు చాలు వే౦కటరమణా
వే౦కటరమణా వే౦కటరమణా


తల్లివి నీవే త౦డ్రివి నీవే
చల్లగ కరుణి౦చే దైవము నీవే
తల్లివి నీవే త౦డ్రివి నీవే


చరణం 2 :


గాలిలోన దీపములా ఉన్నామయ్యా
నీజాలివల్లనే వెలుగు నిలిచేనయ్యా
వే౦కటరమణా వే౦కటరమణా
గాలిలోన దీపములా ఉన్నామయ్యా
నీజాలివల్లనే వెలుగు నిలిచేనయ్యా
నీ పూజ కొరకు పూచిన పువ్వులమయ్యా
నీ పాదాలే మాకు శరణు వే౦కటరమణా
వే౦కటరమణా వే౦కటరమణా


తల్లివి నీవే త౦డ్రివి నీవే
చల్లగ కరుణి౦చే దైవము నీవే
తల్లివి నీవే త౦డ్రివి నీవే


ఈ వేళ నాలో ఎందుకో ఆశలు

చిత్రం :  మూగనోము (1969)
సంగీతం : ఆర్. గోవర్ధన్
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల



పల్లవి :


ఈ వేళ నాలో ఎందుకో ఆశలు... లోలోన ఏవో విరిసెలే వలపులు
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు... లోలోన ఏవో విరిసెలే వలపులు


నీలోని ఆశలన్నీ నా కోసమే... నా పిలుపే నీలో వలపులై విరిసెలే
నీలోని ఆశలన్నీ నా కోసమే... నా పిలుపే నీలో వలపులై విరిసెలే


చరణం 1 :


నీ చూపులో స్వర్గమే తొంగి చూసే.. నీ మాటలో మధువులే పొంగిపోయే
నీ చూపులో స్వర్గమే తొంగి చూసే.. నీ మాటలో మధువులే పొంగిపోయే


నాలోని ఆణువణువు నీదాయెలే..
బ్రతుకంతా నీకే అంకితం చేయనా..


నీలోని ఆశలన్నీ నా కోసమే.. నా పిలిపే నీలో వలపులై విరిసెలే..
లా ... లాలలా... లలలా... లా...


చరణం 2 :


నీ రూపమే గుండెలో నిండిపోయే... నా స్వప్నమే నేటితో పండిపోయే
నీ రూపమే గుండెలో నిండిపోయే... నా స్వప్నమే నేటితో పండిపోయే


ఉయ్యాల జంపాల ఊగేములే..
కలకాలం మనకు ప్రేమయే ప్రాణము..


ఈ వేళ నాలో ఎందుకో ఆశలు.. లోలోన ఏవో విరిసెలే వలపులు
లా ...లా ...లా ... లాలలా లాలలా... ఊ హూ హు..


Wednesday, March 19, 2014

సుందరాంగ అందుకోరా

చిత్రం :  భూకైలాస్ (1958)
సంగీతం : ఆర్. సుదర్శన్, ఆర్. గోవర్ధన్
గీతరచయిత :  సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం:  ఘంటసాల, సుశీల


పల్లవి:


సుందరాంగ అందుకోరా.. సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని.. ఆనంద లోకాలు చూపింతురా
ఆనంద లోకాలు చూపింతురా..
సుందరాంగ అందుకోరా.. సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని.. ఆనంద లోకాలు చూపింతురా
ఆనంద లోకాలు చూపింతురా...


చరణం 1:


కేలు కేలగొని మేనులేకముగ ఏకాంత సీమలలో
మది సంతాపమారగ.. సంతోషమురెగ చెంత చేర రారా
కేలు కేలగొని మేనులేకముగ ఏకాంత సీమలలో
మది సంతాపమారగ.. సంతోషమురెగ చెంత చేర రారా
సుందరాంగ అందుకోరా.. సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని.. ఆనంద లోకాలు చూపింతురా
ఆనంద లోకాలు చూపింతురా


చరణం 2:


యోగము చేదు విరాగము చేదు.. అనురాగమే మధురం
చాలు సాధన విడవోయి వేదన.. సంతోషాబ్దికి పోదము
యోగము చేదు విరాగము చేదు.. అనురాగమే మధురం
చాలు సాధన విడవోయి వేదన.. సంతోషాబ్దికి పోదము
అట రంగారు బంగారు మీనాలమై.. చవులూరింతు క్రొందేనె జుర్రాడుదాం
అట రంగారు బంగారు మీనాలమై..  చవులూరింతు క్రొందేనె జుర్రాడుదాం
ఏలాడుదాం ఓలాడుదాం ముదమార తనివీర ఈదాడుదాం
ముదమార తనివీర ఈదాడుదాం
సుందరాంగ అందుకోరా.. సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని ఆనంద లోకాలు చూపింతురా
ఆనంద లోకాలు చూపింతురా...


సుందరాంగ అందుకోరా... సుందరాంగ అందుకోరా
సుందరాంగ అందుకోరా... సుందరాంగ అందుకోరా
సుందరాంగ అందుకోరా... సుందరాంగ అందుకోరా
సుందరాంగ అందుకోరా... సుందరాంగ అందుకోరా
సుందరాంగ అందుకోరా... సుందరాంగ అందుకోరా
సుందరాంగ... సుందరాంగ.. సుందరాంగ...
ఓం నమశ్శివాయ.. ఓం నమశ్శివాయ.. ఓం నమశ్శివాయ..


రాముని అవతారం

చిత్రం :  భూకైలాస్ (1958)
సంగీతం : ఆర్. సుదర్శన్, ఆర్. గోవర్ధన్
గీతరచయిత :  సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం :  ఘంటసాల


సాకీ : 


ద్వారపాలుర మరల దరిదీయు కృపయో...
ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో...ఓ...
రాముని అవతారం... రవికులసోముని అవతారం....


పల్లవి :


రాముని అవతారం ...రవికులసోముని అవతారం
రాముని అవతారం ...రవికులసోముని అవతారం
సుజనజనావన ధర్మాధారం...దుర్జనహృదయవిదారం ...
రాముని అవతారం


చరణం 1:


దాశరథిగ శ్రీకాంతుడు వెలయూ...కౌసల్యాసతి తపము ఫలించూ
జన్మింతురు సహజాతులు మువ్వురు...
జన్మింతురు సహజాతులు మువ్వురు...లక్ష్మణ.. శత్రుఘ్న.. భరతా
రాముని అవతారం ...రవికులసోముని అవతారం


చరణం 2:


చదువులునేరుచు మిషచేత... చాపముదాలిచి చేతా
విశ్వామిత్రుని వెనువెంట ... యాగముకావగ చనునంట
అంతము చేయునహల్యకు శాపము ... అంతము చేయునహల్యకు శాపము
వొసగును సుందర రూపం ...


రాముని అవతారం...రవికులసోముని అవతారం
ధనువో జనకుని మనసున భయమో... ధారుణి కన్యాసంశయమో
దనుజులు కలగను సుఖగోపురమో...
దనుజులు కలగను సుఖగోపురమో...విరిగెను మిథిలానగరమునా
రాముని అవతారం రవికులసోముని అవతారం
కపట నాటకుని పట్టాభిషేకం... కలుగును తాత్కాలిక శోకం
భీకర కానన వాసారంభం ... లోకోద్ధరణకు ప్రారంభం
భరతుని కోరికతీరుచుకోసం ...పాదుకలొసగే ప్రేమావేశం
భరతుని కోరికతీరుచుకోసం ...పాదుకలొసగే ప్రేమావేశం
నరజాతికినవ నవసంతోషం ...గురుజనసేవకు ఆదేశం
రాముని అవతారం రవికులసోముని అవతారం

చరణం 3:

అదిగో చూడుము బంగరు జింకా... అదిగో చూడుము బంగరు జింకా...
మన్నైకనునయ్యో లంకా... హరనయనాగ్ని పరాంగన వంకా...
అరిగిన మరణమె నీకింకా...


రమ్ము రమ్ము హే భాగవతోత్తమ ...వానరకుల పుంగవ హనుమా
రమ్ము రమ్ము హే భాగవతోత్తమ... వానరకుల పుంగవ హనుమా
ముద్రిక కాదిది భువన నిదానం... ముద్రిక కాదిది భువన నిదానం..
జీవన్ముక్తికి సోపానం... జీవన్ముక్తికి సోపానం


రామ రామ జయ రామ రామ జయ రామ రామ రఘుకులశోమా...
సీతాశోక వినాశనకారి... లంకావైభవ సంహారి
అయ్యో రావణ భక్తాగ్రేసర అమరంబౌనిక నీ చరిత...
సమయును పరసతిపై మమకారం...వెలయును ధర్మవిచారం
రాముని అవతారం... రవికులసోముని అవతారం
రాముని అవతారం... రవికులసోముని అవతారం



Tuesday, December 4, 2012

వెన్నెలకేలా నాపై కోపం

చిత్రం: కానిస్టేబుల్ కూతురు (1962) 
సంగీతం: ఆర్. గోవర్ధన్ 
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 
నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్ 

పల్లవి: 

వెన్నెలకేలా నాపై కోపం సెగలై ఎగసినదీ 
ఈ పూవునకేలా నాపై కోపం ముల్లై గుచ్చినది 

కన్నులకేలా నాపై కోపం కణకణలాడినవి 
నీ చూపులకేనా నాపై కోపం తూపులు దూసినవి 

వెన్నెలకేలా నాపై కోపం సెగలై ఎగసినదీ 
ఈ పూవునకేలా నాపై కోపం ముల్లై గుచ్చినది 

చరణం 1: 

బులిపించు పైట కలహించి అకటా తరిమినదెందులకో… 
బులిపించు పైట కలహించి అకటా తరిమినదెందులకో… 
నీ వలపులు చిందే పలుకుల విందే చేదుగ మారినదో 
పీటలపైన పెళ్ళిదినాన మాటలు కరువైనా 
నన్ను ఓరచూపుల కోరికలూరా చూడవా నీవైనా.. 

వెన్నెలకేలా నాపై కోపం సెగలై ఎగసినదీ 
ఈ పూవునకేలా నాపై కోపం ముల్లై గుచ్చినది 

చరణం 2: 

మరదలు పిల్లా జరిగినదెల్లా మరచుటే మేలుగదా.. 
ఓ..ఓ..ఓ.. మరదలు పిల్లా జరిగినదెల్లా మరచుటే మేలుగదా.. 
నిను కోరిన బావను కూరిమి తోడను చేరుటే పాడిగదా .. 
నిను కోరిన బావను కూరిమి తోడను చేరుటే పాడిగదా .. 

వెన్నెలకేలా నాపై కోపం సెగలై ఎగసినదీ 
ఈ పూవునకేలా నాపై కోపం ముల్లై గుచ్చినది

చిగురాకుల ఊయలలో

చిత్రం: కానిస్టేబుల్ కూతురు (1962) 
సంగీతం: ఆర్. గోవర్ధన్ 
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 
నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల 

పల్లవి: 

చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా 
మధురాశలు పలికేవో... నా మనసును చిలికేవో..ఓ..ఓ 
చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా ఆ ఆ 

చరణం 1: 

నీ అడుగుల జాడలలో... నా నీడను కలిపేనా 
నీ చూపుల కాంతులలో... నా రూపును నిలిపేనా..ఆ..ఆ..అ 

చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా ఆ ఆ 

చరణం 2: 

నా దారిలో నిను జూచి... నును సిగ్గుతో తొలగేనా ఆ ఆ ఆ 
కలలో నిను కనినంతా నిజమే అని పిలిచేనా..ఆ..ఆ..ఆ 

చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా 
మధురాశలు పలికేవో.. మా చెల్లిని పిలిచేవో..ఓ..ఓ.. 
చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా ఆ ఆ 

చరణం 3: 

విరిపూలతో ఆడును లే... చిరుగాలితో పాడును లే 
మా చెల్లెలు బాల సుమా.. ఏమెరుగని బేల సుమా..ఆ..ఆ..ఆ 

చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా 
మధురాశలు పలికేవో.. మా చెల్లిని పిలిచేవో..ఓ..ఓ.. 
చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా ఆ ఆ