Tuesday, December 19, 2017

కుశలమా ప్రియతమా

చిత్రం :  అ ఆ ఇ ఈ (1994)
సంగీతం :  రాజన్-నాగేంద్ర
గీతరచయిత :  వేటూరి
నేపధ్యగానం :  బాలు, చిత్ర


పల్లవి :



కుశలమా ప్రియతమా...  విరహమే ప్రణయమా
దయరాదా కోపమా... దరి చేరా పాపమా
కబురే లేదు ఇన్నాళ్ళుగా... కలయా.. కలయికా


కుశలమా ప్రియతమా...  విరహమే ప్రణయమా


చరణం 1 :


కన్నుల్లోనా ప్రాణాలు నిలిపి... వెన్నెల్లోనా ప్రాయాలు తడిపి
కాలాలన్నీ కన్నీట గడిపి... దీపాలెన్నో చూపుల్లో చిదిపి
ఏకాంతంలోనా ఓ సాయంత్రం లాగా...
నీకై వేచి వేచీ వేగుచుక్కనైతిరా


నిన్నే కోరి ఆరాలు అడిగి... నీలాకాశం తీరాలు వెతికి
శీతాకాలంలో చన్నీరెండల్లాగా ... నీవే రానీ పూలదారినైతి నా చెలి


కుశలమా ప్రియతమా...  విరహమే ప్రణయమా
దయరాదా కోపమా... దరి చేరా పాపమా
కబురే లేదు ఇన్నాళ్ళుగా... కలయా.. కలయికా


కుశలమా ప్రియతమా...  విరహమే ప్రణయమా 



చరణం 2 :


శ్రీకారంలో క్రావళ్ళు విరిచి... చీరంచుల్లో కుచ్చిళ్ళు మడిచి

స్వప్నాలొస్తే నా కళ్ళు తెరిచి... స్వర్గంలాగా నా ఒళ్ళు మరిచి

వయ్యారం చూసి నా ఓంకారం రాసి... దేవీ నీకే నేను పాదదాసుడైతినే



మాలక్ష్మమ్మ పాదాలు కడిగి... మంగళగౌరిని మాంగళ్యమడిగి
శ్రావణమాసంలో ఆ శుభముహూర్తం కోసం...
స్వామీ నాకై నేనూ ఎంత భారమైతిరా... 



కుశలమా ప్రియతమా...  విరహమే ప్రణయమా
దయరాదా కోపమా... దరి చేరా పాపమా
కబురే లేదు ఇన్నాళ్ళుగా... కలయా.. కలయికా


కుశలమా ప్రియతమా...  విరహమే ప్రణయమా 




No comments:

Post a Comment