స్వరాల పల్లకి
Guest Book
[Sign My Guestbook]
[View My Guestbook]
Powered by E-Guestbooks Server
.
Tuesday, December 19, 2017
ఏమని ఏమని అనుకుంటున్నది
చిత్రం : మురళీకృష్ణ (1964)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం : సుశీల
పల్లవి :
ఏమని ఏమని అనుకుంటున్నది... నీ మనసేమని కలగంటున్నది
ఏమని ఏమని అనుకుంటున్నది... నీ మనసేమని కలగంటున్నది
విరిసిన పువ్వులు ముసిముసి నవ్వులు... కసిగా ఎందుకు కవ్విస్తున్నవి
ఏమని ఏమని అనుకుంటున్నది... నీ మనసేమని కలగంటున్నది
చరణం 1 :
ఏదో ఏదో వినపడుతున్నది... ఎదలో ఏదో కదులుతున్నది
ఏదో ఏదో వినపడుతున్నది... ఎదలో ఏదో కదులుతున్నది
తీయని తలపులు తలలెత్తి... తెలియని హాయిని వెదకుతున్నది
ఏమని ఏమని అనుకుంటున్నది... నీ మనసేమని కలగంటున్నది
చరణం 2 :
మెరమెరలాడే వయసున్నది... అది బిరబిర చరచర పరుగెడుతున్నది
మెరమెరలాడే వయసున్నది... బిరబిర చరచర పరుగెడుతున్నది
మిసమిసలాడే సొగసున్నది... అది గుసగుసలెన్నో చెబుతూ వున్నది
ఏమని ఏమని అనుకుంటున్నది... నీ మనసేమని కలగంటున్నది
చరణం 3 :
ఆడమన్నది పాడమన్నది.... ఓ...ఓ...ఓ...
ఆనందానికి ఎరవేయమన్నది
ఊరించే నను ఉడికించి.... ఒంటరితనము ఓపనన్నది
ఒంటరి తనము ఓపనన్నది
ఏమని ఏమని అనుకుంటున్నది... నీ మనసేమని కలగంటున్నది
ఏమని ఏమని అనుకుంటున్నది... నీ మనసేమని కలగంటున్నది
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment