Wednesday, January 3, 2018

పైసా పైసా పైసా హైలెస్సా



 చిత్రం :  భలే రంగడు (1969)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  దేవులపల్లి 
నేపధ్య గానం :  ఘంటసాల 



పల్లవి :



పరువు నిచ్చేది... దొరను చేసేది
పట్టపగ్గంలేని పదవి తెచ్చేదీ... పైసా


హో... పైసా..పైసా..
పైసా పైసా పైసా హైలెస్సా... హొలెస్సా
పైసా పైసా పైసా హైలెస్సా... హొలెస్సా 




చరణం 1 :



కాసుంటే కలకటేరు... కలిగుంటే గవరనేరు
కాసుంటే కలకటేరు... కలిగుంటే గవరనేరు
డబ్బు బాగవుంటే వాడి దెబ్బ కెవరు సాటిరారు


పైసా..పైసా..
పైసా పైసా పైసా హైలెస్సా... హొలెస్సా 




చరణం 2 :



ఉంటే నవాబు సాహెబు... సలాం సలాం... ఆదాబ్ బరజ్
లేకుంటే గరీబు..సాహెబు... గులాం గులాం... హాయ్..అల్లా
ఉంటే నవాబు సాహెబు... సలాం సలాం.. 
లేకుంటే గరీబు సాహెబు... గులాం గులాం.. 


డబ్బులేక సుఖంలేదు..సుఖం లేక బ్రతుకు లేదు
డబ్బులేక సుఖంలేదు..సుఖం లేక బ్రతుకు లేదు
అదీ ఇదీ కలిసుంటే..మనిషికేమి లోటులేదు



పైసా..పైసా..
పైసా పైసా పైసా హైలెస్సా... హొలెస్సా 



చరణం 3 :



ప్రతిరోజు చందురుణ్ణి... పలకరించి రావచ్చు
కొండమీద చుక్కపూలు... కోసుకొని తేవచ్చు
ప్రతిరోజు చందురుణ్ణి... పలకరించి రావచ్చు
కొండమీద చుక్కపూలు... కోసుకొని తేవచ్చు 


రవ మువ్వల తెప్ప.. .రవగాలికి తెరచాప
రవ మువ్వల తెప్ప..రవగాలికి తెరచాప
వదిలేసి వలవేసీ... వదిలేసి వలవేసీ
కడలికడుపులో..ముత్యాల్ గంపెడేసి తేవచ్చు



హో... పైసా..పైసా..
పైసా పైసా పైసా హైలెస్సా... హొలెస్సా
పైసా పైసా పైసా హైలెస్సా... హొలెస్సా 





\

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1226

No comments:

Post a Comment