చిత్రం : సిరి సంపదలు (1962)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : శాంత కుమారి
పల్లవి :
చిట్టి పొట్టి పాపలు... చిరుచిరు నవ్వుల పువ్వులు

మీరే మా సిరిసంపదలు... వరాల ముద్దుల మూటలు
తరతరాల వరాల పంటలు
చిట్టి పొట్టి పాపలు... చిరుచిరు నవ్వుల పువ్వులు
చరణం 1 :
పిల్లలు కిలకిలనవ్వాలి... ఇల్లే కళకళలాడాలి

ఆడాలి బులిబులి బుడిబుడి పాటలలో పుట్టితేనెలే కురవాలి
చిట్టి పొట్టి పాపలు... చిరుచిరు నవ్వుల పువ్వులు
చరణం 2 :
కోపాలొలికె గోకులమందు పాలు వెన్న తినినంతా

కానీ... యశోద వాని కడుపును చూచి...
కానీ యశోద వాని కడుపును చూచి..పెట్టిన బువ్వే బలమంతా
చిట్టి పొట్టి పాపలు... చిరుచిరు నవ్వుల పువ్వులు
చరణం 3 :
ఆకాశంలో వెండి తారలకు... ఒకే చంద్రుడు ఉన్నాడు

ముద్దులొలుకు ఈ ముగ్గురి కోసం
ముద్దులొలుకు ఈ ముగ్గురి కోసం
వాడే బిరబిర దిగి వచ్చాడు
ఎవరూ... బావా...
బావా బావా పన్నీరు.. బావను పట్టుకు తన్నేరు...

తంతే బావా ఊరుకోడు.. తాళి కట్టి లాక్కెళ్తాడు
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1102
No comments:
Post a Comment