Friday, December 8, 2017

చెరసాల పాలైనావా

చిత్రం : దొంగరాముడు (1955)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం : ఘంటసాల 


పల్లవి : 


చెరసాల పాలైనావా...
చెరసాల పాలైనావా
ఓ సంబరాల రాంబాబూ... చెరసాల పాలైనావా



చరణం 1 :



అనుకున్నది నీవొకటి... అయినది మరి వేరొకటి
అనుకున్నది నీవొకటి... అయినది మరి వేరొకటి
ముందు చూపు లేదాయె... మాయని అపవాదాయె


చెరసాల పాలైనావా... 


చరణం 2 :



పరువే తన పెన్నిధిగా బ్రతికే నీ సోదరిని
పరువే తన పెన్నిధిగా బ్రతికే నీ సోదరిని


పూలమ్మిన చోటనే కట్టెలమ్మగా జేసి
పూలమ్మిన చోటనే కట్టెలమ్మగా జేసి
నిలువ నీడ పోద్రోసి నడివీధుల పాల్చేసి


చెరసాల పాలైనావా... ఓ సంబరాల రాంబాబూ...
చెరసాల పాలైనావా... 



చరణం 3 :



నిన్ను గని... మెచ్చుకొని నీకే మనసిచ్చుకొని
నిన్ను గని... మెచ్చుకొని నీకే మనసిచ్చుకొని
ఎన్నెన్నో కలలుగనే...
ఎన్నెన్నో కలలుగనే....
చిన్నదాని జీవితము చీకటిగా జేసి


చెరసాల పాలైనావా... ఓ సంబరాల రాంబాబూ
చెరసాల పాలైనావా... 



చరణం 4 :




ఫలి యిమ్మని ఆశించిన ఫక్కుమనే నొక పలువ
పైసలాశ జూపించి ఓర జూచునొక ఉలువ
పని చూపి పరువు మాపి... పైటలాగు నొక చెలటి
అండలేని ఆడదాని కాదరణే కరువా... ఆదరణే కరువా







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=19541

No comments:

Post a Comment